ఎసిడిటి 26-12-10.
వైద్యుడు లేని చోట అవకాశాలు లేని చోట ఎసిడిటి ఎక్కువైతే పక్కకు తిరిగి పడుకోవాలి.
రక్త పరీక్ష కోసం సూది గుచ్చినపుడు నొప్పి తెలియకుండా ఉండాలంటే :---
చిన్నగా దగ్గితే తాత్కాలికంగా చాతీలోపల ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన రిలీఫ్ వచ్చి నొప్పి తెలియదు.
బాండేజ్ తొలగించాలంటే 5-1-11.
శరీరం మీద గాయమై బాండేజీ వేసినపుడు అది బిగుసుకు పోయి సమస్య ఏర్పడుతుంది.
దానిని తొలగించడానికి దూదిని వుండగా చేసి వేడి నీటిలో ముంచి బాండేజీ పై తడిపితే చాలా సులభంగా వూడి వస్తుంది.
వేలికి ఉంగరం బిగుసుకు పోతే 6-1-11.
థైరాయిడ్ , చర్మము , కీళ్ళకు సంబంధించిన వ్యాధులు శరీరం లో వున్నపుడు ఈ విధంగా బిగుసుకుపోవడం జరుగుతుంది.
1. చేతులను ముందు రిలాక్స్ చెయ్యాలి. చేతులను పైకేత్తాలి. ( గుండె కంటే పైకి) చేతులనుండి రక్తం కిందికి ప్రసరిస్తుంది. ఇప్పుడు సులభంగా తీయవచ్చు.
2. వాచిన వేలు మీద ఐస్ క్యూబ్ ని ప్రయోగించాలి.
3. సబ్బుగాని, ఆముడంగాని వెలి మీద ప్రయోగించాలి.
4. ఒక వంచ గలిగిన వైర్ ను తీసుకుని ఉంగరంలోకి దూర్చాలి. ఉంగరం లాగే దాన్ని వేలికి రెండు. మూడు చుట్లు చుట్టి నెమ్మదిగా లాగుతూ వూడదీయాలి
హోల్డర్ నుండి పగిలిన బల్బు ను తీయాలంటే 7-1-11.
పెద్ద సైజు బంగాళా దుంపను రెండు ముక్కలుగా కోసి వాటితో బుల్బు ను రెండు వైపులా గుచ్చి పట్టుకునితిప్పితే చేతికి గాయం కాకుండా తీయవచ్చు.
తెల్లవారుజామున ఏర్పడే రక్త ప్రసరణ సమస్య 10-1-11.
తెల్లవారుజామున 4, 5 గంటల ప్రాంతంలో కొంతమందికి రక్తప్రసరణ సమస్యలు ఏర్పడుతూ
వుంటాయి. అరిచేతుల ద్వారా ఉష్ణోగ్రత బయటకు పోతుంది. దీనిని నివారించడానికి అరిచేతులను
చంకల్లో పెట్టుకుని గట్టిగా నొక్కాలి. దీని వలన శరీరంలోని ఉష్ణోగ్రత బయటకు పోదు.
ప్రయాణాల లో వాంతులు --- నివారణ 26-1-11.
శొంటి పొడిని ఖాళీ గా వున్నా క్యాప్స్యుల్స్ లో నింపి నిల్వ చేసుకోవాలి.
ప్రయాణంలో వాంతి అయిన వెంటనే ఎక్కువ నీళ్ళు తాగాలి. వాంతి నుండి దృష్టి మరల్చాలి.
ప్రయాణానికి ముందు రెండు టీ స్పూన్ల అల్లం రసాన్ని ఒక టీ స్పూను తేనెతో కలిపి తీసుకుని
బయలుదేరితే వాంతులు కావు. లేదా రెండు శొంటి పొడి క్యాప్సుల్స్ ను వేసుకుని బయలుదేరాలి.
తెల్లవారుజామున 4, 5 గంటల ప్రాంతంలో రక్త ప్రసరణ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ సమయంలోడాక్టర్ వెంటనే దొరకడం కష్టం అవుతుంది. ఈ సమస్య ఏర్పడినపుడు ఉష్ణోగ్రత అరచేతుల ద్వారా బయటకు పోతుంది. దీనిని నివారించడానికి అరిచేతులను చంకలలో పెట్టుకొని గట్టిగా నొక్కాలి,
దీని వలన శరీరంలోని ఉష్ణం బయటకు పోదు.
ఐస్ క్రీం తిన్న తరువాత వచ్చే తల నొప్పి --నివారణ 11-1-11
ఐస్ క్రీం తిన్న తరువాత కొంతమందికి తలనొప్పి వస్తుంది. అంగిట్లో రక్తనాళాలు సంకోచించడం వలన తలలో కూడా సంకోచిస్తాయి అనే ఫీలింగ్ మైండ్ లో వస్తుంది దానితో తల నొప్పి వస్తుంది.
అంగిట్లో నాలుకతో గట్టిగా అదిమి పెడితే ఆ ఫీలింగ్ తగ్గి తలనొప్పి తగ్గుతుంది.
పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే 13-1-11.
ముళ్ళు బయటకు కనిపిస్తుంటే రెండు బొటన వ్రేళ్ళతో దగ్గరగా నొక్కుతూ పైకి తీసుకు రావడానికి ప్రయత్నించాలి.
నోటితో తీయడానికి మాత్రం ప్రయత్నించకూడదు.
ముళ్ళు లోపలికి వుంటే దూదిని స్పిరిట్ తో తడిపి ఆ ప్రదేశంలో రుద్ది సూదితో గుచ్చి పైకి లేపి శ్రావణం(ఫోరేసేప్స్) తో తీయాలి. సూదితో తీయలేని పక్షంలో నైల్ కట్టర్ తో చర్మం తొలగించి సూదితో తీయాలి.
పిల్లలు ముక్కులోకి బలపాలను దోపుకుంటే 23-1-11.
బలపం బయటకు కనిపిస్తూ వుంటే ఫోర్సేప్స్ తో తీయడానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే ప్రయత్నించాలి.
సావకాశంగా కూర్చోబెట్టి నోటితో గాలి పీల్చమని చెప్పి, ఖాళీ గా ఉన్న ముక్కుతో చీదమని చెప్పాలి.
శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతే ( హైపో తెర్మియా ) 24-1-11.
వెచ్చని ప్రదేశంలోకి వెళ్ళాలి. గులక రాళ్ళను వేడి చేసి అరివేసి చంకలు, గజ్జలు, ఉదరం మొదలైన ప్రదేశాలలో మెల్లగా కాపడం పెట్టాలి.
వేడి పదార్ధాలను, తేనె, స్వీట్లు, తక్షణ శక్తినిచ్చే పదార్ధాలను ఇవ్వాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి