దోమల విద్వంసిని లేక మశక నాశని 3-3-09.
వేపాకు పొడి
దోరగా వేయించిన ఆవాల పొడి
కల్లు ఉప్పు పొడి
అన్నింటిని సమానంగా తీసుకొని కలపాలి.
ఒక మట్టి మూకుడు తీసుకొని దానిలో పిడకను ముక్కలుగా చేసి మధ్యలో కర్పూరం పెట్టి అంటించి నిప్పు చెయ్యాలి. బాగా నిప్పు అయిన తరువాత దాని మీద పొడిని చల్లాలి. దీనిని ఇంట్లో పెట్టినపుడు ముందుగా కిటికీలు, తలుపులు వేసి పొగ పెట్టి 10 నిమిషాలు వుంచి తలుపు తీయాలి.
దీనిలో ఉత్తరేణి ఆకుల పొడి, కానుగ ఆకులు, సీత ఫలం ఆకుల పొడి, పొగాకు పొడి మొదలైనవి కూడా వేయవచ్చును.
దోమలు కుట్టకుండా కాపాడే ఆయుర్వేద తైలం 7-4-11.
కొబ్బరి నూనె --- 100 gr
వేపనూనె --- 3 ml
లెమన్ గ్ర్యాస్ ఆయిల్ --- 5 ml
దేవదారు తైలం --- 2 ml
ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకుని దానిలో మిగిలిన పదార్ధాలను కలపాలి. దీనిని సీసాలో
పోసి మూతపెట్టి బాగా గిలక్కొట్టాలి. దీనిని నిల్వ చేసుకోవాలి.
అర టీ స్పూను తైలం చేతిలో వేసుకుని రుద్ది శరీరం మీద అనాచ్చాదిత భాగాలలో రాయాలి.
దీని వలన క్రిములు, దోమలు కుట్టవు.
కీటకాలు ఘాటైన స్ప్రే ల వంటి వాసనలకు ఆకర్షింప బడతాయి.
దోమలు కుట్టకుండా క్రీమ్ 4-8-11.
తేనేమైనం --- 10 gr
బాదం నూనె --- 20 ml
వేపనూనె --- 5 ml
యూకలిప్టస్ ఆయిల్ --- 2 ml
ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి వేడి చేయాలి . ఆ నీటిలో చిన్న గిన్నెను పెట్టి దానిలోవడకట్టిన తేనేమైనం వేయాలి
దీనికి బాదం నూనె , వేపనూనె కలపాలి . బాగా కలపాలి . కరిగిన తరువాత దింపి కొద్దిగా చల్లారిన తరువాత దానిలో
యూకలిప్టస్ ఆయిల్ ను కలపాలి . తరువాత కొంచం వేడిగా , ద్రవరూపం లో ఉండగానే దానిని వెడల్పు మూత వున్న
సీసాలో భద్రపరచుకోవాలి
ఇది గడ్డకట్టి ఆయింట్మెంట్ లాగా తయారవుతుంది దీనిని కొద్దిగా చేతిలోకి తీసుకొని శరీరం మీద దోమలు కుట్టే
ప్రాంతంలో పల్చగా [పూయాలి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి