పిత్తాశయము (గాల్ బ్లాడర్ ) లో రాళ్ళు--నివారణ 25-5-10.
అతి ముఖ్యమైన గ్రంధులలో కాలేయము ఒకటి.ఇది పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పైత్యరసాన్ని పిత్తాశయము నిల్వ చేస్తుంది. పిత్తాశాయములో ఒక్కో సారి ఈ రసము గట్టి పడి రాళ్ళు లాగా మారుతుంది.
గాల్ బ్లాడర్ లో Bile juice, bile salts, కొవ్వు కణాలు, నీరు వుంటాయి. గాల్ బ్లాడర్ లో సరిగా కదలికలు లేకపోవడం గోడలు గట్టి పడడం, పదార్ధములో మార్పుల వలన రాళ్ళు ఏర్పడతాయి.
ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క కదలికల తేడాల వలన సమస్యలు ఏర్పడతాయి.

మద్యపానం అలవాటు, మధుమేహ వ్యాధి వున్నవాళ్ళలో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
ఒబేసిటీ ని అకస్మాత్తుగా తగ్గించడం వలన కూడా ఈ సమస్య ఏర్పడుతుంది.
లక్షణాలు;-- ఈ సమస్య వున్నవాళ్ళకు అన్నం తిన్న వెంటనే పొట్టలో కుడి పక్క నొప్పిగా వుంటుంది. కడుపు ఉబ్బరింపు, వాంతులు కావడం, మలము నల్లగా రావడం, చలి జ్వరం, పచ్చకార్లు రావడం జరుగుతుంది. వీపు మీద నొప్పి రావడం జరుగుతుంది.
నారికేళ లవణం
లేతగా కాకుండా, ముదురుగా కాకుండా మధ్యరకంగా వున్న కొబ్బరి కాయను తీసుకోవాలి. దాని పై వున్న పీచును తొలగించి ఒక కంటిలో రంధ్రం చెయ్యాలి. కాయలోని నీళ్ళను తీసేయ్యాలి. కొబ్బారి కాయను సైంధవ లవణం పొడితో నింపాలి.
ఒక పలుచని గుడ్డను తీసుకొని మెత్తటి బంకమట్టి పూసి టెంకాయ కనబడకుండా ఆ గుడ్డను చుట్టాలి. బాగా ఆరనివ్వాలి. 10 15 ఆవు పిడకలు తెచ్చి కొబ్బరి కాయ చుట్ట్టు పేర్చి పుటం వెయ్యాలి. పుటాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మట్టిని తొలగించి కాయను పగులగొట్టి కొబ్బరిని తీయాలి. కొబ్బరి మాడి వుంటుంది.
దానిని పొడి చేసి సీసాలో భద్ర పరచుకోవాలి.
పావు టీ స్పూను పొడిని అరగ్లాసు మజ్జిగలో కలిపి ఆహారానికి ముందుగాని, తరువాతగాని సేవించాలి.
ఈ విధంగా నెల రోజులు వాడితే ఆపరేషన్ అవసరం లేకుండా నివారించుకోవచ్చు.
దీనిని వాడడం వలన అజీర్ణము, పరిణామ శూల మొదలగునవి నివారింప బడతాయి. గాస్త్రిక్ ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి అయ్యేట్లు చేస్తుంది.
పరిణామ శూల అనగా అన్నము తిన్న తరువాత క్రమం తప్పకుండా కడుపులో నొప్పి రావడం.
పిత్తాశయం ఆరోగ్యంగా ఉండాలంటే 13-6-11.
జాజికాయ
జాపత్రి
పచ్చకర్పూరం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నూరి నిల్వ చేసుకోవాలి.
ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కందిగింజంత మాత్ర వేసుకోవాలి. ఈ విధంగా 40 రోజులు
వాడాలి.