రోమాలు

                                  అవాంచిత రోమాలు-- నివారణ                                    28-5-09.

            హార్మోన్లలో తేడా వలన వస్తాయి.

1. అర్ధ మత్స్యాసనం;--  పద్మాసనం వేసుకొని కుడికాలును ఎడమ మోకాలు పై పెట్టుకొని చేతితో కాలును పట్టుకొని  వెనక్కి వంగాలి. అలాగే రెండవ వైపు చెయ్యాలి.

2. యోగాముద్రాసనం:-- ఈ ఆసనం వేయడం వలన ఎంత కాలం నుండి ఋతుక్రమం  ఆగిపోయివున్నా తిరిగి   ప్రారంభం అవుతుంది.

3.విపరీత కరణి :-- వెల్లకిలా పడుకొని నడుము వరకు కాళ్ళను పూర్తిగా పైకెత్తి చేతులను పిరుదుల దగ్గర పట్టుకోవాలి.

4. మత్స్తాసనం:-- వెల్లకిలా పడుకొని తలను వెనుకకు వంచి చేతులను పొట్టపై పెట్టుకోవాలి.
5గరుడాసనం :-- నిటారుగా నిలబడి కుడికాలు చుట్టూ ఎడమ కాలును బిగించి చేతులు పైకెత్తి మెలిక లాగా  వేసుకోవాలి. అదే విధంగా రెండవవైపు చేయాలి. ఈ విధంగా చేస్తే అవాంచిత రోమాలు వాటంతట అవే తగ్గి పోతాయి. 

        శమీ వృక్షానికి రోమ హస్త్రి అని పేరు అనగా రోమాలను పోగొట్టునది అని అర్ధము.

        దీని బెరడు తెచ్చి చాది గంధం తీసి వెంట్రుకలపై పట్టు వెయ్యాలి. వెంట్రుకలు పీకి రంధ్రాల పై పట్టు వేస్తే  ఇంకా మంచిది.  కాని మంట పుట్టవచ్చు కొబ్బరినూనె పూస్తే మంట తగ్గుతుంది.

       జమ్మి ఆకుల రసం గాని, లేదా వ్రేళ్ళ యొక్క గంధంగాని పూయవచ్చు.

                          అవాంచిత రోమాలు --నివారణ                            28-12-10.
 
       మహిళలలో బహిష్టు తరువాత ఒక సిస్ట్ ఏర్పడుతుంది.  కాని ఒక్కొక్క సారి ఇవి ఎక్కువగా విడుదల అవుతాయి  ఈ కారణం వలన, మరియు హార్మోన్ల లో తేడాల వలన,  వంశ పారంపర్యం కారణంగా ఈ సమస్య   ఏర్పడవచ్చు.
 
1.  బీర గింజల నుండి తీసిన నూనెను అవాంచిత   రోమాలపైన రాస్తే పెరగవు.
 
2.  జమ్మి ఆకులు
     జమ్మి కాయలు
     జమ్మి పట్ట
 
              అన్నింటిని కలిపి  ముద్దగా నూరి పూయవచ్చు. లేదా అన్నింటిని ఎండబెట్టి కాల్చి బూడిదను పూస్తే తగ్గుతాయి.
 
3.  ఉమ్మెత్త గింజలను ( విష పదార్ధము)  నూరి పూస్తూ వుంటే తగ్గుతాయి.
 
4.  గన్నేరు వేరు, నేపాళపు వేరు, తెగడ వేరు, చేదు బీరపండ్లు, కలిపి ముద్దగా నూరి నీటిలో ఉడికించి వడకట్టి ఆ కషాయాన్ని నువ్వుల నూనెలో కలిపి నూనె మాత్రమె మిగిలే వరకు కాచాలి.

     ఈ తైలాన్ని అవాంచిత రోమాలపై రాస్తూ వుంటే  పెరగవు.

     ఆకులను,  కాయలను,  పట్టను  కలిపి నూరి కూడా పూయవచ్చు . లేదా అన్నింటిని కలిపి ఎండబెట్టి  కాల్చి,  బూడిద చేసి కూడా పూయవచ్చు .
                                                          14-7-11

 1 యవాక్షారం యొక్క పొడిని వెంట్రుకలపై పూస్తూ వుంటే కొంత కాలానికి రాలిపోతాయి .
 2 ఉత్తరేణి మొక్కను సమూలంగా తెచ్చి రేకు మీద పెట్టి కాల్చి బూడిద ( ఉత్తరేణి క్షారం )  చేయవలెను .  దీనికి నీటిని కలిపి
పోయాలి .
 3. కుసుమ నూనెను పూస్తూ వుంటే కొంత కాలానికి రాలిపోతాయి .

                                                          

 
 

1 కామెంట్‌: