నూనెలు --- ప్రాధాన్యత

                                                   నూనెలు --- ప్రాధాన్యత


                                                              ఆముదం                                   3-1-11.

    లేని పోనీ అనుమానాలతో ఒక ఔషధ పదార్ధాన్ని రోజులలో వదిలేస్తున్నాము.
కడుపులోకి ఒకటి నుండి మూడు స్పూన్ల ఆముదాన్ని తీసుకోవచ్చు.

సయాటికా:--

ఆముదం      --- ఒక టీ స్పూను
పాలు           --- ఒక కప్పు
నీళ్ళు           --- ఒక గ్లాసు

       నీరంతా ఆవిరయ్యే వరకు కాచాలి. దీనిని తాగితే నొప్పి తగ్గుతుంది.

కీళ్ళ నొప్పులు:-    Shifting Joint Pain    ఆమ వాతము

  ప్రతి రోజు రెండు స్పూన్ల ఆముదాన్ని రాత్రి పూట వేడి నీళ్ళ తో కలిపి తాగుతూ వుంటే ఖచ్చితంగా నొప్పులు   తగ్గుతాయి ( భావ ప్రకాశిక)

శరీరం బిగుసుకున్నపుడు :-- ఆముదాన్ని శరీరం మీద ధారగా పోయాలి. ( సుశ్రుత సంహిత)


                                                     ఆవనూనె                                     9-2-11.
1. దగ్గు :--

ఆవనూనె      --- ఒక టీ స్పూను
బెల్లం పొడి     --- ఒక టీ స్పూను

    రెండింటిని బాగా కలిపి పేస్ట్ లాగా చేయాలి. మోతాదు తో రోజుకు రెండు సార్లు వాడాలి.
విధంగా మూడు వారాలు వాడితే చాలా కాలంగా వున్న దగ్గు నివారింపబడుతుంది.

2. పాదాల మంటలు :--

ఆవ నూనె    --- ఒక టీ స్పూను
నీళ్ళు          --- ఒక టీ స్పూను

    రెండింటిని బాగా కలిపి పేస్ట్ లాగా చేసి పాదాలకు పూయాలి. మంటలు తగ్గుతాయి.











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి