గర్భిణి స్త్రీల సమస్యలు --తీసుకోవలసిన జాగ్రత్తలు

           గర్భిణి స్త్రీలలో ఆకలిని పెంచే మైత్రేయ మధుర పానీయం                       22-8-09.

  నిమ్మ రసం                       ----- 100 gr
 బత్తాయి రసం                    ----- 100 gr
పుల్ల దానిమ్మ రసం              ----- 100 gr
అల్లం రసం                          ----- 100 gr
పుదీనా నిజ రసం                 ----- 100 gr
ధనియాల రసం                   ----- 100 gr
జిలకర రసం                       ----- 100 gr
తేనె                                  ----- 250 gr
సైంధవ లవణం                    -----   10 gr
పంచదార                           ----- ఒకటిన్నర కిలో

     అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. పాకం వస్త్నుంది. బాగా నిల్వ పాకం వచ్చిన తరువాత చల్లార్చి తేనె కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

     ఒకవేళ పాకం ముదిరితే ఒక స్పూను తీసి బుగ్గన పెట్టుకొని చప్పరించాలి.

     రెండు స్పూన్ల పాకాన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగాలి.

     దీని వలన అన్నం సహించక పోవడం, ఒకరింపు, రుచి తెలియక పోవడం మొదలైనావి నివారింపబడతాయి

     దీనిని గర్భిణి స్త్రీలు మాత్రమే కాక  , చిన్న పిల్లలు, పెద్దలు అందరు వాడవచ్చు

    దీని వలన అత్యుష్ణము అణగారిపోతుంది.

                          సుఖ ప్రసవం జరగడానికి                                  24-5-10.
 
    10 గ్రాముల   మంచి మేలైన స్వచ్చమైన ఇంగువను గరిటలో వేసి అన్నం వార్చిన గంజిలో కలపాలి.
 
    నొప్పులు ప్రారంభమై ముదిరి అసలు నొప్పులు ప్రారంభమైన వెంటనే  ఆ గంజిని తాగిస్తే  10, 15 నిమిషాలలో సుఖ ప్రసవం జరుగుతుంది. ప్రసవం కాకపోతే మరలా తాగించవచ్చు.
 
     ఎడమ చేతిలో అయస్కాంతాన్ని పట్టుకుంటే నొప్పి తెలియకుండా ప్రసవం జరుగుతుంది.
 
     వస, పిప్పళ్ళు కలిపి నూరి నాభి చుట్టూ లేపనం చెయ్యాలి.

                                అబార్షన్  Threatend Abortion ) కాకుండా                   6-5-11.  
                                                                     
     యోని నుండి రక్తస్రావం, చిన్న చిన్న గడ్డలుగా రావడం, పొత్తి కడుపులో ఒక రకమైన ప్రత్యేకమైన నొప్పి,ప్రత్యేకమైన నడుము నొప్పి వంటి లక్షణాలు వుంటే గర్భ స్రావం అవుతుందని గుర్తించ వచ్చు.

 కొంతమందిలో  కొద్దిగా రక్త స్రావమే కనిపిస్తుంది , దీనివలన ప్రమాదమేమి లేదు.
 
నాగాకేసరాలు 
వెదురు ఉప్పు (వంశ లోచనం)
 
    రెండింటి చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకొని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
   అర కప్పు పాలలో ఒక టీ స్పూన్ పొడి, ఒక టీ స్పూను పంచదార చొప్పున ఒక్కొక పూటకు కలుపుకొని  ఉదయం, సాయంత్రం తీసుకుంటూ వుంటే  గర్భ స్రావం కాకుండా కాపాడుకోవచ్చు.  మరియు బిడ్డకు ఎలాంటి   అవలక్షణాలు లేకుండా జన్మిస్తుంది.
 
                 స్త్రీ  4, 5 నెలల గర్భిణిగా వున్నపుడు చేయవలసిన వ్యాయామం               22-9-10.
 
      స్త్రీ  గర్భం ధరించిన తరువాత భర్తతో కలవకూడదు.
 
శాంతి శయనాసనం:-- కొద్దిగా కాళ్ళు వెడల్పుగా పెట్టుకొని ఫ్రీ గా పడుకోవాలి. దీని వలన నడుము, పిక్కలు  శరీరాన్ని  బాగా సుఖంగా ఉన్నట్లు ఊహించుకొని పడుకోవాలి.
 
          గర్భ ధారణ సమయం లో తల్లి, బిడ్డ క్షేమం గా ఉండాలంటే                            25-11-10.
 
      బాదం పప్పులను పాలల్లో నానబెట్టి గుజ్జుగా నూరి కుంకుమ పువ్వు, పంచదార కలిపి ప్రతిరోజు
తాగాలి.
 
                  గర్భిణిగా వున్నపుడు  ఏర్పడే మలబద్ధకం --చికిత్స                               1-9-10.

లక్షణాలు:--

  ఎక్కువగా ముక్కవలసి రావడం, రక్తం ధారలుగా పాడడం, ఇంకా మలం మిగిలి ఉన్నదనే ఫీలింగ్
వంటి లక్షణాలు వుంటాయి.

     ఈ సమస్య హార్మోనలలో తీదాల వలన,  రక్త లేమి నివారణకు ఐరన్ మాత్రలు ఎక్కువగా వాడడం వలన,
పిండం పెరుగుతూ వుండడం వలన పేగుల మీద ఒత్తిడి కలిగి మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది.  ఒత్తిడి, ఆందోళన వలన కూడా మలబద్ధకం ఏర్పడుతుంది.

      విరేచనం కావడానికి మందులు వాడకూడదు.

గుల్ఖంద్               --6  టీ స్పూన్లు         ( గులాబి రేకులు  +  పంచదార )     
ఎండుద్రాక్ష ముద్ద -- ఒక టీ స్పూన్
పాలు                   --- ఒక కప్పు

     అన్ని కలిపి రాత్రి ఆహారం తరువాత వాడితే ఉదయం సాఫీగా ముక్కాల్సిన అవసరం లేకుండా సుఖ విరేచనమవుతుంది.

                           గర్భధారణ సమయంలో  వచ్చే మలబద్ధకం                              11-1-11.

     చాలినంత శారీరక వ్యాయామం లేకపోవడం వలన,  సరైన  పీచు పదార్ధాలు కలిగిన ఆహారం తీసుకోక పోవడం   వలన  ఈ సమస్య ఏర్పడుతుంది.
 
     ఈ సమస్యను నివారించడానికి పాతబియ్యపు అన్నం,  ఆకుకూరలు వాడాలి.   దానిమ్మ,  నారింజ,  పైనాపిల్  వంటి పండ్లను వాడాలి.   అన్ని పనులను యధాప్రకారం చేసుకోవాలి

     ఎండుద్రాక్ష పండ్ల ముక్కలు
                              పాలు             ---- అర గ్లాసు

            కొన్ని ఎండుద్రాక్ష పండ్లను చిన్నచిన్న ముక్కలుగా తుంచి పాలల్లో వేసి  చిన్న మంట మీద  మూడు  పొంగులు పొంగించాలి.  అలాగే తాగచ్చు లేదా దీనిలో కలకండ పొడి కలుపుకోవచ్చు.  ఒక్కొక్క ద్రాక్ష ముక్కను తిని  ఆ పాలు తాగాలి.  ఇది గుండెకు కూడా బలాన్నిస్తుంది.  బిడ్డకు రంగునిస్తుంది

         గర్భిణీ స్త్రీలలో రక్త హీనత వలన శరీరంలో నీరు చేరి లావెక్కుతూ వుంటే          14-3-11.

                   రక్తహీనతను  తగ్గించే ఆహారాన్ని తీసుకుంటూ  అల్లంరసం,  తేనె  కలిపి తీసుకోవాలి.

                                    గర్భిణి  స్త్రీలలో  జ్వరము  ---   నివారణ                        4-7-11.

తుంగ ముస్తల చూర్ణము        --- 50 gr
మారేడు పండు గుజ్జు చూర్ణం  --- 50 gr
వట్టి వేర్ల చూర్ణం                  --- 50 gr
సుగంధపాల వేర్ల చూర్ణం       --- 50 gr

        అన్ని చూర్ణాలను  కల్వం లో వేసి  తగినంత నీరు కలిపి  మాత్రకట్టుకు వచ్చేంత వరకు బాగా నూరాలి . తరువాత
బటాణీ   గింజలంత  మాత్రలు తయారు వ్హేసి నీడలో ఆరబెట్టి  తడి లేకుండా పూర్తిగా ఆరనిచ్చి సీసాలో నిల్వ చేసుకోవాలి .

      ఉదయం  +  మధ్యాహ్నం  + సాయంత్రం  పూటకు ఒకటి లేదా రెండు మాత్రల  చొప్పున మంచి నీటితో సేవించాలి .
ఇది వేడిని తగ్గిస్తుంది . రక్తపోటు రాకుండా కాపాడుతుంది






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి