మూత్రంలో రాళ్ళు
పసుపు పచ్చగా పండిన వేపాకులను తెచ్చి ,ఎండబెట్టి ,నలిపి,బాణలి లోవేసి మాడ్చాలి.
తరువాత జల్లించాలి. ఈ బూడిదను ఒక సీసాలో భద్రపరచుకోవాలి.

పావు టీ స్పూను పొడిని ఒక స్పూను తేనె కలిపి ఉదయం, సాయంత్రం వాడుతూ వుంటే మూత్రంలో రాళ్ళు అరిగి పోతాయి.
అతి మూత్ర సమస్య --నివారణ 1-2-09
.
.
కఫ శరీరం వున్న వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగ కూడదు .వాళ్ళు సహజంగానే నీటి శాతంతోనే పుడతారు.
బలమైన పసుపు కొమ్ముల పొడి ----50 gr
నల్ల నువ్వుల పొడి ----50 gr
త్రిఫల చూర్ణం ----50 gr
అన్నింటిని కలిపి ముద్ద అయ్యేట్లు దంచాలి. ఈ ముద్దను మాత్రలు కట్టాలి. చేదు అనిపిస్తే తాటిబెల్లం ఎక్కువగా కలుపుకోవచ్చు.పొడిగా కూడా వాడవచ్చు. ఉదయం, సాయంత్రం భోజనానికి ముందుగాని, తరువాత గాని ఒక మాత్ర నీటితో వేసుకోవాలి.
పిల్లలకు ---- 1,2 gr
పెద్దలకు ---- 3,4 gr
సమస్య ఎక్కువగా వున్నవాళ్ళు మోతాదు పెంచి వాడుకోవచ్చు, మరీ ఎక్కువగా వాడితే మూత్రం రావడం అసలే ఆగిపోవచ్చు. కావున జాగ్రత్తగా వాడాలి.
మూత్ర కృచ్చసమస్య --నివారణ 3-3-09.
మూత్రం బొట్లు బొట్లు గా పడడం
శరీరంలో వేడి, పైత్యం, కఫం ఎక్కువైతే ఈ సమస్య వస్తుంది. ఇది స్త్రీల లో కన్నా పురుషులలోనే ఎక్కువగా వస్తుంది.
ఈ సమస్య రాకుండా ఉండాలంటే :--
1. మూలబంధము :-- వజ్రాసనంలో ఆసనం లాగి బిగించి కూర్చోవాలి. కాళ్ళు వెనక్కు పెట్టుకొని మోకాళ్ళు నేలకు ఆనించాలి.
2. ఉడ్యానబంధము :--వజ్రాసనంలో కూర్చొని గాలిని లోపలి లాగి అంటే పొట్టను లోపలికి లాగి చేతులను మోకాళ్ళ పై పెట్టుకోవాలి. ఈ విధంగా గాలి పీలుస్తూ వదుల్తూ చెయ్యాలి. ఈ విధంగా చెయ్యడం వలన ఈ సమస్య రాదు.
3. పద్మాసనం లేదా అర్ధ పద్మాసనం లో నిటారుగా కూర్చోవాలి. చేతులను వెనక్కి పెట్టుకోవాలి. శరీరాన్ని పక్కటెముకల వైపు కుడి వైపుకు, ఎడమ వైపుకు వంచాలి. దీనిని గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి. పై విధంగా కూర్చొని, తలను వంచి మోకాలును గడ్డం తో అందుకోవాలి. అదే విధంగా కూర్చొని రెండు పిడికిళ్ళు బిగించి పొట్టను అదుముతూ తలను కిందికి వంచాలి.
చేయకూడని పనులు :-- వెన్ను పూసకు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, బహిష్టు అయిన వాళ్ళు, మెడ నొప్పి వున్న వాళ్ళు పై వ్యాయామాలు చెయ్యకూడదు.
సూచన :-- పరిమితిని మించి అతిగా భోజనం చేయరాదు.మద్యపానం, కుళ్ళిన మాంసం, అతినడక, అతి వ్యాయామం పనికి రావు.
ఎండిన కొండ పిండి వేళ్ళ పొడి
యాలకుల పొడి
దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి
శుద్ధ గో మూత్ర శిలాజతు లేదా అతిమధురం పొడి
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
ఒక కప్పు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని దానిలో పావు టీ స్పూను నుండి అర టీ స్పూను పొడిని కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి. దీనితో మూత్ర వ్యాధులు నివారింప బడతాయి.
మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ 4-3-09.
1. వాతజ మూత్ర కృచ్హము:--పొట్టను బాగా తైలం తో చెమట పట్టేటట్లు మర్దన చెయ్యాలి. (ఓమ,ప్రజా రక్షణ, గరిక, లేక నువ్వుల నూనె :--వీనిలో ఏదో ఒక తైలం తో మర్దన చెయ్యాలి. ఉదర చాలనం చెయ్యాలి.
మోకాళ్ళ మీద చేతులను పెట్టి కొద్దిగా వంగి పొట్టను వేగంగా కదిలించాలి. నిటారుగా నిలబడి చేతులను పూర్తిగా వదిలి గాలిని పీలుస్తూ ఒక కాలును వదలాలి. అదే విధంగా రెండవ కాలును కూడా నెమ్మదిగా లేపి దించాలి. అలాగే వెనక్కు పక్కలకు కూడా ఒక్కొక్క కాలును ఎత్తి దించాలి.
పిరుదులకు, నడుముకు మధ్య వెనక చేతులుంచి నడుమును వేగంగా, గుండ్రంగా తిప్పాలి, దీని
వలనచెమటపడుతుంది. వాయువులు పేరుకు పోవడం వలన ఏర్పడిన సమస్యలు తొలగి పోతాయి
.
వ్యాధిని గుర్తించడం :-- మూత్రం బొట్లు బొట్లు గా రావడం,
మూత్రం వచ్చేటపుడు నొప్పిగా వుండడం, పొత్తి కడుపుబిగుసుకుపోయి నొప్పిగావుండడం ,
గజ్జల్లో బిగుసుకున్నట్లు వుండడం, మర్మాంగం లో నొప్పి ఉంటాయి.దీనిని
బట్టి నొప్పి అంటే వాతం వలన అని గుర్తించాలి.
తిప్ప తీగ పొడి ----- 50 gr
అశ్వగంధ పొడి ----- 50 gr
పల్లేరు కాయల పొడి - -----50 gr
శొంటి పొడి ------50 gr
ఉసిరిక పొడి ------50 gr
అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి.
రెండు గ్లాసుల నీటిలో రెండు టీ స్పూన్ల పొడిని వేసి మరిగించి రెండు కప్పుల కషాయం మిగిలే విధంగా కాచి దించాలి.
దీనిని రెండు భాగాలు చేసి రెండు పూటలా తాగాలి.తేనె కలుపుకొని కూడా తాగవచ్చు. దీనితో మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ 5-3-09.
2. పిత్తజ మూత్ర కృచ్హము:--
లక్షణాలు:-- మూత్రం వచ్చినట్లే వుండి రాకుండా వుండడం. అతి ప్రవర్తన, అతిగా వ్యాయామం చెయ్యడం, అతిగా నడవడం, ఎక్కువ వేడిగా వున్న పదార్ధాలను ,ఎక్కువ చేదుగా వున్న పదార్ధాలను, వేడి చేసే పదార్ధాలు సేవించడం మొదలైన కారణాల వలన శరీరం లో ఎక్కువ వేడి పుట్టి పైత్యం ప్రకోపిస్తుంది.
లింగ స్నానం :-- తొట్టిలోని చల్లటి నీళ్ళు పోసుకొని కూర్చోవాలి. చల్లటి గుడ్డతో మర్మాంగాన్ని మాటి మాటికి తాకించాలి. కూర్చోలేని వాళ్ళను పడుకోబెట్టి చెయ్యాలి. ఈ సమస్య ఎక్కువగా పురుషులకే వస్తుంది. స్త్రీలకు కూడా అదే విధంగా చెయ్యాలి.
లక్షణాలు:-- కళ్ళు ,ముఖం ఎర్రగా వుంటాయి. మూత్ర విసర్జన సమయంలో చురుకు ఎక్కువగా వుంటుంది.
మూత్రం పసుపుగా, ఎర్రగా వస్తుంది. పొత్తికడుపు నొప్పి ఎక్కువగా వుంటుంది. దాహం ఎక్కువగా వుంటుంది.
ఆహారం:-- తాగేతపుడు,తాగినతరువాత చల్లగా వుండే కూల్ డ్రింక్స్ తాగాలి. చెరకు రసం, నల్ల ద్రాక్ష రసం వంటివి తాగితే అప్పటికప్పుడు వేడి తగ్గుతుంది.
కాచిన పాలు ----100 ml
చక్కర ---- 50 gr
రెండింటిని కలిపి కొంచం కొంచం గా తాగుతూ వుంటే వెంటనే వేడి తగ్గుతుంది.
ఉసిరిక కాయల రసంలో గాని లేదా ఎండు ఉసిరిక ముక్కలను ఉడికించిన నీటిలో గాని లేదా రెండు టీ స్పూన్ల పొడిని వేసి కాచిన సగం నీటిలో గాని ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగితే మూత్రంలో మంట, మూత్రం పసుపుగా రావడం, వేడి అన్ని నివారింప బడతాయి.
మూత్ర సమస్యలు --నివారణ 6-3-09.
3. కఫజమూత్ర కృచ్హము:--
ఇది మూత్రంలో కఫం చేరడం వలన వస్తుంది.
లక్షణాలు:-- మూత్రావయవాల్లో వాపు, మర్మాంగం మీద వాపు, మూత్ర నాళంవాపు వుంటుంది.
కఫ స్వభావం:-- పొట్ట ఉబ్బరం, అజీర్ణం
పొత్తి పొట్ట మీద తైలం తో మర్దన చెయ్యాలి. నులక మంచం మీద బోర్లా పడుకోబెట్టాలి. మంచం తిరగేసి కోళ్ళకింద రాళ్ళు పెట్టాలి. నొప్పుల నివారణ ఆకులు నీటిలో వేసి బాగా మరిగించి ఆ పాత్రను మంచం కింద పెట్టాలి.
తైలతో మర్దన చేసిన ప్రాంతం లో ఆవిరి తగిలేటట్లు పెట్టాలి.దీని వలన మూత్రం బయటకు వస్తుంది.
నువ్వుల నూనెను ఎనిమా డబ్బాలో పోసి ఎక్కించాలి. తరువాత కొంచం సేపు అటు ఇటు తిరగాలి. దీని వలన మల విసర్జన త్వరగా జరుగుతుంది. కఫం బయటకు వస్తుంది.
ఉప్పు గాని, సైంధవ లవణం గాని ఒక లీటరు నీటిలో వేసి తాగడం వలన కఫం బయటకు వస్తుంది.
కఫం యొక్క స్వభావం శీతలం. శీతలం ఎక్కువైతే నాడులు బిగుసుకు పోతాయి. నోట్లో అరుచి, పొట్టలో అజీర్ణం వుంటాయి.
ఆహారం :-- బార్లీ, వేడి పానీయాలను తాగించ వచ్చు.
అల్లం రసం ---ఒక టీ స్పూను
నిమ్మరసం ----ఒక టీ స్పూను
తేనె ---- ఒక టీ స్పూను
అన్నింటిని కలిపి తాగాలి.
కొండ పిండి వేళ్ళను చిన్న ముక్కలుగా చేసి దంచి పొడి చేసుకోవాలి. పావు టీ స్పూను లేక
అర టీ స్పూను పొడిని పలుచని,తియ్యనిమజ్జిగలోకలుపుకొని ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం తాగాలి.
ఆహారం, అన్నం, కూరలు వేడి వేడిగా తినాలి.
మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ 10-3-09.
4.. త్రిదోషజ మూత్ర కృచ్చ సమస్య:--
వాత, పిత్త, కఫములు మూడు ఒకే సారి ఏర్పడితే ఈ సమస్య వలన ఇంతకు ముందు చెప్పబడిన మూడు సమస్యలు ఏర్పడతాయి.
జలము తో ఈ సమస్యను నివారింప వచ్చు. మెత్తని గుడ్డను తీసుకొని తడిపి నాలుగు మడతల తో గోచి పెట్టుకోవాలి.(మర్మాంగానికి కట్టాలి). పైన పొడి గుడ్డ కట్టాలి. తరువాత నాభి నుండి చట్టు కలిసేట్లు కట్టాలి. తరువాత ఉలన్ గుడ్డను లేక లావు గుడ్డను కట్టాలి. అంటే మూడు గుడ్డలు .
వాపు, పోటు,మంట ఒకే సారి వస్తే :---
శతావరి(పిల్లిపీచర వేర్లు) తెచ్చి ముక్కలు చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఒక లీటరు మంచి నీటి లో 50 గ్రా దుంపలు వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు కాచాలి. దించి వడపోసి చల్లార్చి దీనిని మూడు భాగాలు చేసి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూను తేనెను కలిపి తాగాలి.
శతావరి వేర్ల పొడి కషాయం
తేనె
మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ 11-3-09.
5. మూత్ర కృచ్చ శల్యజ అభిఘాత సమస్యల నివారణ
శల్యజ = గుచ్చుకోవడం వలన కలిగే
అభి ఘాత = దెబ్బలు తగలడం
దెబ్బ తగిలిన చోట నువ్వుల నూనె తో గాని ఓమ తైలంతో ;గాని గోరువెచ్చగా సున్నితంగా మర్దన చెయ్యాలి. కాపడం పెట్టాలి. పొత్తి కడుపు మీద, ఇంకా కింద కాపడం పెట్టాలి. ఎనిమా ఇవ్వడం, టేబుల్ లాంప్ కు బ్లూ కలర్
కాగితాన్ని చుట్టి ఎదురుగా పెట్టుకొని (మోకాళ్ళ పై కూర్చొని) నీలి రంగు కిరణాలు ప్రసరించేటట్లు పెట్టుకోవాలి
ఒక నీటితో నిండిన గాజు గ్లాసుకు నీలి రంగు కాగితాన్ని చుట్టి ఒకటి లేదా రెండు గంటలు ఎండలో వుంచి తాగితే మూత్ర విసర్హ్జన సులభంగా జరుగుతుంది.
పడుకొని నెమ్మదిగా గాలి పీల్చి వదలాలి. (భావనా పూర్వక వ్యాయామం)
ఆహారం:--
పై సమస్య వాహనాల వాడకం వలన జరగవచ్చు.
మర్రి చెట్టు బెరడు
రావి చెట్టు బెరడు
మేడి (అత్తి)చెట్టు బెరడు
జువ్వి చెట్టు బెరడు
గంగ రావి చెట్టు బెరడు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కడిగి దంచి రసం తీసి చెరువులోని జిగట కలిగిన శుభ్రమైన మెత్తని బంకమట్టి లో కలిపి పట్టు వెయ్యాలి. గాయమైతే గాయం పై పలుచని గుడ్డ కప్పి దానిపై మట్టి పట్టి వెయ్యాలి.
పైన చెప్పినవన్నీ దొరకక పోతే ఒక్క బెరడుతో నైనా చేసుకోవచ్చు .
మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ 12-3-09.
6. పురీషజ మూత్ర కృచ్చ సమస్య :--
ఈ సమస్య మలము బంధించ బడుట వలన మూత్రము సరిగా రాక పోవడం వలన వస్తుంది.
బెడ్ లైట్ కి ఎర్ర కాగితాన్ని చుట్టి పొత్తి కడుపు పై ఐదు నుండి పది లేక పదిహేను నిమిషాలు ఆ కాంతి పడేటట్లు స్విచ్ ఆన్ చేసి కూర్చోవాలి. దీనితో మలము, మూత్రము సాఫీగా జారీ అవుతాయి.
నీళ్ళ గ్లాసుకు ఎర్ర కాగితం చుట్టి ఎండలో పెట్టి కొంతసేపు తరువాత ఆ నీటిని తాగాలి.
యోగాసనం :--1. దీర్ఘ భస్త్రిక :-- పాదాలను గట్టిగా బిగించి ఆపగలిగినంత సేపు ఆపి తరువాత నెమ్మదిగకాలును జరపాలి.
ఆహారం:--
పల్లేరు కాయల కషాయం :--
రెండు గ్లాసుల నీటిలో రెండు స్పూన్ల పల్లేరు కాయల పొడి కలిపి వేడి చేసి కషాయం దించి దానిలోరెండు లేక మూడు చిటికెల యవాక్షారం కలిపి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క గ్లాసు చొప్పున తాగాలి.
మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ 13-3-09.
7. అశ్మరి మూత్ర కృచ్చ సమస్య: అశ్మరి అనగా రాళ్ళు
ఆహారం:-- గుమ్మడి కాయ కూర, అరటి దుంప లేక దూట, ముల్లంగి దూట, తెల్ల గలిజేరు, నేలఉసిరి, కొండపిండి కూర, ఉలవ చారు, ఉలవ గుగ్గిళ్ళు తింటే మూత్ర పిండాలలో రాళ్ళు రావు.
మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడితే నడుము నొప్పి, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది.
మర్మాంగానికి చల్లని నీటితో తడిపిన గుడ్డను అంటించాలి.
ఒక కప్పు నీటిలో కొన్ని ఉలవలు వేసి కాచి ఆ నీటిలో సైంధవ లవణం కలుపుకొని త్రాగితే నొప్పి వెంటనే తగ్గుతుంది
యోగాసనం:-- కటి చక్రాసనం పది, పన్నెండు సార్లు చెయ్యాలి.
లక్షణాలు:-- . రాయి ఏర్పడి మూత్రం సరిగా రాక నొప్పి గా వుంటుంది. థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే రాళ్ళు ఏర్పడతాయి. ఈ గ్రంధి కాల్షియం ను రక్తానికి సరిగా అందించక రాళ్ళు ఏర్పడతాయి.
కొండ పిండి వేళ్ళు ---- 50 gr
నీళ్ళు ---- ఒక లీటరు
వేళ్ళను నీటిలో వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు కాచి వదపోయ్యాలి. దీనిని మూడు భాగాలు గా చేసి మూడు పూటలా మూడు గ్లాసులు తాగాలి. లేదా
ఉలవలను ఒక గ్లాసు నీటిలో వేసి ఉడికించి పావు గ్లాసు వరకు రానిచ్చి సైంధవ లవణం కలుపుకొని ఆ నీటిని తాగాలి.
మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ 14-3-09.
8.శుక్రజ మూత్ర కృచ్హ సమస్య :-- శుక్రము = వీర్యము
ఇది స్వస్థానము విడిచి మూత్ర నాళము చేరి మూత్రమును రానీకుండా అడ్డుపడి మూత్రం బొట్లు బొట్లు గా రావడం దీని లక్షణం .
దీనికి గోరువెచ్చని లింగ స్నానం చెయ్యాలి. ఒక టబ్బులో గోరువెచ్చని నీటిని పోసి లింగం మునిగేటట్లు కూర్చోవాలి. గోరువెచ్చని నీటితో ఐదు నిమిషాలు తడపాలి.
1. నౌకాసనం 2. వక్రాసనం
కామోద్దీపన అది ఏ సమయం లో జరగాలో అదే సమయం లో జరగాలి. వాల్ పోస్టర్లు, ఇంటర్నెట్, టీవీలలో అర్ధ నగ్న ప్రదర్శనలు కనిపించడం వలన కామోద్దీపన జరిగి శుక్రం స్వస్థానం నుండి జారి మూత్ర నాళం లోనికి వెళుతుంది. ఈ సమస్య వీర్యాన్ని ఆపడం వలన కూడా ఏర్పడుతుంది.
శుద్ధి చేయబడిన గోమూత్ర శిలాజతు ---- 3 చిటికెలు
పాలు ---- 10 gr
వెన్న ---- 10 gr
నెయ్యి ---- 10 gr
చక్కర ---- 10 gr
తేనె ---- 10 gr
పై పదార్దాలన్నింటిని ఒక కప్పులో వేసి శిలాజతు కలుపుకొని తాగాలి.
2. అతిబల వేర్లను దంచిన పొడి, లేదా అప్పటికప్పుడు తెచ్చి నలగగొట్టి నీళ్ళలో వేసి కషాయం సగానికి దించి గోరువెచ్చగా అయిన తరువాత ఒక టీ స్పూను తేనె కలిపి తాగాలి.
అన్ని రకాల మూత్ర సమస్యల నివారణ 17-3-09.
1 యాలకుల పొడి ------ పావు టీ స్పూను
ఉసిరిక రసం లేదా కషాయం ------
ఇవి రెండు కలిపి తాగితే ఇంతకు ముందు చెప్పబడిన 8 రకాల మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
2. త్రిఫల చూర్ణం
సైంధవ లవణం
రెండింటిని నీటితో కలిపి తాగితే మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
అనగా 8 రకాల వ్యాధులకు ఒకటే నివారణ అన్న మాట.
యోగాసనం:--
1. భోజనం చేసిన తరువాత వజ్రాసనం వేసుకోవాలి,దీని వలన అన్ని వ్యాధులు నివారింప బడతాయి.
2. శశాంక ఆసనం 3. ఉద్దాన పాదాసనం
తినదగినవి:-- ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పొట్టు తీయని పాత బియ్యం, బూడిద గుమ్మడి కాయ అరటి దూట, ముల్లంగి, పొట్ల కాయ, దోస మొదలైనవి తినవచ్చును.
తినకూడనివి:-- మాంసాహారం, అతి దాహకర పదార్ధాలు(గిట్టనివి),కొత్త బియ్యం, గేదె పెరుగు, అతి పుల్లని పదార్ధాలు తిన కూడదు. అతి నడక. అతి వ్యాయామం పనికి రావు.
నీళ్ళు ---- పావు లీటరు
రాత్రి వేళ గులాబి రేకులను నీటిలో వేసి బాగా కలియబెట్టి నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో బాగా
పిసికి వడ పోసుకోవాలి. ఆ నీటిలో రెండు టీ స్పూన్ల చక్కర కలిపి ఆ నీటిని తాగితే వెంటనే మూత్రం ధారాళంగా జారీ అవుతుంది.
\
దీనిని రోజుకు రెండు మూడు సార్లు తాగవచ్చు. ఉదయం నానబెట్టి సాయంత్రం, సాయంత్రం నానబెట్టి ఉదయం తాగాలి.
2. ధనియాలను దంచి, చేరిగితే పప్పు వస్తుంది. దానిని పొడిగా చేసుకొని ఒక టీ స్పూను పొడిలో తగినంత చక్కెర కలుపుకొని నాలుకతో అద్దుకొని తినాలి. మూత్రం ఎర్రగా వస్తున్నా, బొట్లు బొట్లుగా వస్తున్నా, అసలే రాకున్న రాళ్ళు అడ్డుపడి రాకున్న దీనిని వాడితే మూత్రం సులభంగా జారీ అవుతుంది.
3. పలుచని తియ్యని మజ్జిగలో చక్కెర కలుపుకొని తాగితే మూత్రం సులభంగా జారీ అవుతుంది.
బహిష్టు సమస్యల వలన వచ్చే మూత్ర సంబంధ వ్యాధులు --నివారణ 1-7-09
.
లక్షణాలు:-- మోకాళ్ళ దగ్గర నీరు చేరి చొట్టలు పడడం.
మట్టి పట్టిని పొత్తి కడుపుపై వేసుకోవాలి. ప్రతి రోజు అర గంట చొప్పున 6,7 సార్లు వేసుకోవాలి. అత్యవసర పరిస్థితులలో నూలు గుడ్డను చల్లటి నీటిలో ముంచి నీళ్ళు పిండకుండా నాభి మీదుగా నడుము చుట్టూ చుట్టాలి.
దానిపై పొడిగా వున్న పలుచని గుడ్డను, దానిపై లావు టవలును చుట్టాలి. ఈ విధానం చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఉదయం, సాయంత్రం చేస్తే తప్పకుండ మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
ఎక్కువగా వ్యాయామం చేయడం, అసలే చేయక పోవడం, ఆకలి వున్నా తినక పోవడం, ఆకలి లేకపోయినా తినడం వంటి కారణాల వలన ఈ సమస్యలు వస్తాయి.
అతిమూత్ర సమస్య --- నివారణ 5-8-09.
మట్టి పట్టి వేసుకోవాలి, అరగంట తరువాత తీసేయ్యాలి.
ప్రాణాయామం లో కపాలభాతి, ఉడ్యాన బంధం, మూలబంధం మొదలగునవి చెయ్యాలి.
ఎక్కువ నీరు త్రాగడం వలన మూత్ర సంచి వదులైపోతుంది. దాని వలన అతిమూత్ర సమస్య ఏర్పడుతుంది.
మూత్రాన్ని బంధించా కూడదు. అన్నం తినడం మానెయ్యాలి.
పాత రాగులను నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత ఎండబెట్టి నెయ్యి వేసి వేయించి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. తగినంత తీసుకొని జావ కాచి దానిలో మజ్జిగ కలుపుకొని తాగితే తప్పక తగ్గుతుంది. దీనిలో చక్కెర కూడా వాడుకోవచ్చు.
తంగేడు ఆకులు
తంగేడు పూలు
రెండింటిని నీళ్ళలో వేసి కాచి ఆ నీటిని తాగాలి.
మామిడి ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసి రెండు చిటికెల పొడిని తిని నీళ్ళు తాగితే తగ్గుతుంది.
రాలిన మామిడి పిందెలు ముక్కలు చేసి ఎండబెట్టి పొడి చేసి దానిని నీళ్ళలో కలుపుకొని తాగితే అతి మూత్ర సమస్య నివారింపబడుతుంది.
మూడో పట్టు తవుడు జల్లించి డబ్బాలో నిల్వ చెయ్యాలి. దీనితో రొట్టె తయారు చేసుకొని మట్టి మూకుడులో నెయ్యి రాసి కాల్చి దానిపై నెయ్యి రాసి కూర వేసుకొని తినాలి.
దీని వలన రక్త వృద్ధి జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నడకలో వేగం హెచ్చుతుంది.
మూత్రంలోని మలినాల సమస్య --నివారణ 20-8-09.
మట్టి పట్టి వేసుకోవాలి. లింగ స్నానం అత్యుత్తమమైనది .రోజుకు ఐదు నిమిషాల చొప్పున 15,20 రోజులు చేస్తే మూత్ర సమస్యలే వుండవు.
ఉడ్యానబంధము, ఉదరచాలనము, మేరుదండాసనం,కటి చక్రాసనము, కపాల భాతి ప్రాణాయామము
చెయ్యాలి.
ఆహారం:--
ఒక కప్పు మంచి నీటిలో ఒక టీ స్పూను మేలు రకమైన టీ పొడి వేసి వేడిచేసి అర కప్పుకు మరిగే
వరకు మరిగించాలి. వడపోసి అర కప్పు మంచి నీళ్ళు కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఒక గంట వరక ఏ పానీయము గాని, నీరు గాని, ఆహారం గాని తీసుకో కూడదు.
ఉదయాన్నే రోగి యొక్క మొదటి మూత్రాన్ని ఒక గాజు గ్లాసులోకి పట్టాలి. అది పసుపుగా వుండాలి. దుర్వాసన
వుండకూడదు. చిక్కగా, మడ్డిగా వుండకూడదు.
పైన చెప్పబడిన టీ డికాషన్ ను తాగుతూ వుంటే మరలా మూత్రాన్ని పరిశీలిస్తే శుభ్రంగా వుంటుంది.
" ఇది అనుభవం ద్వారా చెప్పబడినది"
ఉలవలను (మూత్ర పిండాల ఆకారంలో వుంటాయి) అప్పుడప్పుడు గుగ్గిళ్ళు, చారు రూపంలో వాడాలి. ఇవి మూత్ర పిందాలలోని రాళ్ళను కూడా కరిగిస్తాయి. మలినాలను తొలగిస్తాయి.
శరీరాన్ని చల్లబడనివ్వకుండా ఉలవలు ఉష్ణాన్ని కాపాడతాయి.
ముల్లంగి ఆహారంగా చాలా మంచిది,
తులసితో మూత్ర వ్యాధుల నివారణ 2-3-10.
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపివుంచడం వలన, అతివేడి పదార్ధాలను, అతి చల్లని పదార్ధాలను సేవించడం వలన, అజీర్ణ పదార్ధాలను తినడం వలన మూత్ర వ్యాదులు వస్తాయి. అంతే కాక, చెడు ప్రదేశాలలో, రోగులు విసర్జించిన చోట మూత్ర విసర్జన చేయడం వలన కూడా మూత్ర రోగాలు వస్తాయి. కఫం ఎక్కువైనపుడు కూడా మూత్ర వ్యాధులు వస్తాయి.
బంకమట్టిని పలుచని తడి గుడ్డకు దట్టంగా పూసి పట్టి లాగా చేసి పొత్తి కడుపుమీద వెయ్యాలి.
స్త్రీలు, పురుషులు కూడా లింగ స్నానం చెయ్యాలి. దీని వలన మరామ్గంలోని నాడుల ద్వారా నీటి తరంగాలుమెదడుకు చేరతాయి. దీని వలన నపుంసకత్వం, మూత్రం రాకపోవడం, మూత్రంలో తెలుపు పోవడం వంటివి నివారింప బడతాయి. లింగ స్నానం ఐదు నిమిషాలు మాత్రమే చెయ్యాలి. లేచి కొద్దిసేపు నడవాలి. దీని వలన వాయు, రక్త ప్రసరణలు బాగా జరిగి శరీరం చైతన్య వంతమవుతుంది.
అధికంగా నీటిని సేవించరాదు. అతి సర్వత్ర వర్జయేత్
ప్రతి రోజు రాత్రి పూట రాగి చెంబులో ఒక గ్లాసు నీటిని పోసి ఉదయం లేవగానే ఆనీటిని తాగితే ఎంతో ఆరోగ్యకరం.
ఆరు గజాల పొడవు రెండు జానల వెడల్పు వున్న నూలు గుడ్డను తీసుకొని చల్లటి నీటిలో ముంచి పిండి రోగి యొక్క నాభి నుండి తొడల వరకు చుట్టాలి. దాని పై పొడి గుడ్డను చుట్టాలి. దాని పై అంతే పొడవు, అంతే వెడల్పు వున్న దుప్పటి వంటి మందమైన పొడి గుడ్డను చుట్టాలి.
దీని వలన అన్ని రకాల మూత్ర వ్యాధులు నివారింప బడతాయి.
మూత్రము తగినంత మాత్రమే రావాలి. మూత్రము ఊర్ధ్వ ముఖంగా పయనిస్తే శరీరంలో నీరు, ఉబ్బు వస్తాయి.
పూర్వ కాలంలో నడుము వరకు శరీరాన్ని నీటి తొట్టిలో వుంచి తొట్టి స్నానం చేసే వారు. దీని వలన శరీరం చల్లబడుతుంది.
కృష్ణ తులసి సమూలంగా తెచ్చి కడిగి ముక్కలు చేసి ఎండబెట్టి దంచి అతి మెత్తని చూర్ణాన్ని తయారు చేసుకొని సీసాలో భద్ర పరచుకోవాలి.
పిల్లలకు --- ఒక చిటికెడు లేదా ఒకటినుండి మూడు చిటికెలు
పెద్దలకు --- పావు టీ స్పూను
రెండు టీ స్పూన్ల నిమ్మ రసం లో ఈ పొడిని కలుపుకొని కొంచం కొంచం గా మెల్లగా సేవిస్తూ వుండాలి.
దీని వలన సమస్త మూత్ర రోగాలు నివారింప బడతాయి.
అతి మూత్ర సమస్య --నివారణ 17-5-10.
తంగేడు మొక్కల వేర్లను సేకరించి కడిగి ఎండబెట్టి దంచి పొడిని నిల్వ చేసుకోవాలి.
తంగేడు వేర్ల పొడి ---- పావు టీ స్పూను
మేక పాల వెన్న ---- ఒక టీ స్పూను
రోజుకొకసారి చొప్పున ;పరగడుపున 40 రోజులు వాడితే ఈ సమస్య పూర్తిగా నివారింపబడుతుంది.
ఆహార నియమాలు-- అతిమూత్రం సమస్య వున్నవాళ్ళకు మధుమేహం వుండే అవకాశం కలదు.వాళ్ళు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చు. దీని వలన మధుమేహం నియంత్రించ బడుతుంది, కఫం తగ్గుతుంది.
తెల్ల గలిజేరు ఆకు ను వారానికి ఒకసారి కూర వండుకుని తింటే మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
మూత్రం బొట్లు బొట్లుగా రావడం -- నివారణ 19-12-10.
మూత్రం చాలా త్వరగా వస్తున్నట్లు అనిపించడం, అసలే రాకపోవడం వంటి లక్షణాలు వుంటాయి.
గనేరియా వంటి వ్యాదులలో మూత్రంతో బాటు చీము రావడం జరుగుతుంది.
చందనాది వటి
అతిమధురం ---- 30 gr
చలవ మిరియాలు ---- 30 gr
సురేకారం ---- 10 gr
తుమ్మ జిగురు ---- 30 gr
రూమి ముస్తకి ---- 10 gr
చందన తైలం ---- 10 gr
కోసైవా నూనె ---- 10 gr
పన్నీరు ---- 10 gr
తుమ్మ జిగురు పొడిని కల్వంలో వేసి పన్నీరు పోస్తూ నూరాలి. దీనికి మిగిలిన పదార్ధాలు కలిపి ముద్దగా మైనం లాగా నూరాలి. . చివరలో దీనికి కోసైబా నూనె కలపాలి.
రెండు గ్రాముల మోతాదులో మాత్రలు తయారు చేసి ప్లేటులో విడివిడిగా వేసి నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వాడాలి. సమస్య తీవ్రంగా వుంటే రోజుకు నాలుగు సార్లు వాడాలి. దీనితో అన్ని రకాల మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
అనువుగాని సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లాలని అనిపిస్తే 21-12-10.
ఏదైనా ఇంటర్వ్యూ లో వున్నపుడు గాని, ఎవరితోనైనా అత్యవసరంగా మాట్లుడున్నపుడు గాని, బయట వీలుగాని ప్రదేశాలలో వున్నపుడు గాని మూత్ర విసర్జనకు వెళ్ళాలని అనిపిస్తే మనసును వీ విషయం మీదికి మళ్లించాలీ. ఉదాహరణకు శృంగార భావన, భక్తి భావన, ఏదైనా ఉద్యానవనంలో వున్నట్లు, మంచి సంగీతాన్ని వింటున్నట్లు సుగందాన్ని ఆస్వాదిస్తున్నట్లు గా భావిస్తే మూత్ర విసర్జనకు వెళ్ళాలనే భావనను తగ్గించుకోవచ్చు.
ఈ విధంగా అత్యసర పరిస్థితులలో మాత్రమే చేయాలి. అంతేగాని మూత్ర ప్రవాహాన్ని మాటి మాటికి ఆపకూడదు. దీని వలన సమస్యలు ఏర్పడతాయి.

మూత్ర బంధ సమస్య ---నివారణ 11-4-09.
నువ్వులు ---100 gr (నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు)
పత్తి గింజలు --- 100 gr
ఒకబాణలి లోనువ్వులను,పత్తి గింజలను వేసి నల్లగా మాడి బూడిద అయ్యే వరకు వేయించాలి. పొగ తగ్గి
చల్లారిన తరువాత దంచి జల్లించి సీసాలో భద్ర పరచుకోవాలి.
పిల్లలకు ---- ఒక గ్రాము
పెద్దలకు ---- మూడు వేళ్ళకు వచ్చినంత
ఒక కప్పు తియ్యటి పెరుగులో కలుపుకొని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వలన మూత్ర బంధసమస్యలు
నివారిమ్పబడి మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
అతి చేదు, అతి పులుపు,అతి వగరు వున్న పదార్ధాలు తినరాదు. త్వరగా జీర్ణం గాని పదార్ధాలు తినరాదు.
ముందు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తరువాతనే మరలా ఆహారం తీసుకోవాలి.
మూత్రం ధారాళంగా రావడానికి --- గులాబి పానీయం. 6-6-09.
1. తాజా గులాబి రేకులు ----20 gr నీళ్ళు ---- పావు లీటరు
రాత్రి వేళ గులాబి రేకులను నీటిలో వేసి బాగా కలియబెట్టి నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో బాగా
పిసికి వడ పోసుకోవాలి. ఆ నీటిలో రెండు టీ స్పూన్ల చక్కర కలిపి ఆ నీటిని తాగితే వెంటనే మూత్రం ధారాళంగా జారీ అవుతుంది.
\
దీనిని రోజుకు రెండు మూడు సార్లు తాగవచ్చు. ఉదయం నానబెట్టి సాయంత్రం, సాయంత్రం నానబెట్టి ఉదయం తాగాలి.
2. ధనియాలను దంచి, చేరిగితే పప్పు వస్తుంది. దానిని పొడిగా చేసుకొని ఒక టీ స్పూను పొడిలో తగినంత చక్కెర కలుపుకొని నాలుకతో అద్దుకొని తినాలి. మూత్రం ఎర్రగా వస్తున్నా, బొట్లు బొట్లుగా వస్తున్నా, అసలే రాకున్న రాళ్ళు అడ్డుపడి రాకున్న దీనిని వాడితే మూత్రం సులభంగా జారీ అవుతుంది.
3. పలుచని తియ్యని మజ్జిగలో చక్కెర కలుపుకొని తాగితే మూత్రం సులభంగా జారీ అవుతుంది.
బహిష్టు సమస్యల వలన వచ్చే మూత్ర సంబంధ వ్యాధులు --నివారణ 1-7-09
.
లక్షణాలు:-- మోకాళ్ళ దగ్గర నీరు చేరి చొట్టలు పడడం.
మట్టి పట్టిని పొత్తి కడుపుపై వేసుకోవాలి. ప్రతి రోజు అర గంట చొప్పున 6,7 సార్లు వేసుకోవాలి. అత్యవసర పరిస్థితులలో నూలు గుడ్డను చల్లటి నీటిలో ముంచి నీళ్ళు పిండకుండా నాభి మీదుగా నడుము చుట్టూ చుట్టాలి.
దానిపై పొడిగా వున్న పలుచని గుడ్డను, దానిపై లావు టవలును చుట్టాలి. ఈ విధానం చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఉదయం, సాయంత్రం చేస్తే తప్పకుండ మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
ఎక్కువగా వ్యాయామం చేయడం, అసలే చేయక పోవడం, ఆకలి వున్నా తినక పోవడం, ఆకలి లేకపోయినా తినడం వంటి కారణాల వలన ఈ సమస్యలు వస్తాయి.
అతిమూత్ర సమస్య --- నివారణ 5-8-09.
మట్టి పట్టి వేసుకోవాలి, అరగంట తరువాత తీసేయ్యాలి.
ప్రాణాయామం లో కపాలభాతి, ఉడ్యాన బంధం, మూలబంధం మొదలగునవి చెయ్యాలి.
ఎక్కువ నీరు త్రాగడం వలన మూత్ర సంచి వదులైపోతుంది. దాని వలన అతిమూత్ర సమస్య ఏర్పడుతుంది.
మూత్రాన్ని బంధించా కూడదు. అన్నం తినడం మానెయ్యాలి.
పాత రాగులను నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత ఎండబెట్టి నెయ్యి వేసి వేయించి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. తగినంత తీసుకొని జావ కాచి దానిలో మజ్జిగ కలుపుకొని తాగితే తప్పక తగ్గుతుంది. దీనిలో చక్కెర కూడా వాడుకోవచ్చు.
తంగేడు ఆకులు
తంగేడు పూలు
రెండింటిని నీళ్ళలో వేసి కాచి ఆ నీటిని తాగాలి.
మామిడి ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసి రెండు చిటికెల పొడిని తిని నీళ్ళు తాగితే తగ్గుతుంది.
రాలిన మామిడి పిందెలు ముక్కలు చేసి ఎండబెట్టి పొడి చేసి దానిని నీళ్ళలో కలుపుకొని తాగితే అతి మూత్ర సమస్య నివారింపబడుతుంది.
మూడో పట్టు తవుడు జల్లించి డబ్బాలో నిల్వ చెయ్యాలి. దీనితో రొట్టె తయారు చేసుకొని మట్టి మూకుడులో నెయ్యి రాసి కాల్చి దానిపై నెయ్యి రాసి కూర వేసుకొని తినాలి.
దీని వలన రక్త వృద్ధి జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నడకలో వేగం హెచ్చుతుంది.
మూత్రంలోని మలినాల సమస్య --నివారణ 20-8-09.
మట్టి పట్టి వేసుకోవాలి. లింగ స్నానం అత్యుత్తమమైనది .రోజుకు ఐదు నిమిషాల చొప్పున 15,20 రోజులు చేస్తే మూత్ర సమస్యలే వుండవు.
ఉడ్యానబంధము, ఉదరచాలనము, మేరుదండాసనం,కటి చక్రాసనము, కపాల భాతి ప్రాణాయామము
చెయ్యాలి.
ఆహారం:--
ఒక కప్పు మంచి నీటిలో ఒక టీ స్పూను మేలు రకమైన టీ పొడి వేసి వేడిచేసి అర కప్పుకు మరిగే
వరకు మరిగించాలి. వడపోసి అర కప్పు మంచి నీళ్ళు కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఒక గంట వరక ఏ పానీయము గాని, నీరు గాని, ఆహారం గాని తీసుకో కూడదు.
ఉదయాన్నే రోగి యొక్క మొదటి మూత్రాన్ని ఒక గాజు గ్లాసులోకి పట్టాలి. అది పసుపుగా వుండాలి. దుర్వాసన
వుండకూడదు. చిక్కగా, మడ్డిగా వుండకూడదు.
పైన చెప్పబడిన టీ డికాషన్ ను తాగుతూ వుంటే మరలా మూత్రాన్ని పరిశీలిస్తే శుభ్రంగా వుంటుంది.
" ఇది అనుభవం ద్వారా చెప్పబడినది"
ఉలవలను (మూత్ర పిండాల ఆకారంలో వుంటాయి) అప్పుడప్పుడు గుగ్గిళ్ళు, చారు రూపంలో వాడాలి. ఇవి మూత్ర పిందాలలోని రాళ్ళను కూడా కరిగిస్తాయి. మలినాలను తొలగిస్తాయి.
శరీరాన్ని చల్లబడనివ్వకుండా ఉలవలు ఉష్ణాన్ని కాపాడతాయి.
ముల్లంగి ఆహారంగా చాలా మంచిది,
సూచనలు :-- మల మూత్రాలను ఆపకూడదు, వెంటనే విసర్జించాలి.
పిల్లలు నిలబడి మూత్ర విసర్జన చెయ్యకూడదు. కూర్చుని మాత్రమే చెయ్యాలి. తులసితో మూత్ర వ్యాధుల నివారణ 2-3-10.
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపివుంచడం వలన, అతివేడి పదార్ధాలను, అతి చల్లని పదార్ధాలను సేవించడం వలన, అజీర్ణ పదార్ధాలను తినడం వలన మూత్ర వ్యాదులు వస్తాయి. అంతే కాక, చెడు ప్రదేశాలలో, రోగులు విసర్జించిన చోట మూత్ర విసర్జన చేయడం వలన కూడా మూత్ర రోగాలు వస్తాయి. కఫం ఎక్కువైనపుడు కూడా మూత్ర వ్యాధులు వస్తాయి.
బంకమట్టిని పలుచని తడి గుడ్డకు దట్టంగా పూసి పట్టి లాగా చేసి పొత్తి కడుపుమీద వెయ్యాలి.
స్త్రీలు, పురుషులు కూడా లింగ స్నానం చెయ్యాలి. దీని వలన మరామ్గంలోని నాడుల ద్వారా నీటి తరంగాలుమెదడుకు చేరతాయి. దీని వలన నపుంసకత్వం, మూత్రం రాకపోవడం, మూత్రంలో తెలుపు పోవడం వంటివి నివారింప బడతాయి. లింగ స్నానం ఐదు నిమిషాలు మాత్రమే చెయ్యాలి. లేచి కొద్దిసేపు నడవాలి. దీని వలన వాయు, రక్త ప్రసరణలు బాగా జరిగి శరీరం చైతన్య వంతమవుతుంది.
అధికంగా నీటిని సేవించరాదు. అతి సర్వత్ర వర్జయేత్
ప్రతి రోజు రాత్రి పూట రాగి చెంబులో ఒక గ్లాసు నీటిని పోసి ఉదయం లేవగానే ఆనీటిని తాగితే ఎంతో ఆరోగ్యకరం.
ఆరు గజాల పొడవు రెండు జానల వెడల్పు వున్న నూలు గుడ్డను తీసుకొని చల్లటి నీటిలో ముంచి పిండి రోగి యొక్క నాభి నుండి తొడల వరకు చుట్టాలి. దాని పై పొడి గుడ్డను చుట్టాలి. దాని పై అంతే పొడవు, అంతే వెడల్పు వున్న దుప్పటి వంటి మందమైన పొడి గుడ్డను చుట్టాలి.
దీని వలన అన్ని రకాల మూత్ర వ్యాధులు నివారింప బడతాయి.
మూత్రము తగినంత మాత్రమే రావాలి. మూత్రము ఊర్ధ్వ ముఖంగా పయనిస్తే శరీరంలో నీరు, ఉబ్బు వస్తాయి.
పూర్వ కాలంలో నడుము వరకు శరీరాన్ని నీటి తొట్టిలో వుంచి తొట్టి స్నానం చేసే వారు. దీని వలన శరీరం చల్లబడుతుంది.
కృష్ణ తులసి సమూలంగా తెచ్చి కడిగి ముక్కలు చేసి ఎండబెట్టి దంచి అతి మెత్తని చూర్ణాన్ని తయారు చేసుకొని సీసాలో భద్ర పరచుకోవాలి.
పిల్లలకు --- ఒక చిటికెడు లేదా ఒకటినుండి మూడు చిటికెలు
పెద్దలకు --- పావు టీ స్పూను
రెండు టీ స్పూన్ల నిమ్మ రసం లో ఈ పొడిని కలుపుకొని కొంచం కొంచం గా మెల్లగా సేవిస్తూ వుండాలి.
దీని వలన సమస్త మూత్ర రోగాలు నివారింప బడతాయి.
అతి మూత్ర సమస్య --నివారణ 17-5-10.
తంగేడు మొక్కల వేర్లను సేకరించి కడిగి ఎండబెట్టి దంచి పొడిని నిల్వ చేసుకోవాలి.
తంగేడు వేర్ల పొడి ---- పావు టీ స్పూను
మేక పాల వెన్న ---- ఒక టీ స్పూను
రోజుకొకసారి చొప్పున ;పరగడుపున 40 రోజులు వాడితే ఈ సమస్య పూర్తిగా నివారింపబడుతుంది.
ఆహార నియమాలు-- అతిమూత్రం సమస్య వున్నవాళ్ళకు మధుమేహం వుండే అవకాశం కలదు.వాళ్ళు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చు. దీని వలన మధుమేహం నియంత్రించ బడుతుంది, కఫం తగ్గుతుంది.
అతి మూత్ర వ్యాధి నివారణ ----అగ్నివేశ చూర్ణము 12-7-10.
దోరగా వేయించిన శొంటి పొడి ---- 50 gr
కలకండ పొడి ---- 50 gr
రెండింటిని కలిపి ఒక సీసాలో భద్ర పరచాలి.
అర టీ స్పూను పొడిలో ఒకటీస్పూను నెయ్యి కలిపి తినాలి. పిల్లలకు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఇవ్వాలి.
చిట్కా 30-11-10.
మూత్ర నాళంలో రాళ్ళు ఏర్పడి మూత్రం బొట్లు బొట్లుగా రావడం 23-11-10.
అరటి బోడెను దంచి రసం తీసి ఒక గ్లాసు రసానికి కొంచం యాలకుల పొడి కలిపి మూడు పూటలా వాడాలి రాళ్ళు పడిపోతాయి.
మూత్రపు సంచి వాపు వలన ఏర్పడే మూత్ర సమస్యలు--నివారణ 6-7-10.
మూత్రపు సంచి వాపు వలన మూత్రానికి సరిగా పోలేక పోవడం, మాటి మాటికి మూత్రానికి పోవాలని అనిపించడం వంటి సమస్యలు వుంటాయి.
మూత్రపు సంచి లేక ప్రోస్త్రేట్ గ్రంధి మూత్ర సంచి నుండి వచ్చే మూత్ర నాళము చుట్టూ లోపలి వైపుకు వుంటుంది.
వరుణ చెట్టు (ఉలిమిరి చెట్టు) యొక్క బెరడును తెచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఒక పాత్రలో 50 గ్రాముల పొడిని వేసి అర లీటరు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి 100 ml కషాయం మిగిలే వరకు నెమ్మదిగా కాచాలి. వడకట్టి గోరువెచ్చగా ఉదయం పరగడుపున తాగాలి.
దీని వలన రాత్రి పూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం తగ్గుతుంది.
మూత్రంలో మంట నివారణకు --చిట్కా 27-9-10.
దోసకాయలలోని గింజలను ఎండబెట్టి దాచిపెట్టుకోవాలి. వాటిని అప్పుడప్పుడు తింటూ వుంటే మూత్రంలో మంట తగ్గుతుంది.
Prostate Gland -- పౌష్య గ్రంధి వాపు -- నివారణ 2-10-10.
ఈ గ్రంధిగ్రంధి వాచినపుడు పురుషులలోని మూత నాళము చుట్టూ ఉంగరం లాగా వుంటుంది. దీని వలన మూత్ర విసర్జన సరిగా జరగదు. దీని వలన చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద ప్రమాదమేమి వుండదు. 50 సంవత్సరాల వయసు దాటిన 90 శాతం పురుషులలో ఇది వయసుతోబాటు వచ్చే సాధారణ మార్పు. ఇది హార్మోన్లలో తేడాల వలన గాని లేదా కండరాల పెరుగుదల వలన గాని వస్తుంది.
జలుబు మందులు ముఖ్యంగా బెనడ్రిల్ వంటి మందులు ఈ వ్యాధిని ఎక్కువ చేస్తాయి.
లక్షణాలు :-- మూత్ర కోశం ఖాళి కావడంలో సమస్య ఏర్పడుతుంది. మూత్ర విసర్జనకు, మూత్ర ప్రవాహానికి ముక్క వలసి వస్తుంది. మాటి మాటికి వెళ్ళాలనిపిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా వుంటుంది.
మూత్రకోశంలో కొంత మూత్రం మిగిలిపోవడం రాత్రి వేళ మాటి మాటికి వెళ్ళవలసి రావడం జరుగుతూ వుంటుంది. అర్జంటుగా వెళ్లాలని అనిపించడం వంటి లక్షణాలు వుంటాయి.
సూచనలు ;-- బలవంతంగా ఒత్తిడి ప్రయోగించకూడదు. ముక్క కూడదు. నీటిని ఎక్కువ శాతం ఒకే సారి తాగకూడదు. సాయంత్రం ద్రవాహారాన్ని తగ్గించాలి.
శృంగార పరంగా ఉత్సాహంగా వుంటే శుక్ర కణాల ద్వారా ఈ వాపు కొంత పోతుంది.
కటి వలయపు కండరాలను పెంచాలి. అనగా ఆ కండరాలను పది నిమిషాల సేపు బిగించి వదులుతూ వుండాలి దీని వలన ప్రోస్త్రేట్ గ్రంధి వ్యాధి గ్రస్తం కాదు.
గుమ్మడి గింజల పప్పు,ప్రొద్దుతిరుగుడు గింజల పప్పు, వేరు శనగ పప్పు, జీడి పప్పు మొదలైన జింక్ ఎక్కువగా వున్నగింజలను వాడుతూ వుంటే వాపు అదుపులో వుంటుంది.
అతి మధురం పొడి
గుమ్మడి గింజల పప్పుల పొడి
రెండింటిని కలిపి తీసుకోవడం వలన గ్రంధి వాపు అదుపులో వుంటుంది.
మూత్రపు సంచి వాపు వలన మూత్రానికి సరిగా పోలేక పోవడం, మాటి మాటికి మూత్రానికి పోవాలని అనిపించడం వంటి సమస్యలు వుంటాయి.
మూత్రపు సంచి లేక ప్రోస్త్రేట్ గ్రంధి మూత్ర సంచి నుండి వచ్చే మూత్ర నాళము చుట్టూ లోపలి వైపుకు వుంటుంది.
వరుణ చెట్టు (ఉలిమిరి చెట్టు) యొక్క బెరడును తెచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఒక పాత్రలో 50 గ్రాముల పొడిని వేసి అర లీటరు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి 100 ml కషాయం మిగిలే వరకు నెమ్మదిగా కాచాలి. వడకట్టి గోరువెచ్చగా ఉదయం పరగడుపున తాగాలి.
దీని వలన రాత్రి పూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం తగ్గుతుంది.
మూత్రంలో మంట నివారణకు --చిట్కా 27-9-10.
దోసకాయలలోని గింజలను ఎండబెట్టి దాచిపెట్టుకోవాలి. వాటిని అప్పుడప్పుడు తింటూ వుంటే మూత్రంలో మంట తగ్గుతుంది.
Prostate Gland -- పౌష్య గ్రంధి వాపు -- నివారణ 2-10-10.
ఈ గ్రంధిగ్రంధి వాచినపుడు పురుషులలోని మూత నాళము చుట్టూ ఉంగరం లాగా వుంటుంది. దీని వలన మూత్ర విసర్జన సరిగా జరగదు. దీని వలన చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద ప్రమాదమేమి వుండదు. 50 సంవత్సరాల వయసు దాటిన 90 శాతం పురుషులలో ఇది వయసుతోబాటు వచ్చే సాధారణ మార్పు. ఇది హార్మోన్లలో తేడాల వలన గాని లేదా కండరాల పెరుగుదల వలన గాని వస్తుంది.
జలుబు మందులు ముఖ్యంగా బెనడ్రిల్ వంటి మందులు ఈ వ్యాధిని ఎక్కువ చేస్తాయి.
లక్షణాలు :-- మూత్ర కోశం ఖాళి కావడంలో సమస్య ఏర్పడుతుంది. మూత్ర విసర్జనకు, మూత్ర ప్రవాహానికి ముక్క వలసి వస్తుంది. మాటి మాటికి వెళ్ళాలనిపిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా వుంటుంది.
మూత్రకోశంలో కొంత మూత్రం మిగిలిపోవడం రాత్రి వేళ మాటి మాటికి వెళ్ళవలసి రావడం జరుగుతూ వుంటుంది. అర్జంటుగా వెళ్లాలని అనిపించడం వంటి లక్షణాలు వుంటాయి.
సూచనలు ;-- బలవంతంగా ఒత్తిడి ప్రయోగించకూడదు. ముక్క కూడదు. నీటిని ఎక్కువ శాతం ఒకే సారి తాగకూడదు. సాయంత్రం ద్రవాహారాన్ని తగ్గించాలి.
శృంగార పరంగా ఉత్సాహంగా వుంటే శుక్ర కణాల ద్వారా ఈ వాపు కొంత పోతుంది.
కటి వలయపు కండరాలను పెంచాలి. అనగా ఆ కండరాలను పది నిమిషాల సేపు బిగించి వదులుతూ వుండాలి దీని వలన ప్రోస్త్రేట్ గ్రంధి వ్యాధి గ్రస్తం కాదు.
గుమ్మడి గింజల పప్పు,ప్రొద్దుతిరుగుడు గింజల పప్పు, వేరు శనగ పప్పు, జీడి పప్పు మొదలైన జింక్ ఎక్కువగా వున్నగింజలను వాడుతూ వుంటే వాపు అదుపులో వుంటుంది.
అతి మధురం పొడి
గుమ్మడి గింజల పప్పుల పొడి
రెండింటిని కలిపి తీసుకోవడం వలన గ్రంధి వాపు అదుపులో వుంటుంది.
తెల్ల గలిజేరు ఆకు ను వారానికి ఒకసారి కూర వండుకుని తింటే మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
మూత్రం బొట్లు బొట్లుగా రావడం -- నివారణ 19-12-10.
మూత్రం చాలా త్వరగా వస్తున్నట్లు అనిపించడం, అసలే రాకపోవడం వంటి లక్షణాలు వుంటాయి.
గనేరియా వంటి వ్యాదులలో మూత్రంతో బాటు చీము రావడం జరుగుతుంది.
చందనాది వటి
అతిమధురం ---- 30 gr
చలవ మిరియాలు ---- 30 gr
సురేకారం ---- 10 gr
తుమ్మ జిగురు ---- 30 gr
రూమి ముస్తకి ---- 10 gr
చందన తైలం ---- 10 gr
కోసైవా నూనె ---- 10 gr
పన్నీరు ---- 10 gr
తుమ్మ జిగురు పొడిని కల్వంలో వేసి పన్నీరు పోస్తూ నూరాలి. దీనికి మిగిలిన పదార్ధాలు కలిపి ముద్దగా మైనం లాగా నూరాలి. . చివరలో దీనికి కోసైబా నూనె కలపాలి.
రెండు గ్రాముల మోతాదులో మాత్రలు తయారు చేసి ప్లేటులో విడివిడిగా వేసి నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వాడాలి. సమస్య తీవ్రంగా వుంటే రోజుకు నాలుగు సార్లు వాడాలి. దీనితో అన్ని రకాల మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
అనువుగాని సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లాలని అనిపిస్తే 21-12-10.
ఏదైనా ఇంటర్వ్యూ లో వున్నపుడు గాని, ఎవరితోనైనా అత్యవసరంగా మాట్లుడున్నపుడు గాని, బయట వీలుగాని ప్రదేశాలలో వున్నపుడు గాని మూత్ర విసర్జనకు వెళ్ళాలని అనిపిస్తే మనసును వీ విషయం మీదికి మళ్లించాలీ. ఉదాహరణకు శృంగార భావన, భక్తి భావన, ఏదైనా ఉద్యానవనంలో వున్నట్లు, మంచి సంగీతాన్ని వింటున్నట్లు సుగందాన్ని ఆస్వాదిస్తున్నట్లు గా భావిస్తే మూత్ర విసర్జనకు వెళ్ళాలనే భావనను తగ్గించుకోవచ్చు.
ఈ విధంగా అత్యసర పరిస్థితులలో మాత్రమే చేయాలి. అంతేగాని మూత్ర ప్రవాహాన్ని మాటి మాటికి ఆపకూడదు. దీని వలన సమస్యలు ఏర్పడతాయి.
అతి మూత్రం --నివారణ 27-12-10.
1. అల్లనేరేడు గింజల చూర్ణాన్ని ప్రతి రోజు ఒక టీ స్పూను ఉదయం, సాయంత్రం మంచి నీటితో తీసుకోవాలి.
2. తంగేడు గింజల పొడి --- 100 gr
గసాలు --- 100 gr
నల్ల నువ్వులు ----100 gr
అన్నింటిని విడివిడిగా దంచి చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ఒక టీ స్పూను పొడిని కషాయం కాచుకొని తాగాలి.
3. మర్రి
మేడి
నల్ల తుమ్మ
చెట్ల యొక్క బెరడులను తెచ్చి కషాయం కాచాలి. దీనిని తాగాలి.
మూత్రంలో మంట 12-3-11.
వేడి టీ --- ఒక కప్పు
నిమ్మరసం --- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది.
మూత్రాశయంలో మంట 15-3-11.
శరీరంలో నీటి శాతం తగ్గడం వలన మూత్రం చిక్కబడి మలినాలు తొలగించబడక మంట
వస్తుంది. దీనివలన రాళ్ళు ఏర్పడే అవకాశం కలదు. మరియు మూత్ర పిండాలలో సమస్యలు
ఏర్పడే అవకాశం కలదు.
గోక్షూరాది గుగ్గులు
చందనాసవం
ఉషీరాసవం
వీటిలో ఏదైనా వాడుకోవచ్చు.
1. సుగంధపాల వేర్ల పొడి
చక్కెర
పొడితో కషాయం కాచుకుని చక్కెర కలుపుకుని తాగాలి.
2. వట్టివేర్ల పొడి
సుగంధపాల వేర్ల పొడి
రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని కషాయం కాచి దానికి చక్కెర కలుపుకుని
తాగాలి.
దీనిని వాడడం వలన మూత్రాశయ సమస్యల నివారణే కాక, దాని వలన వచ్చే ఇన్ఫెక్షన్
కూడా నివారింపబడుతుంది.
3. పల్లేరుకాయల మెత్తటి పొడి --- 100 gr
కొండపిండి యొక్క సమూలం పొడి --- 100 gr
రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు రెండు టీ స్పూన్ల పొడిని నీళ్ళలో వేసి కషాయం కాచి చక్కెర కలిపి తాగాలి.
మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ --నివారణకు తమలపాకు పాలు 29-3-11.
నాగవల్లీ క్షీరం
e --కోలై అనగా కోలన్ లో నివసించే బ్యాక్టీరియ అని అర్ధం .
లక్షణాలు:-- కోలన్ నుండి ఇన్ఫెక్షన్ మూత్ర మార్గంలోకి చేరడం, పరిశుభ్రత లేకపోవడం,
మూత్ర పిండాలలో రాళ్ళు, మూత్ర విసర్జన సరిగా చేయక పోవడం, మొదలైన కారణాల
వలన మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ చేరుతుంది. .
తమలపాకులు --- 6
పాలు --- 250 ml
తేనె --- ఒక పెద్ద స్పూను
తమలపాకులను శుభ్రంగా కడగాలి. కల్వాన్ని శుభ్రంగా కడిగి ఆకులను వేసి మెత్తగా
నూరి గుడ్డలో వేసి రసం పిండాలి. దీనిని గోరువెచ్చని పాలలో కలపాలి. తరువాత తేనె కలిపి
బాగా కలిపి గ్లాసులో పోసుకుని తాగాలి.
దీనిని కనీసం ఒకటి రెండు నెలలు వాడాలి.
సూచనలు:-- ఈ వ్యాధి మాటిమాటికి రాకుండా ఉండాలంటే ఒక టీ స్పూను వంట సోడాను
ఒక గ్లాసు నీటిలో కలిపి రోజంతా తాగుతూ వుండాలి.
,మసాలాలు, ఘాటు పదార్ధాలు, ఆల్కహాలు వాడకూడదు. మూత్రాన్ని ఎక్కువగా
జారీ చేసే పదార్ధాలను కూడా వాడకూడదు.
మూత్రం సాఫీగా జారీ కావడానికి చిట్కా 29-3-11.
మూత్రం సరిగా రాకపోతే మోదుగ పూలను ఉడికించి పొట్ట మీద కడితే మూత్రం
సాఫీగా జారీ అవుతుంది.
మూత్ర విసర్జనలో అసౌకర్యము 10-4-11
ఇన్ఫెక్షన్ , కిడ్నీ లలో రాళ్ళు, బ్లాడర్ క్యాన్సర్ ,యోని సంబంధిత సమస్యలు,
మొదలైన కారణాల వలన ఈ సమస్య ఏర్పడుతుంది.
చందనం మాత్రలు
చందన తైలం --- 10 ml
తేనె మైనం --- 30 gr
పల్లేరు కాయలు --- 50 gr
నీళ్ళు --- నాలుగు కప్పులు
పల్లేరు కాయలను కచ్చాపచ్చాగా దంచాలి. ఒక గిన్నెలోనీళ్ళుపోసి దంచిన పల్లేరు కాయలను వేసి మరిగించి ఒక గ్లాసు కషాయానికి రానివ్వాలి.
ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి నీళ్ళు పోసి దానిలో ఒక చిన్న గిన్నెను పెట్టి దానిలో తేనేమైనం
వేయాలి. అది కరిగిన తరువాత దానిలో చందన తైలం కలపాలి. దించి చల్లార్చితే అది గట్టిపడుతుంది. గట్టిపడే దశలో మాత్రలు కట్టాలి. .
రోజుకొక మాత్ర మింగి ముందే తయారు చేసుకున్న కషాయం తాగాలి. సమస్య తీవ్రంగా వుంటే
పూటకు రెండు మాత్రల చొప్పున వాడవచ్చు. ఈ విధంగా 40 రోజులు వాడాలి.
దీనివలన మూత్రంలో మంట, చీము, అసౌకర్య మూత్ర విసర్జన సమయంలో తొడల వరకు
లాగుతున్నట్లుగా వుండే నొప్పి నివారింపబడతాయి.
కారం, పులుపు, మసాలాలు తగ్గించి తినాలి. నీళ్ళు ఎక్కువగా తాగుతూ వుండాలి.
ధనియాల కషాయం కాచి దానిలో చక్కెర కలిపి తాగాలి. టీ డికాషన్ వలన కూడా తగ్గుతుంది.
పొత్తి కడుపు నొప్పి గా వుంటే ఇసుక కాపడం పెడితే తగ్గుతుంది.
పావు టీ స్పూను వంట సోడాను నీళ్ళకు కలుపుకొని తాగాలి. B. P. వున్నవాళ్ళు తాగకూడదు.
పులుపు కారణంగానే మంట ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని నివారణ అతి ముఖ్యం .
స్త్రీలలో అతిమూత్ర సమస్య -- నివారణ 13-4-11
నేరేడు గింజల పొడి ---50 gr
పల్లేరు కాయల పొడి ---50 gr
నల్ల నువ్వుల పొడి ---25 gr
నల్ల జీలకర పొడి ---25 gr
నువ్వులను, జిలకరను దోరగా వేయించాలి.
అన్నింటిని విడివిడిగా దంచి, జల్లించి, కలిపి భద్రపరచుకోవాలి. లేదా బెల్లం కలిపి మాత్రలు
తయారు చేసుకోవచ్చు. ( శనగ గింజలంత)
ఉదయం రెండు, సాయంత్రం రెండు మాత్రల చొప్పున వేసుకోవాలి. లేదా ఒక టీ స్పూను
పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి కషాయం కాచి అర గ్లాసుకు రానిచ్చి తాగాలి.
అతిమూత్ర వ్యాధి నివారణకు జాజికాయ మాత్రలు 17-6-11.
1. జాజికాయ చూర్ణం --- 18 gr
పచ్చ కర్పూరం --- రెండు గ్రాములు
తేనె --- కొద్దిగా
జాజికాయ పొడి, పచ్చకర్పూరం కలిపి సీసాలో భద్ర పరచుకొని అవసరమైనపుడు తగినంత తీసుకొని
తేనె కలిపి నాకేయ్యవచ్చు . లేదా తేనె కూడా కలిపి శనగ గింజలంత మాత్రలు చేసి పెట్టుకోవచ్చు,
పూటకు ఒక మాత్ర చొప్పున రోజుకు రెండు పూటలా నీటితో సేవించాలి
2. మూడు టీ స్పూన్ల నువ్వులను ఒక కప్పు నీటిలో వేసి కషాయం కాఛి వడకట్టి కషాయం తాగితే మూత్ర
సంబంధ సమస్యలు తగ్గుతాయి
3. కటి వలయాల కండరాలను బిగిస్తూ నడుముకు బలం కలిగించాలి .
మూత్రం ఆగకుండా పోతూవుంటే 18-7-11.
పావు కప్పు ఆవు మూత్రాన్ని తీసుకొని 24 సార్లు వడకట్టాలి .దానికి రెండు వంతుల నీటిని మరియు ఒక టీ
స్పూను తేనె ను కలిపి తాగాలి . ఈ విధంగా రెండు , మూడు వారాలు గాని వాడితే సమస్య తప్పక నివారింపబడుతుంది
మూత్రాశయం లో సమస్యలు రాకుండా --- జాగ్రత్తలు 25-8-11
ఎండబెట్టిన పల్లేరు కాయలు --- 50 gr
వాయువిడంగాలు --- 50 gr
మిరియాలు --- 50 gr
శొంటి ముక్కలు --- 50 gr
తీపి కోడిశపాల గింజలు ( కుటజ ) --- 50 gr ( దీనిలో చేదు , తీపి అని రెండు రకాలుంటాయి ) .
ఒక పుచ్చ కాయను తీసుకోవాలి . దాని మధ్యలో రెండు అంగుళాల సైజు లో గాటు పెట్టి ముక్కను బయటకు తీయాలి
కాయలోని గుజ్జును కూడా కొంత తీయవచ్చును . ఆ రంధ్రం లో పైన చెప్పబడిన పదార్దాలన్నింటిని పోయాలి . తరువాత
తొలగించిన ముక్కను ఆ రంధ్రాన్ని కప్పుతూ మూత్ పెట్టాలి . తరువాత ఈ పుచ్చకాయను రాత్రంతా వెన్నెలలో ఉంచాలి . ఉదయం కాయలో వేసిన పదార్దాలను అన్నింటిని బయటకు తీసి ఎండబెట్టాలి .బాగా ఎండిన తరువాత
దంచి , జల్లించి నిల్వ చేసుకోవాలి .
ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నీటితో సేవించాలి . దీనితో మూత్ర సమస్యలన్నీ నివారింపబడతాయి .
అతి మూత్ర సమస్య ---నివారణ 14-9-11.
కొండపిండి ఆకును పప్పులో వేసి కూర వండుకొని తింటే వ్యాధి నివారింపబడుతుంది
ఈ ఆకు అతి మూత్ర సమస్యను నివారించడమే కాక , మూత్రం బొట్లు బొట్లు గా పడుతున్నా సాఫీగా జారీ అయ్యేట్లు చేస్తుంది . మధుమేహాన్ని నివారిస్తుంది .
కొండ పిండి ఆకును పాషాణభేది అనికూడా అంటారు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి