పాలు తాగే పిల్లలలో సంగ్రహ ణి

                                       పాలు తాగే పిల్లలలో సంగ్రహ ణి                                25-8-10.

                                                      కృష్ణాది చూర్ణం

         ఈ వ్యాధి చనుబాలు తాగే పిల్లలలో వస్తుంది.  తల్లి పాలలో దోషముంటే ఆ పాల ద్వారా పిల్లలకు  ఈ సమస్య ఏర్పడుతుంది.    ఇది ఒక రకమైన విరేచన సమస్య (  Decentry )

       ఈ వ్యాధి వలన పిల్లలలో మలము సాఫీగా రాదు,  ఆకలి సరిగా వుండదు, పొట్ట ఉబ్బరింపు వుండి మాటిమాటికి ఏడుస్తూ వుంటారు.  దీని వలన పిల్లలు శుష్కించి బలహీన పడుతుంటారు.  చర్మం శరీరానికి అంటుకు పోతుంది.

పి ప్పళ్ళు  (కృష్ణ)    ( ఎండబెట్టి దోరగా వేయించి దంచి జల్లించి పొడి చేయాలి )
తుంగ ముస్థలు
మారేడు పండు గుజ్జు
వాము
శొంటి

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి.   అన్నింటిని విడివిడిగా చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి

     3  నుండి  6  గురిగింజలంత పొడిని తేనె తో కలిపి కొద్దికొద్దిగా నాకించాలి.

     దీని వలన చాల త్వరగా జీర్ణశక్తి, ఆకలి బాగా పెరుగుతుంది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి