కడుపులోని క్రిములు ---నివారణ 28-10-10.
కపాలభాతి ప్రాణాయామం , మయూరాసనం వేయాలి.
దానిమ్మ చెట్టు బెరడు ---- 50 gr
నీళ్ళు ---- ఒక లీటరు
నీటిలో దానిమ్మ చెక్క బెరడును వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు కాచాలి. ఉదయాన్నే
20 గ్రాముల కషాయాన్ని తాగాలి. ప్రతి గంట కొకసారి ఇరవై గ్రాముల చొప్పున తాగుతూ వుండాలి. ఆ రోజంతా పలుచని గంజి వంటి ఆహారాన్నే వాడాలి. ఈ విధంగా 40 రోజులు చేస్తే కడుపులో క్రిములు నశిస్తాయి.
నులి పురుగుల సమస్య --- నివారణ 30-11-10.
రెండు వక్కలను నానబెట్టి మజ్జిగతో నూరాలి. ముద్దగా చేసి కడుపు లోకి తీసుకోవాలి.
వక్కలను చిన్నచిన్న ముక్కలుగాచేయాలి. వాటిలో కొద్దిగా యాలకుల పొడిని, చాలా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వక్క పొడి తయారు చేసి అతిగా భోంచేసిన తరువాత కొద్దిగా నోట్లో వేసుకొని నమిలి తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
నులి పురుగుల నివారణకు ---విడంగాది చూర్ణం
పిల్లలలో దగ్గు సమస్య వున్నపుడు ఒక్కోసారి వాళ్ళు కఫాన్ని మింగుతూ వుంటారు ఈ సమస్య, మరియు మలబద్ధక సమస్య కూడా ఈ చూర్ణంతో నివారింపబడతాయి.
మొదలైన సమస్యలు వుంటాయి.
వాయువిడంగాల చూర్ణము ----100 gr
సైంధవ లవణం ---- 100 gr
యవాక్షారం పొడి ---- 100 gr
కరక్కాయల పొడి ---- 100 gr
ఒక్కొక్క దానిని విడివిడిగా దంచి చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. కలిపెటపుడు
యవాక్షారాన్ని చివరలో కలిపితే మంచిది. గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఒక సంవత్సరం
వరకు ప్రభావవంతంగా వుంటుంది. లేదా రెండు, మూడు నెలలకొకసారి కూడా చేసి నిల్వ చేసుకోవచ్చు.
చిన్న పిల్లలకు --- 2 -- 5 gr
దీనికి మజ్జిగ ఉత్తమమైన అనుపానం. లేదా వేడి నీటితో కూడా ఇవ్వవచ్చు.
ఉపయోగాలు :-- ఇది నులిపురుగులను నివారిస్తుంది. ఇది కఫాన్ని, మలబద్ధకాన్నిఅజీర్ణాన్ని . అరుచిని నివారిస్తుంది. పులి త్రేనుపులను నివారించుటలో దివ్యమైన ఔషధము. చర్మము పై వచ్చే దద్దుర్లు నివారింప బడతాయి.
నులిపురుగులు --- నివారణ 21-6-11
1. రాత్రి నిద్రించే ముందు అర గ్రాము దాల్చిన చెక్క పొడిని నోట్లో వేసుకుని నీళ్ళు తాగాలి ,
2. ఒకటి, రెండు ఎందు ఖర్జూరాలను నిమ్మ రసంలో అడ్డుకొని తినాలి .
సూచన :-- పిల్లలతో మట్టి తినడాన్ని మాన్పించాలి
27-7-11
సమస్య రావడానికి గల కారణాలు :--- చిన్న పిల్లలు మురికిగా వున్న ఆహారపదార్ధాలను తినడం, గోళ్ళను కట్టిరించుకోక
పోవడం , పరిశుభ్రంగా లేకపోవడం , కలుషిత జలాన్ని తాగడం మొదలైనవి . పై కారణాల వలన క్రిములు నోటి ద్వారా
కడుపులో చేరిపోతాయి .
లక్షణాలు :--- నులిపురుగులు శరీరంలో వున్నపుడు దగ్గు , ఆస్తమా , శరీరం మీద మచ్చలు మొదలైన సమస్యలు
ఏర్పడతాయి . ఈ క్రిములు రక్తం ద్వారా మెదడుకు చేరి ఫైట్స్ వచ్చే అవకాశం కూడా కలదు .
వేపగింజల పొడి --- అర టీ స్పూను
గోధుమ పిండి --- ఒక టీ స్పూను
పంచదార --- అర టీ స్పూను
తమలపాకు --- ఒకటి
వేపగింజల పొడిని , గోధుమ పిండిని , పంచదారను కలిపి పిల్లల చేత తినిపించావచ్చును లేదా ఆ మిశ్రమాన్ని
తమలపాకులో ఉంచి తినిపించావచ్చును
దీని యొక్క ఘాటుకు కడుపులోని క్రిములు నశిశ్తాయి .
2. నీరుల్లిపాయ గుజ్జు ---- ఒక టీ స్పూను
కురాసాని వాము పొడి ---- ఒక టీ స్పూను
బెల్లం ---- రెండు టీ స్పూన్లు
అన్ని పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి పిల్లలతో తినిపించాలి .ఈ విధంగా వారం రోజులు తినిపిస్తే
క్రిములు తప్పక నశిస్తాయి .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి