పక్షవాతం

                         పక్షవాత నివారణకు వెల్లుల్లి తైలం --తైల మర్దన                        1-3-09.
 
        ప్రతి రోజు నువ్వుల నూనెతో తప్పకుండా మర్దన చెయ్యాలి.
 
                           నువ్వుల నూనె                   ----పావు కిలో
                           ఒలిచిన తెల్ల పాయలు        ---- 50 gr
                           మిరియాల పొడి                 ---- 25 gr
                           ముద్దకర్పూరం                    ---- 3 టీ స్పూన్లు
                               వెల్లుల్లి  పాయలను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. నువ్వులనూనెను స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద  మరిగించాలి. వెల్లుల్లిపాయల ముక్కలను నూనె చిందకుండా నెమ్మదిగా నూనెలో వెయ్యాలి.  పాయలు నల్లగా మాడేవరకు కాచాలి. తరువాత జాగ్రత్తగా వడ పోసుకోవాలి. దీనిలో మెత్తని మిరియాల పొడిని నూనెలో చల్లాలి.
నూనె గోరువెచ్చగా అయిన తరువాత ముద్దకర్పూరం కలపాలి.
       దీనిని శరీరంలో చచ్చుబడిన ప్రదేశంలో రుద్దితే కదలిక వస్తుంది ., నరాలు బలంగా తయారవుతాయి.
 
                                                పాలు                  ----- ఒక కప్పు
                                                నీళ్ళు                  ----- ఒక కప్పు
                                               వెల్లుల్లి పాయలు    ----- 2,3
                                               కలకండ                ----- ఒక టీ స్పూను
                                               వాయువిడంగాల పొడి -- ఒక్క గ్రాము మాత్రమే
 
     పాలు, నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి వెల్లుల్లి పాయలను తోకలు కత్తిరించి పాలల్లో వెయ్యాలి. చిన్న మంట మీద పాలు పొంగి పోకుండా ఒక కప్పు మిగిలే వరకు కాచాలి. తరువాత వడ  పోయ్యాలి ఈ పాలలో కలకండ, వాయు విడంగాలపొడిని కలపాలి.
 
    ఈ పాలను పక్షవాతపు రోగికి తాగించి పై తైలం తో మర్దన చెయ్యాలి.(ఆవు పాలైతే శ్రేష్టం).  ఎక్కడికక్కడ బిగుసుకుపోయిన అవయవాలు,నరాలు తిరిగి బలాన్ని పొంది
త్వరగా కోలుకుంటాయి.
 
                     పక్షవాతాన్ని పోగొట్టే తైలం                                                             25-4-09.

     పక్షవాతం చాలా రకాలుగా వచ్చే అవకాశం ఉంది.

 దెబ్బలు తగలడం వలన వచ్చే పక్షవాతం.

B.P. పెరగడం వలన వచ్చే పక్షవాతం.

ముఖ పక్షవాతం,

హస్త పక్షవాతం

 శరీరంలోని  అన్ని భాగాలకు వచ్చే పక్షవాతం

                                        చేతులకు, కాళ్ళకు వచ్చే పక్షవాతం -- నివారణ

                   వెల్లుల్లి రెబ్బల సన్న ముక్కలు        ---- 30 gr
                   ఉమ్మెత్త కాయలు                           ---- 2 మాత్రమే
                   ఆవ నూనె                                     ---- 200 gr

        వెల్లుల్లి పాయలను సన్న ముక్కలుగా తరగాలి. ఉమ్మెత్త కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి    వెల్లుల్లి ముక్కలను, ఉమ్మెత్త ముక్కలను ఆవ నూనెలో వేసి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించాలి  బాగా ఎర్రగా  కాగే వరకు కాచాలి. తరువాత స్టవ్ ఆపి వడకట్టాలి. చల్లారిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఉపయోగించే విధానం:--  మెడ,వెన్నుపూస, నడుము లమీద ఈ తైలం తో మర్దన చెయ్యాలి. రెండు బొటన వేళ్ళతో జిగ్ జాగ్ పద్ధతిలో మర్దన చెయ్యాలి. దీని వలన రక్త ప్రసరణ పునరుద్ధరించ బడుతుంది. 
       తైల మర్దన చేసేటపుడు శరీరం భరించ గలిగినంత వేడిగా మర్దన చెయ్యాలి.  అర చేతులలో కూడావేడి పుట్టే వరకు  రుద్దాలి.
తరువాత ఆవిరి పట్టాలి.  నీటిలో జిల్లేడు  ఆకులు,వావిలాకులు, పసుపు మరిగించాలి. ఆ నీటిలో నూలు గుడ్డను ముంచి పిండి వేడి గమనించి కాపడం పెట్టాలి.

      కుడి భాగంలో పక్షవాతం వస్తే మెదడు లో ఎడం భాగంలో రక్తం గడ్డ కట్టి వుంటుంది. వేడి నీటిలో ముంచిన గుడ్డను తల మీద కూడా  అద్దాలి. అదే విధంగా వెనక వైపు కూడా చేయాలి.

      అర చేతులకు, వేళ్ళకు  ఎక్కువ ప్రాధాన్యమిచ్చి బాగా కాపడం పెట్టాలి.

      తరువాత చేతులు, మెడ మొదలైన అవయవాలకు వ్యాయామం చెయ్యాలి.
 contd...          26-4-09.

   తైలం మర్దన చేసిన తరువాత కాళ్ళకు వ్యాయామం చేసేటపుడు  మడమ పై చేయి వుంచి కాలి వేళ్ళను కదిలించాలి. వేళ్ళను ప్రక్కలకు, గుండ్రంగా త్రిప్పాలి, కదిలించాలి. మోకాలి మీద చేయి పెట్టి పాదాన్ని పట్టుకొని కాలును గుడ్రంగా తిప్పాలి.

       చేతి మణికట్టు దగ్గర పట్టుకొని చేతి వేళ్ళతో వ్హేసే వాళ్ళు వేళ్ళు మార్చి వేళ్ళను కదిలించాలి. గుండ్రంగా మరియు పక్కలకు తిప్పాలి. మోచేయి దగ్గర పట్టుకొని చేతిని పైకి కిందికి కదిలించాలి.

       మెడను కూడా అలాగే కదిలించాలి.

       తరువాత కుర్చీలో కూర్చొని కాళ్ళ కింద చెక్కతో చేసిన ముళ్ళ రోలర్ను పెట్టుకొని మడమ నుండి వేల్లవరకు దొర్లించాలి.
    అదే విధంగా   చేతులపై  హస్తంనుండిభుజంవరకు రోలర్ తో రుద్దాలి.మెడమీద, వెన్నుపూస మీదతిప్పాలి.
 చాలా సున్నితంగా చెయ్యాలి. రెండు అర చేతుల మధ్యలో పెట్టుకొని తిప్పాలి.

                         ముఖ పక్షవాతం (అర్ధ ముఖ పక్షవాతం)                                 2-4-09.

కారణాలు:-- ప్రమాదాలు జరగడం వలన, అధిక రక్తపోటు, రక్తప్రసరణ సరిగా లేకపోవడం, ఎక్కువ చలిగాలిలో తిరగడం,వంటి కారణాల వలన ఎక్కువగా వచ్చే అవకాశం కలదు.

                                నువ్వుల నూనె           ---100 gr
                                వావిలాకు                 ---100 gr

      నువ్వుల నూనెను స్టవ్ మీద పెట్టి పచ్చి ఆకులను వేడి నూనెలో వేయాలి.కొంత సేపటికి ఆకులు నల్లగా  మాడిపోతాయి. చల్లారిన తరువాత వడకట్టాలి. సీసాలో భద్ర పరచుకోవాలి.

ఉయోగించే విధానం:--  కణత దగ్గర నుండి చెంప మీదుగా రుద్దాలి. cheeks మీద గుండ్రంగా మర్దన చెయ్యాలి. చెంప మీద నుండి చేతిని నోటి వైపుకు మర్దన చెయ్యాలి.చెవి వెనక నుండి మెడ మీదుగా గొంతు వరకు సున్నితం గా నెమ్మదిగా మర్దన చెయ్యాలి. ముక్కు, మీసాల దగ్గర నుండి చెంప వైపుకు రుద్దాలి.

ఆవిరి పట్టడం:--  నీటిలో పసుపు, వావిలాకు  వేసి మరిగించి దానిలో నూలు గుడ్డను ముంచి పిండి వేడి గమనించుకొని ఆవిరి పట్టాలి.కన్ను మూసుకొని చెయ్యాలి. వావిలాకు దొరకని పక్షంలో మునగాకుగాని, కానగాకు గాని, కసివింద ఆకు గానితంగేడు ఆకు గాని వేసి పసుపు వేసి మరిగించాలి.

వ్యాయామం:-- 1  కుడి వైపు పక్షవాతం వుంటే మూతిని ఎడమ వైపుకు లాగాలి(స్వయంగా) కదిలించలేని స్థితిలో వుంటే వేరే వ్యక్తులచే లాగించుకోవచ్చు.

2. బుగ్గలను బాగా పూరించి ఉబ్బించాలి.

3. కళ్ళు మూసుకొని దవడలను బిగించడం వదలడం చెయ్యాలి.

4. తలను కదిలించకుండా కళ్ళను పైకెత్తడం దించడం చెయ్యాలి.

5. గాలి వదులుతూ తలను కిందకి దించాలి, గాలి పీలుస్తూ తలను పైకెత్తాలి. తలను ప్రక్కలకు భుజాలు కదల కుండా తిప్పాలి.

6. నాలుకను బాగా ముందుకు చాపడం పూర్తిగా వెనక్కు లాక్కోవడం చెయ్యాలి.

              శరీరం లో ఏ భాగానికి పక్షవాతం వచ్చినా --నివారణ                               3-5-09.

కారణాలు;-  విపరీతమైన ఆందోళన,మితిమీరిన ఆవేశం వలన, అకస్మాత్తుగా ప్రమాదకరమైన వార్త వినడం వలన శరీరంలో అతిగా కొవ్వు చేరడం వలన ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం వున్నది.

      50 గ్రాముల తేనె తీసుకొని పోస్తూ వుంటే కోలుకుంటారు.

      100 గ్రాముల మిరియాలు తీసుకొని తగినంత నీరు కలిపి మెత్తగా నూరి నువ్వుల నూనె కలిపి ముడుచుకు పోయిన వేళ్ళ మీద మర్దన చెయ్యాలి. అలాగే కాలిమీద మిగిలిన ముద్దను పట్టు వెయ్యాలి.  ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.

      " కసివింద  ఆకు తెచ్చి వెన్న కలిపి నూరి పట్టు వెయ్యాలి. దీని వలన మంచి ఫలితాలు కనబడ్డాయి."

కడుపులోకి:--
                                     అల్లం రసం             ---- 50 gr
                                     ఉల్లిపాయల రసం    ---- 20 gr
                                     తేనె                      ---- 20 gr

      కలిపి ఉదయం, సాయంత్రం తాగించాలి.  దీని వలన సుఖవిరేచనము అవుతుంది. రక్తప్రసరణ బాగా జరుగు తుంది.B.P. కంట్రోల్ అవుతుంది.

                                     వస కొమ్ముల పొడి         ---- 50 gr
                                     శొంటి పొడి                    ---- 30 gr
                                     నల్ల జిలకర పొడి            ---- 20 gr

      వస కొమ్ములను ఒక రోజంతా నీటిలో నానబెట్టి తీసి నలగగొట్టి ఎండబెట్టి దంచి జల్లించి పొడి చెయ్యాలి.

అన్ని పొడులను కలిపి సీసాలో భద్ర పరచాలి.

       3 చిటికెల పొదిలో తేనె కలిపి ఉదయం, సాయంత్రం తినిపించాలి.

       దురదగొండి రసం చెవులలో వెయ్యాలి.  దాని వేర్ల చూర్ణాన్ని (3 చిటికెలు) నీటితో కలిపి రుద్దాలి.

      తైలం తో మర్దన చేస్తే కట్టే లాగా బిగుసుకుపోయిన భాగాలు మృదువుగా తయారవుతాయి.

వ్యాయామం:--చేతి వేళ్ళను గోరువెచ్చని నూనెతో   మర్దన చేసి ఒక చేతి యొక్క నాలుగు వేళ్ళను ఇంకొక చేతితో పట్టుకొని ముందుకు వెనుకకు వంచాలి. తరువాత ఒక్కొక్క వేలును వంచాలి.

     రోగి యొక్క నాలుగు వేళ్ళలో మన యొక్క వేళ్ళను దూర్చి మణికట్టు దగ్గర ముందుకు, వెనుకకు వంచాలి
అదే విధంగా కాలును మోకాలి దగ్గర పట్టుకొని ముందుకు, వెనుకకు వంచాలి. రోగిని పక్కకు పడుకోబెట్టి కాలును పైకి లేపాలి కిందికి దించాలి. బోర్లా పడుకోబెట్టి కాలును పైకి కిందికి కదిలించాలి.

    పాదం పట్టుకొని వేళ్ళను, పాదాన్ని కదిలించాలి.

ఆహార నియమాలు:--

     రోగిని చల్లని వాతావరణం వున్న గదిలో ఉంచకూడదు, వేడిగా వున్న గదిలో ఉంచాలి. అతి చలువ చేసే పదార్ధాలు పెట్టకూడదు. సొరకాయ(అనప  కాయ), దోసకాయ, ఫ్రిజ్ లోని పదార్ధాలు పెట్టకూడదు.
తెల్లవి, కొత్త బియ్యం వాడకూడదు. పాత గోధుమ రవ్వ గంజి చాలా  మంచిది.  పాత బియ్యం మంచిది.

     తేనె ను ఒక టీ స్పూను తో ప్రారంభించి నాలుగు టీ స్పూన్లకు పెంచాలి.  రోజుకు మూడు, నాలుగు సార్లు ఇవ్వాలి/. ప్రతి రోజు ఇవ్వాలి.

     ఆహారం గట్టిగా వుండకూడదు వీలైనంత మెత్తగా వుండాలి.సులభంగా జీర్ణమయ్యే పదార్ధాలను వాడాలి.

     పావురాళ్ళ మాంసం,రక్తం అవసరం లేదు. రెట్టను తేనె కలిపి తింటే త్వరగా కోలుకుంటారు.

                        పక్ష వాతము --- నివారణ                                           25-5-10.
 
శొంటి
దుంప రాష్ట్రం
అక్కల కర్ర
 
        అన్నింటి  యొక్క చూర్నాలను సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
 
        ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి కాచి అర గ్లాసుకు రానిచ్చి  ప్రతిరోజు తాగాలి.
 
       మిరియాలను మంచి నీటితో నూరి చచ్చుగా వున్న శరీర భాగాలపై పలుచగా లేపనం చెయ్యాలి.

                                  వెల్లుల్లితో పక్షవాత నివారణ                                                  2-6-10.
 
      మొదటి రోజు ఒక వెల్లుల్లి పాయ, రెండవ రోజు రెండు, మూడవ రోజు మూడు ఈ విధంగా 20  వ రోజు 20 పాయలు ముద్దగా నూరి మింగాలి.  21  వ రోజు 19 పాయలు, 20 వ రోజు 18  పాయలు ఆవిధంగా ఒకటి వరకు   తగ్గించుకుంటూ రావాలి.
 
     వెల్లుల్లిని  చిన్న పిల్లలలకు నేరుగా వాడకూడదు.

                      పక్షవాతం ---నివారణ ---వాతాదివటి                                            30-3-11.
    
     వెల్లుల్లి               --- 150 gr
     జీలకర్ర పొడి       ---  ఒక  గ్రాము
     నల్ల ఉప్పు         ---    "      "
     త్రికటు చూర్ణం     ---   "       "
     ఆముదం           ---  తగినంత
      
       కల్వంలో  వెల్లుల్లిని  కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా,  ముద్దగా నూరాలి. దీనికి మిగిలిన చూర్ణాలను
  కలపాలి.  తరువాత దానికి తగినంత ఆముదం కలిపి  మెత్తగా నూరాలి.

       తరువాత కుంకుడు గింజలంత ( ఒక గ్రాము )   మాత్రలు కట్టాలి.

       పూటకో మాత్ర చొప్పున రోజుకు రెండు సార్లు ఆముదంతో తీసుకోవాలి. స్పూను లో ఆముదం
  తీసుకుని  దానిలో మాత్ర వేసుకుని కలిపి తాగాలి.

       ధూమపానం,  స్థూల కాయం  తప్పని సరిగా తగ్గించుకోవాలి.

        మొలకెత్తిన గింజలను తీసుకోవాలి.  తక్కువ క్యాలరీలు వున్న ఆహారం తినాలి.

                                           ముఖ పక్షవాతం --నివారణ                                        8-7-11.

1. వెల్లుల్లి గర్భాలు          --- పది
         వీటిని మెత్తగా నూరి ఆముదంతో గాని లేదా తేనెతో గాని పది రోజులు సేవిస్తే ముఖం పక్కకు లాగడం సమస్య
సులభంగా నివారింపబడుతుంది .

2. తమలపాకులు                  --- 3
    అడవితులసి ఆకులు          --- గుప్పెడు
    వెల్లుల్లి రెబ్బలు                 --- 3
    మిరియాలు                      --- 20

         అన్నింటిని కలిపి మెత్తగా నూరి గుడ్డలో వేసి పిండి ఆ రసాన్ని తాగాలి .

3. ఒక కప్పు పాలలో చిటికెడు శొంటి వేసుకొని తాగాలి .

                                                    పక్షవాతం  --- నివారణ                                   20 -8 - 11.
కానుగ చెట్టు బెరడు రసం
           ఆముదం

        రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి స్టవ్ మీద పెట్టి  రసం ఇంకిపోయి  ఆముదం మాత్రమె మిగిలేవిధంగా
కాచాలి .        దీనితో శరీరం లో  చచ్చు పడిన భాగం మీద రుద్దాలి .

                                     కసివింద  మొక్కతో  --- పక్షవాత నిర్మూలన                     2-9-11.

         కసివింద  ఆకులను తగినంత వెన్న కలిపి నూరి చచ్చుబడిన భాగానికి లేపనం చేసి పట్టు లాగా వేయాలి . ఈ
విధంగా 5, 6 సార్లు పట్టు వేస్తె మామూలు స్థితికి వస్తుంది



      
       



    

  










                  









                       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి