అపాన వాయు సమస్య

                         అపాన వాయు సమస్య ---నివారణ                            2-5-10.

వాము                 ---50 gr
నల్ల ఉప్పు           ---25 gr

          రెండింటి యొక్క పొడులను బాగా కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

         ఆహారం తరువాత అర టీ స్పూను పొడిని వేసుకొని గోరువెచ్చని నీటిని తాగాలి. దీని వలన తిన్న ఆహారం  వెంటనే జీర్ణమవుతుంది.  సమస్య నివారింప బడుతుంది.

                                                       స్వానుభవం

లక్షణాలు :--- కడుపులో నొప్పి , ఆహారం జీర్ణం కాకపోవడం , పులిత్రేన్పులు అపాన వాయువులో  దుర్వాసన  మొదలైన
                    లక్షణాలు వుంటాయి

నల్ల ఉప్పు పొడి                ---- 50 gr
మిరియాల పొడి               ---- 50 gr
కరక్కాయ పెచ్చులు         ---- నాలుగైదు కాయలవి

     కరక్కాయలను నిప్పులో కాల్చి చల్లార్చి నలగగొట్టి పెచ్చులు తీసుకోవాలి . దంచి చూర్ణం చేయాలి

     అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి .

ఉపయోగించే విధానం :---  అర  స్పూను నుండి ఒక స్పూను పొడిని ( వయసును బట్టి )  వేడి నీటిలో కలుపుకొని తాగాలి
చాలా త్వరగా సమస్య నివారింపబడుతుంది


        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి