వంట ఇంటి దినుసులు -- ఆయుర్వేద ప్రయోజనాలు
శీతాకాలంలో వెల్లుల్లి ఉపయోగాలు 29-5-10.
గుండెపోటు గలవారికి రెండు గంటల లోపు చికిత్స జరగకపోతే చాలా ప్రమాదం
1. Brain Stroke 2. Heart Stroke అని రెండు రకాలు.
రక్తం సరిగా సరఫరా జరగకపోవడం వలన ఈ సమస్యలు వస్తాయి.
" వెల్లుల్లి హృదయం ఆకారంలో వుంటుంది. దీనికి మహౌషధి అని పేరు "
వెల్లుల్లి యొక్క ఉపయోగాలు
1. గుండెకు రక్తం అందలేని పరిస్థితులలో రక్తం అడ్డు లేకుండా సరఫరా జరిగేట్లు చేస్తుంది.
2. 2, 3 పాయలను పాలల్లో ఉడికించి చక్కెర కలిపి తీసుకుంటే పక్షవాత సమస్యలు నివారింప బడతాయి.
3. రెండు తెల్ల పాయలను సన్నగా తరిగి ఆవు నేతిలో వేయించి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో కాలంగా వున్నవాత నొప్పులు నివారింప బడతాయి.
రసోన = వెల్లుల్లి
అల్లం యొక్క ఉపయోగాలు ( ఆయుర్వేద సంహిత నుండి) 28-12-10.
ఇది అజీర్ణం, వాంతులు, వేవిళ్ళను నివారించడం లో అమోఘమైనది.
అజీర్ణం :--
ఆహారానికి ముందు ఒక చిన్న అల్లం ముక్కను ఉప్పులో అద్దుకుని తినాలి.
దగ్గు, ఆయాసం :--
అల్లం రసం --- అర టీ స్పూను
తేనె --- అర టీ స్పూను
రెండింటిని కలిపి రోజుకు రెండు మూడు సార్లుగా తాగితే మంచిది.
వేరుశనగ పప్పు ---ఉపయోగాలు 11-3-11.
వేరుశనగ పప్పుల యొక్క నాలుకలలో విష పదార్ధాలు వుంటాయి. వాటిని తినడం
వలన శరీరం మీద దద్దుర్లు ఏర్పడతాయి.
ఉపయోగాలు ;-- దీనిని వాడితే పిల్లలు పుష్టిగా ఎరుగుతారు.
ఉప్పుతో కలిపి వాడితే కదిలే దంతాలు గట్టి పడతాయి .
బోదకాలు :--
అల్లం రసం --- పావు లీటరు
కరక్కాయ పొడి --- 100 gr
అర టీ స్పూను పొడిని అర టీ స్పూను అల్లం రసం తో కలిపి తీసుకోవాలి.
జీలకర్ర 29-12-10.
ప్రధానంగా జీలకర్రను ఆహారం యొక్క అరుగుదలకు వాడుతారు.
జలుబు, శిరోభారం :__ ఇది జలుబును, శిరోభారాన్ని బాగా నివారిస్తుంది.
జీలకర్ర --- ఒక స్పూను
పసుపు ---- ఒక స్పూను
బెల్లం ---- ఒక స్పూను
అన్నింటిని కలిపి దంచి గుడ్డలో కట్టి వాసన పీలిస్తే తల బరువు, జలుబు, సైనసైటిస్ నొప్పి తగ్గుతాయి.
జ్వరం :-- వృద్ధాప్యంలో కూడా వాడుకోదగినది.
ఒక టీ స్పూను జిలకరను దంచి రసం తీసి అర టీ స్పూను పసుపు కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది.
అరుచి :-- ఆకలి వుంటుంది కాని రుచి తెలియదు. అటువంటపుడు :--
జీలకర్ర --- ఒక టీ స్పూను
అల్లం రసం --- పావు కప్పు
జీలకర్రను అల్లం రసంలో నానబెట్టాలి. ఆ జిలకరను ఎండబెట్టి దానిని తింటూ వుంటే రుచి చాలా బాగా
తెలుస్తుంది.
ఎక్కిళ్ళు :-- జీలకర్రను పొగ పీల్చే గొట్టంలో వేసి పీలిస్తే ఎక్కిళ్ళు వెంటనే తగ్గుతాయి.
రక్తపోటు :--
జీలకర్ర
ధనియాలు
అల్లం
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని కలిపి దంచి రసం తీసి పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా తీసుకుంటే రక్తపోటు నివారింప బడుతుంది. క్రమంగా తగ్గుతుంది.
నీళ్ళ విరేచనాలు :-- ఒక కప్పులో ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేసుకుని తాగితే తగ్గుతాయి.
మిరియాలు ( Blachk Pepper) 10-1-11.
జలుబు "--
మిరియాల పొడి --- అర టీ స్పూను
బెల్లం ---- కొంచం
పెరుగు ----కొంచం
కలిపి తీసుకోవాలి
వేడి పాలలో కొద్దిగా మిరియాల పొడి చల్ల్లి, పసుపు కలిపి తాగాలి
ఎక్కిళ్ళు :--
ఒక మిరియాల గింజను సూదికి గుచ్చి కాల్చాలి. ఆ పొగను పీలిస్తే టక్కున ఆగిపోతాయి.
తల నొప్పి కూడా తగ్గుతుంది.
కంటి సమస్యలు :--
మిరియాల పొడి --- అర టీ స్పూను
నెయ్యి --- అర టీ స్పూను
కలిపి తీసుకుంటే కళ్ళ మంటలు, నీరు కారడం, పుసులు కట్టడం వంటి సమస్యలు నివారింప బడతాయి.
దగ్గు, ఆయాసం :--
మిరియాల పొడి --- అర టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
కలిపి తీసుకోవాలి.
ముళ్ళు గుచ్చుకుంటే :--
నువ్వులు 11-1-11.
అర్శమొలలు :-- ఒక టీ స్పూను నువ్వులను నీటితో కలిపి నూరి వెన్నతో కలిపి తినాలి. మూడు పూటలా వాడాలి.
దీని వలన రక్తస్రావం ఆగిపోతుంది. నొప్పి, దురద తగ్గిపోతాయి.
బహిష్టు నొప్పి :--
నువ్వుల నూనె --- రెండు టీ స్పూన్లు
పాలు --- ఒక గ్లాసు
నువ్వులను నూరి పాలలో కలుపుకుని ప్రతినెల మొదటి మూడు రోజులు తాగితే నొప్పి తగ్గుతుంది. బహిష్టుకు ఒకటి, రెండు రోజుల ముందు నుండి తీసుకున్నా మంచిది.
ఆవాలు 26-1-11.
దురదలు, చిడుము, ఇతర చర్మ వ్యాధులు:-- పై పూతకు మందు :--
ఆవ నూనె --- పావు లీటరు
జిల్లేడు ఆకుల ముద్దా -- పది గరాములు
పసుపు పొడి --- రెండు టీ స్పూన్లు
రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేవరకు కాచాలి. వడపోసి సీసాలో భద్ర
పరచుకోవాలి.
దీనిని పై పూతగా వాడాలి.
దంత వ్యాధులు :--
ఆవాల పొడి --- 50 gr
కల్లుప్పు పొడి --- 50 gr
రెండింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ పొడితో ప్రతి రోజు పళ్ళు తోముకుంటే పళ్ళ మీది జిడ్డు, పాచి తొలగిపోతాయి. ఇన్ఫెక్షన్ చేరదు .
పొడి దగ్గు :-- అర టీ స్పూను నువ్వులను ముద్దగా నూరి పటికబెల్లం కలుపుకుని తింటే వెంటనే దగ్గు తగ్గుతుంది.
ముళ్ళు గుచ్చుకుంటే :--
నువ్వుల నూనె -- ఒక టీ స్పూను
నువ్వు పిండి -- ఒక టీ స్పూను
ముద్దగా నూరి పట్టు వేయాలి.
శొంటి 12-1-11.
శొంటి 12-1-11.
శొంటి శోధిస్తుంది.
అజీర్ణం, ఆకలి లేకపోవడం:--
శొంటి పొడి ---అర టీ స్పూను
అల్లం రసం --- ఒక టీ స్పూను
బెల్లం --- 50 gr
కలిపి తీసుకోవాలి.
తలనొప్పి :--
శొంటిని సాన రాయి మీద నీటితో అరగదీసి ఆ గంధాన్ని నొసటి మీద, కనతల మీద పూస్తే తగ్గుతుంది.
వాపులతో కూడిన కీళ్ళ నొప్పులు :--
శొంటి పొడి ---అర టీ స్పూను
ఆముదం --- ఒక టీ స్పూను
రెండింటిని కలిపి లేహ్యం లాగా కలిపి నాకాలి. తరువాత వేడి నీరు తాగాలి.
నేత్ర సమస్యలు :--
శొంటి పొడి --- 10 gr
వేపాకు --- గుప్పెడు
సైంధవ లవణం --- 10 gr
అన్నింటిని కలిపి ముద్దగా నూరి బిళ్లలుగా చేసి కళ్ళ మీద పెట్టుకోవాలి.
సున్నం 13-1-11.
సున్నం 13-1-11.
సున్నపు రాయిని బట్టీలలో కాలిస్తే క్యాల్షియం ఆక్సైడ్ తయారవుతుంది.
సున్నపు తేత = చూర్నోదకం
అరుచి :--
సున్నం --- చిటికెడు
అల్లం రసం --- ఒక టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
కలిపి తీసుకోవాలి.
అజీర్ణం :--
సున్నపు తేట --- ఒక టీ స్పూను
పాలు --- ఒక కప్పు
కలిపి తాగాలి.
అతిసారం:--
సున్నపు తేట ---ఒక టీ స్పూను
మజ్జిగ --- ఒక గ్లాసు
కలిపి తాగాలి.
తేలుకాటు :--
సున్నం --- ఒక టీ స్పూను
వేపాకు రసం --- ఒక టీ స్పూను
బాగా కలిపి తేలుకాటు మీద పట్టు వేయాలి. చెవిలో కూడా రెండు మూడు చుక్కలు వేయాలి.
కాలిన గాయాలు :--
సున్నపు తేట కు మీగడ లేక అవిశ నూనె లేక గుగ్గిలం లేక కొబ్బరినూనె కలిపి పూయాలి.
బహిష్టు సమయంలో రొమ్ముల్లో నొప్పి :--
సున్నం --- ఒక టీ స్పూను
తేనె --- ఒక టీ స్పూను
కలిపి పట్టు వేస్తే త్వరగా తగ్గుతుంది,
ఎముకలు విరిగినపుడు :--
సున్నం --- ఒక టీ స్పూను
వెన్న --- ఒక టీ స్పూను
ఎముకలు విరిగినపుడు, వాపు వున్నపుడు కలిపి పట్టు వేస్తే వాపు తగ్గిపోతుంది.
చింత 17-1-11.
దీనిలో అన్ని భాగాలు ఉపయోగ పడతాయి.
వాపులతో కూడిన దెబ్బలు :--
చింత పండు గుజ్జు --- 10 gr
చింతాకు రసం --- 10 gr
గోధుమ పిండి --- 10 gr
అన్నింటిని కలిపి మెత్తగా నూరి గుడ్డకు పూసి గాయం మీద వేసి కట్టు కట్టాలి. దీనితో వాపు తగ్గుతుంది.
ఎముకలు విరగడం :--
50 గ్రాముల చింత పండును గుజ్జును వేడి చేసి దానికి తగినంత నువ్వుల నూనెను కలిపి గాయం మీద వేసి
కట్టాలి.
ఆకలి తగ్గడం :--
చింత పండు గుజ్జు
బెల్లం
దాల్చిన చెక్క
యాలకులు
మిరియాలు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని ముద్దగా నూరి కుంకుడు గింజంత ముద్దా నోట్లో పెట్టుకుని చప్పరించాలి. దీనితో ఆకలి పెరుగుతుంది.
బియ్యం 18-1-11.
బియ్యం =తండుల = శాలి ధాన్యం
1. అర్శమొలలు :--
బియ్యం
వెన్న
నెయ్యి
అన్నింటిని కలిపి మేక పాలు పోసి వండి తింటూ వుంటే రక్త లేదా అర్శమొలలు నివారింప బడతాయి.
2. రక్త హీనత :--
బియ్యం
బార్లీ
రెండింటిని కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటూ వుంటే రక్త వృద్ధి జరుగుతుంది.
4. కాలిన గాయాలు :--
మొదట గాయాన్ని శుభ్ర పరచి తరువాత వరి పొట్టు యొక్క మెత్తటి తవుడుకు నెయ్యి కలిపి పూయాలి.
5. అధిక ఋతుస్రావం :--
ఎర్రబియ్యం
ఆవు పాలు
కలిపి ఉడికించి చల్లార్చి తేనె కలిపి తీసుకోవాలి.
చింత ---ఉపయోగాలు 25-1-11.
దీనిలో ఆకులు, పువ్వులు, గింజలు, పండు, బూడిద అన్ని ఉపయోగపడతాయి.
పాము కాటు :-- వైద్య మనోరమ అనే గ్రంధంలో దీనిని గురించి చాల గొప్పగా చెప్పబడినది.
చింతాకు రసం --- 160 ml
ఉప్పు --- 20 gr
రెండు కలిపి తాగితే సర్ప విషం హరింప బడుతుంది.
ఎముకలు విరగడం :-- సిద్ధ భేషజా మణిమాల అనే గ్రంధంలో చెప్పబడినది.
చింతపండు గుజ్జు ---- 100 gr
సున్నం ---- తగినంత
గుజ్జును ఉడికించి సున్నం కలిపి పట్టు వెయ్యాలి. దీని వలన ఎముకలు అతుక్కుంటాయి.
టీ పొడి యొక్క ఉపయోగాలు 12-3-11.
విరేచనాలను తగ్గిస్తుంది.
మూత్రంలో మంటను నివారిస్తుంది.
కురుపులను, గాయాలను మాన్పుతుంది.
టీ పొడి యొక్క ఉపయోగాలు 12-3-11.
విరేచనాలను తగ్గిస్తుంది.
మూత్రంలో మంటను నివారిస్తుంది.
కురుపులను, గాయాలను మాన్పుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి