చిగుళ్ళు

                                                      చిగుళ్ళ సమస్యలు --నివారణ
1.  (30-11-10.)

వక్కలను నీళ్ళలో పోసి ఉడికించి నోట్లో వేసుకొని చప్పరిస్తూ వుంటే చిగుళ్ళ వాపు తగ్గుతుంది

2.  (2-12-10)

 10 తులసి ఆకులు , 10  సన్నజాజి ఆకులను కలిపి నమలాలి. లేదా ముద్దగా నూరి చిగుళ్ళకు
పట్టించాలి.
3. (8-12-10)

 పళ్ళు సరిగా శుభ్రం చేసుకోక పోవడం ,రక్త హీనత, రక్త స్రావం మొదలైన కారణాల వలన వాపు
వస్తుంది.
    గట్టి పదార్ధాలను కొరకడం వలన వాపు రాదు,
    నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి, నోట్లో పోసుకొని పుక్కిలిస్తే వాపు తగ్గుతుంది.
                               లోద్దుగ చెక్క               ----------100 gr
                               తుంగ ముస్థలు            ----------100 gr
                               జటా మాంసి                ----------100 gr
                               త్రిఫల చూర్ణం               ----------100 gr
                 వీటన్నింటిని విడివిడిగా బాగా మెత్తగా చూర్ణాలు చేసి , కలిపి నిల్వ చేసుకోవాలి.
                 తగినంత పొడిని తీసుకొని నీళ్ళు కలిపి పేస్టు లాగా చేసి వాపు వున్న దగ్గర పెట్టాలి.
4. (20-2-11)

 కారణాలు:-- ప్రధానంగా Infection చేరడం వలన , వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన, మధుమేహం
వలన  చిగుళ్ళలో వాపు వచ్చే అవకాశం ఎక్కువ.
         జామ ఆకులను చిన్న ముక్కలుగా చేసి ,నీళ్ళలో వేసి ,మరిగించి ఆ కషాయాన్ని పుక్కిట పట్టాలి. దీని వలన చిగుళ్ళ వాపు, నొప్పి తగ్గుతాయి.
         నల్ల తుమ్మ బెరడుతో కషాయం తయారుచేసి దానికి కొద్దిగా పటిక కలిపి పుక్కిలించాలి. దీని వలన చిగుళ్ళ వాపు, నొప్పి తగ్గుతాయి.
        నేరేడు ఆకులను రాతి కల్వం లో  వేసి మెత్తగా నూరి గుడ్డలో వేసి రసం పిండి దానిని పుక్కిట పడితే ఎంతటి చిగుళ్ళ నొప్పులైనా తగ్గుతాయి.
5. (21-2-11) 

   కుండలో నీళ్ళు తీసుకొని, దానిలో పొడి బెల్లం వేసి కలపాలి. దానిలో నిమ్మ రసం పిండాలి. బాగా కలిసేటట్లు తిప్పాలి. దీనిని ప్రతి రోజు తాగితే ముక్కు నుండి రక్తం కారడం తగ్గుతుంది.
6.( 7-5-11)

                            చిగుళ్ళ నుండి రక్తం కారడం :--

  కారణాలు :-- చిగుళ్ళకు దెబ్బ తగలడం,రఫ్ గా ఉన్న బ్రష్ తో తోమడం, విటమిన్  సి మరియు కే యొక్క లోపం, ఆకుకూరలు,కాయగూరలు తినకపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది.
                                  రక్త స్తంభన లేపన చూర్ణం
                                      లొద్దుగా చెక్క చూర్ణం        -------5 gr
                                      త్రిఫల చూర్ణం                   -------5 gr
                                      వేపాకుల చూర్ణం              -------5 gr
                                      నల్ల ఉప్పు                      ------- 5 gr
              ఒక పాత్రలో అన్ని చూర్ణాలను కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. దీనితో పళ్ళను, చిగుళ్ళను శుభ్రపరచుకోవాలి. సమస్య తగ్గే వరకు వాడాలి. రోజుకు రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. కొంతసేపు ఆగి నీళ్ళు పుక్కితబట్టి, కొంతసేపు వుంచి గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి.
                                     ఉసిరి  చూర్ణం         -----1 T.S.
                                     లోద్దుగా చెక్క చూర్ణం --1/2  T.S.
                   రెండు కలిపి నీటితో కడుపులోకి తీసుకోవాలి.
               
7. (16-5-11                  చిగుళ్ళ వ్యాధుల వలన దంతాలు కదులుతూ వుంటే --నివారణ
                                        తుమ్మ కాయల పొడి           ------100 gr
                                        శొంటి పొడి                          ------ 100 gr
                                        లవంగాల పొడి                    ------ 100 gr
                                        తుంగ ముస్తల పొడి             ------ 100 gr
                 కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.
                 ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి కాచి అర గ్లాసుకు రానివ్వాలి. గోరు వెచ్చని నీటిని నోట్లో పోసుకొని  పుక్కిలించాలి. పుక్కిటబట్టి కొంత సేపు అలాగే ఉంచాలి. ఈ విధంగా పది, పదిహేను నిమిషాలు వుంచి కడుక్కోవాలి.
                ఈ విధంగా ప్రతి రోజు చేస్తే పళ్ళు చాలా ద్రుధంగా  తయారవుతాయి. ఎంతటి గట్టి పదార్ధాల నైనా కొరకగలరు.
8. (25-8-11)                         చిగుళ్ళ నుండి రక్తం కారడం ---నివారణ  
కారణాలు :--   చిగుళ్ళకు దెబ్బ తగలడం, పాచి పేరుకు పోవడం, పోషకాహార లోపం, మొ=
                                            కాచు                  --------10 gr
                                            దిరిసెన చెట్టు బెరడు ----- 20 gr
                                            సీమ సుద్ద              ------ 20 gr
         అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతి రోజు రెండు పూటలా పళ్ళు తోముకుంటూ వుంటే చిగుళ్ళలో చీము, రక్తం కారడం వాపు తగ్గుతాయి.
                                            నిమ్మ తొక్కల చూర్ణం           ----40 gr
                                            కరక్కాయ పెచ్చుల చూర్ణం   ---- 20 gr
                                            పంచదార పొడి                     ---- 10 gr
         అన్నింటిని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనితో పళ్ళు తోముకుంటే అన్ని సమస్యలు నివారింప బడతాయి. గట్టి పదార్ధాలను కోరక కూడదు. రెండు పూటలా దంత ధావనం చెయ్యాలి. అతి చల్లని, అతి వేడి  పదార్ధాలను వాడ కూడదు.
                                   చిగుళ్ల సమస్య --చికిత్స                                  17-6-10.
పటిక
కుంకుడు కాయల పెచ్చులు
     మట్టి మూకుడులో నిప్పులు తీసుకొని వాటి పై పటికను పొంగించాలి.  దానిలో నీరు ఇంకిపోయి, తెల్లగా పొంగుతుంది దానిని నూరాఆలి (శుద్ధ భస్మం) 
     కుంకుడు కాయల లోని గింజలను తొలగించి పెచ్చులను నిప్పులపై నల్లగా కాల్చాలి.చల్లార్చి పొడిగా నూరాలి
     రెండింటి యొక్క భస్మాలను సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.
     ఈ పొడితో నెమ్మదిగా చిగుళ్ల మీద రుద్దుతూ వుంటే చిగుళ్ల లో చేరిన ఇన్ఫెక్షన్, వాపు, రక్తం కారడం వంటిసమస్యలు   నివారింప బడతాయి. దీనిని క్రమం తప్పకుండ వాడుతూ వుంటే పళ్ళు కదలకుండా వుంటాయి
.
                                                    30-11-10

       వక్కలను నీళ్ళు పోసి ఉడికించి నోట్లో పోసుకొని చప్పరిస్తూ వుంటే చిగుల్ల వాపు తగ్గుతుంది
.
                                  చిగుళ్ళ నొప్పుల నివారణకు                                   13-12-10.

       వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన ఈ వ్యాధి వస్తుంది.

       ఒక టీ స్పూను ఉల్లి రసంలో కొద్దిగా ఉప్పు కలిపి  రుద్దితే చిగుళ్ళ నొప్పులు తగ్గుతాయి.

                                                   17-9-10

వాము పొడి
సైంధవ లవణం

     రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని పళ్ళు తోముకుంటే  చిగుళ్ళ వాపు, నొప్పి, తగ్గుతుంది.

                                                   2-12-10

తులసి ఆకులు        ---- 10
సన్న జాజి ఆకులు   ---- 10

       రెండింటిని కలిపి నమలాలి. లేదా రెండు కలిపి ముద్దగా నూరి చిగుళ్ళకు పట్టించాలి.

                                                    3-1-11

లక్షణాలు :-- చిగుళ్ళలో వాపు,  చిగుళ్ళు జారడం, నొప్పి, ఉమ్మినపుడు రక్తపు జీరలు,  ఆ రక్తం గులాబి రంగులో  కాక నీలం రంగులో  కనిపించడం
కారణాలు :--     సరిగా బ్రష్  చెయ్యకపోవడం,  నోటిని సరిగా శుభ్ర పరచకపోవడం,  పళ్ళ మధ్య పుల్లలతో గుచ్చడం  పొగాకు నమలడం, మధుమేహ వ్యాధి, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం మొదలైనవి.

      త్రిఫల చూర్ణం చేతిలోకి తీసుకుని పళ్ళ మీద చిగుళ్ళ   మీద గుండ్రంగా రుద్దాలి.

      నువ్వుల నూనెను నోట్లో పోసుకుని   ఆయిల్ పుల్లింగ్ చేసుకుని పళ్ళ మీద చిగుళ్ళ  మీద రుద్దాలి

       కానుగ వేరు చూర్ణం తయారు చేసుకుని  దానితో చిగుళ్ళ  మీద రుద్దాలి.

                                                చిగుళ్ళ నుండి రక్తం కారడం --- నివారణ                      25-8-11.

కారణాలు :---- చిగుళ్ళ  కు దెబ్బ తగలడం , పాచి పేరుకు పోవడం , పోషకాహార లోపం మొదలైనవి .

కాచు                           --- 10 gr
దిరిసెన చెట్టు బెరడు      --- 20 gr
సీమ సుద్ద                    --- 20 gr

       అన్నింటి యొక్క చూర్ణాలను  బాగా కలిపి నిల్వ చేసుకోవాలి .
      ప్రతి రోజు రెండు పూటలా ఈ చూర్ణం తో పళ్ళు తోముకుంటూ వుంటే చిగుళ్ళ  నుండి రక్తం కారడం , వాపు తగ్గుతాయి 

నిమ్మతోక్కల చూర్ణం                   --- 40 gr
కరక్కాయ పెచ్చుల చూర్ణం            --- 20 gr
పంచదార పొడి                            --- 10 gr

      అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి . దీనితో ప్రతి రోజు పళ్ళు తోముకుంటూ వుంటే అన్ని సమస్యలు నివారింప
బడతాయి .       

సూచనలు :--- గట్టి పదార్ధాలను వాడకూడదు . రెండు పూటలా దంతధావనం చేసుకోవాలి . అతిచల్లని , అతివేడి
పదార్ధాలను వాడకూడదు

                                                               




 


2

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి