జ్వరనివారణకు మాత్రలు

                              జ్వర నివారణకు మాత్రలు                                             27-1-09.
 
                                తులసి  ఆకు రసం           --------- 50 gr
                                మిరియాలు                    --------- 50 gr
                                అల్లం రసం                     --------- 50 gr
 
      అన్నింటిని కల్వంలో వేసి మెత్తగా నూరి బటాణి గింజలంత మాత్రలు చేసి ఎండ బెట్టి నిల్వ చేసుకోవాలి.
ఈ మాత్రలను ఉదయం, రాత్రి పూటకు రెండు చొప్పున వేసుకొని జ్వరం వచ్చినపుడు తీసుకోవలసిన జావము ఆహారంగా తీసుకోవాలి. దీని వలన తప్పకుండా జ్వరం తగ్గుతుంది.
 
  విష జ్వరాల, సాధారణ జ్వరాల నివారణకు --భైరవ గుళికలు                                     16-5-09.

                                 కృష్ణ తులసి ఆకుల పొడి     ----- 20 gr
                                 వేపాకు పొడి                      ----- 20 gr
                                 మిరియాల పొడి                ----- 20 gr
                                 పటిక    పొడి                      ----- 6 gr

        అన్ని పొడులను కలిపి కల్వంలో వేసి తగినంతనీరుకలిపి శనగ గింజలంత మాత్రలు కట్టి  నీడలో ఆరబెట్టాలి.తడిలేకుండా ఆరిన తరువాత సీసాలో నిల్వ చేసుకోవాలి.

                                 పిల్లలకు                 ------ శనగ గింజంత
                                 పెద్దలకు                 ------ బటాణి గింజంత

     మాత్రను వేసుకొని నీళ్ళు తాగాలి.
     జావ, గంజి మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.

                               అధిక జ్వరము ---- నివారణ                                          21-6-09.

        వేప చెక్కను నీటిలో వేసి కషాయం కాచి ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగి, దుప్పటి కప్పుకొని పడుకుంటే అర గంటలో జ్వరం పూర్తిగా తగ్గి పోతుంది . హాయిగా లేచి తిరగవచ్చు.

                        జ్వరము--- నివారణ                                                                 18-2-10.

       తిన్న ఆహారం జీర్ణం కాకుండా అజీర్ణం ఏర్పడినపుడు జ్వరం వస్తుంది.

సూర్యభేదన ప్రాణాయామం, శీతలీ ప్రాణాయామం, శీత్కారీ ప్రాణాయామం లను చేయాలి.

      అప్పటికి జ్సరం తగ్గకపోతే  102,103 డిగ్రీల జ్వరం వున్నపుడు నూలు గుడ్డను తడిపి పిండి నాభి నుండిచాతీ వరకు చుట్టాలి. (తడి కట్టు)  ఇంకా అధికంగా వుంటే శరీరమంతా తడి కట్టు కట్టాలి.

      పలుచని, సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి.

                                                  తులసి  మాత్రలు

     అవసరమైనన్ని మిరియాలను మట్టి మూకుడులో వేసి మిరియాలు మునిగేటట్లు తులసి యొక్క నిజరసం పోయాలి   ఉదయం ఈ మూకుడును ఎండలో బెట్టి మధ్య మధ్యలో కలియ బెడుతూ వుండాలి. మరలా రాత్రికి మిరియాలు మునిగేటట్లు తులసి రసం పోయాలి.  ఉదయం ఎండబెట్టాలి. ఈ విధంగా 21 రోజులు చేయాలి. తరువాత పూర్తిగా బాగా తేమ లేకుండా ఎండబెట్టాలి.  తరువాత వాటిని కల్వంలో వేసి తులసి రసం పోస్తూ మెత్తగా మాత్ర కట్టుకు వచ్చేట్టు గా నూరాలి. శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి.

పెద్ద పిల్లలకు                      ----- రెండు మాత్రలు
పెద్దలకు                             ----- నాలుగు మాత్రలు

       తేనెతో గాని, వేడి నీటితో గాని సేవించాలి. చాలా త్వరగా జ్వరం నివారింప బడుతుంది.

                                                          చలి జ్వరం

తులసి ఆకుల పొడి                   ---- 50 gr
మిరియాల పొడి                       ---- 50 gr
పుదీనా ఆకుల పొడి                  ---- 50 gr
గుంటగలగర ఆకుల పొడి           ---- 50 gr

      అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి.

      భయంకరమైన గడగడ వణికిస్తున్న చలి జ్వరం వున్నపుడు రెండు కప్పుల నీటిలో ఒక స్పూనుపొడి వేసి  మరిగించి ఒక కప్పు కషాయానికి రానివ్వాలి.  దీనిని తాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది.  మెత్తని  ఆహారాన్ని ఇవ్వాలి.

             ఎండా కాలం వచ్చే పైత్య జ్వరాలు --నివారణ                                         28-2-10

తులసి ఆకులు                ----- పిడికెడు
అడ్డసరం ఆకులు            -----      "      లేదా ఒక టీ స్పూను పొడి
గుంటగలగర                  -----      "
పిప్పళ్ళు                        ----- నాలుగు పిప్పళ్ళు మాత్రమే

    పిప్పళ్ళను వేయించి దంచి చెరిగితే బియ్యం వస్తాయి.

      అన్నింటిని కలిపి ఒకటిన్నర లీటర్ల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించి అర లీటరు కషాయానికి రానివ్వాలి.దించి వడపోసి పూటకు ఒక కప్పు చొప్పున రోజుకు నాలుగు పూటలా వాడాలి. దీని వలన పైత్య జ్వరం నివారించ బడుతుంది.

                               తిప్ప తీగతో జ్వర నివారిణి                                                    26-4-10.
 
తిప్ప తీగ             --- 20 gr
     నీళ్ళు             ---200 ml
 
        తిప్ప తీగ పొడిని నీటిలో వేసి కాచి సగానికి రానివ్వాలి. గోరువెచ్చగా అయిన తరువాత తేనె గాని చక్కెరగాని కలుపుకొని తాగాలి.  జ్వరం ఎక్కువగా వుంటే రోజుకు రెండు మూడు సార్లు తాగాలి.
 
2. తిప్ప తీగ పొడిని తేనె కలిపి తీసుకోవచ్చు.
           దీనిని జలుబు నివారణ కు కూడా వాడవచ్చును.
 
    తిప్ప తీగను ప్రతి రోజు వాడుతూ వుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

                                          పారిజాతపు మొక్క ---జ్వర నివారణ
 
      ఆకులు, కాండము కచ్చాపచ్చాగా దంచి నీళ్ళలో వేసి కషాయం కాచి తాగితే జ్వరము త్వరగా నివారింప బడుతుంది.                                     
                                                                18-11-10.
 
ధనియాలు            --- రెండు భాగాలు
శొంటి                   ---  ఒక భాగం
 
      రెండింటిని నీటిలో వేసి కషాయం కాచాలి. ధనియాలు వేడిని తగ్గిస్తాయి. జ్వరం వలన ఆకలి వుండదు. శొంటిఆకలిని పెంచుతుంది.
 
                    జ్వర నివారణకు  తిప్ప తీగతో అమృత ఆహారం                                 26-8-10.

                       తిప్ప తీగ   =  గుడూచి  =  అమృత వల్లి

     పచ్చి తీగ చాలా మంచిది. బొటన వేలంత  లావుగా వున్న తీగను సేకరిస్తే మంచిది.  ఆ తీగను రోటిలో వేసి దంచి బట్టలో వేసి పిండి రసం తియ్యాలి.  నీరుకలిపిదంచవచ్చు.   ఒక లీటరు  రసాన్ని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి  అర లీటరు అయ్యేంత వరకు కాచాలి.  దానిలో కలకండ పొడి కలిపి స్టవ్ మీదపెట్టి పాకం లాగ తయారు చెయ్యాలి.

     పచ్చి తీగ దొరకని పక్షంలో అరకిలో ఎండు తీగలను సేకరించి  నాలుగు లీటర్ల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి ఒక లీటరు వరకు రానివ్వాలి. దానిలో రెండు కిలోల కలకండను కలిపి పాకం లాగా కాచాలి.  సీసాలో భద్ర పరచాలి.

     అర కప్పు నీటిలో  30 ml పాకాన్ని కలిపి  104 డిగ్రీల జ్వరం వున్నవాళ్ళకు  ఇవ్వాలి. ఈ విధంగా రోగికి రోజుకు ఆరుసార్లు ఇవ్వాలి.  జ్వరాన్ని బట్టి మోతాదు తగ్గించుకోవచ్చు.

    కొంతమందికి జ్వరం వున్నపుడు శరీరంలో, కళ్ళలో,  చేతులలో, కాళ్ళలో, పాదాలలో మంటలు వుంటాయి.

         ఈ పానకం తాగితే జ్వరం తగ్గుతుంది. శరీరంలోని అన్ని రకాల మంటలు తగ్గుతాయి.
   జ్వరం లేకుండా పైత్య ( వేడి ) లక్షణాలు ఎక్కువగా వున్నపుడు కళ్ళు, చర్మము, అరిచేతులు, కాళ్ళు  మూత్ర విసర్జనలో మంటలు వున్నపుడు ఈ పానకం తాగితే ఆరోగ్యవంతులవుతారు. .
       
   .             జ్వర సంహార కషాయం                                                 16-8-09.

తిప్పతీగ                      --- ఒక ఆకు     ( త్రిదోష సంహారిణి  )
కృష్ణ తులసి ఆకులు      ---  పది           (  నలగగోట్టాలి)
వేప చిగుళ్ళు                ---  10  --- 15  (  కఫసంహారిణి  )
నలగగొట్టిన  శొంటి         ---  10 gr         ( విశ్వ భేషజం )
నల్ల మిరియాలు            ---  10              (వేడి చేసి ఆరుస్తాయి) 
బెల్లం                           ---  20 gr
నీళ్ళు                          ---  ఒక గ్లాసు

          అన్నింటిని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు కషాయం మిగిలేట్లు కాచాలి. మరిగేట పుడు బెల్లం కలపాలి

          దీనిని వడ పోసుకుని తాగాలి. తాగ గలిగినంత వేడిగా తాగాలి.  పూటకు ఒక కప్పు చొప్పున  ఉదయం,  సాయంత్రం తాగాలి.

          దీనిని సేవించడం వలన వొంటి నోప్పులు, తీవ్రమైన జలుబు,  పిల్లికూతలు,  ఆయాసం, ఉబ్బసం,  అతి కటినమైన  జ్వరము  మరియు దాని వలన కలిగే భయంకరమైన నొప్పులు తగ్గిపోతాయి.

         దీనిని తాగి దుప్పటి కప్పుకుని  పడుకుంటే అరగంటలో జ్వరం తగ్గిపోతుంది.

         తేలికైన ఆహారం తీసుకోవాలి.    జావ లో సైంధవ లవణం,  కరక్కాయపొడి కలుపుకుని తాగవచ్చు.

         రసం అన్నం కొద్దిగా తినాలి.     పప్పు,  సాంబారు లాంటివి తినకుంటే మంచిది.

                         దోమకాటు వలన జ్వరాలు                                                        11-1-11.

         శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గినపుడు  దోమలు కుడితే  జ్వరాలు వస్తాయి.

లక్ష్మి విలాస రస   అనే ఔషధం  జ్వరాన్ని బాగా నివారిస్తుంది.

తిప్ప తీగ పొడి                   --- 100 gr
నేలవేము  పొడి                   --- 100 gr
త్రిఫల చూర్ణం                     --- 100 gr
అతిమధురం                      --- 100 gr
బెల్లం                                --- తగినంత
 
         అన్ని చూర్నాలను కల్వంలో వేసి బెల్లం కలిపి నూరాలి. శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి.

        పెద్దలకు:--  పూటకు ఒక్క మాత్ర చొప్పున రోజుకు మూడు పూటలా మూడు మాత్రలు వాడాలి.
        పిల్లలకు :--  పూటకు సగం మాత్రం చొప్పున  మూడు పూటలా వాడాలి

        ఈ మాత్రలు జ్వరాలను నివారించడమే కాక  రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

                                          జ్వరము --నివారణ                                             1-4-11.
            శొంటి
            పిప్పళ్ళు 
            వాయువిడంగాలు
            చేదుజిలకర
            నల్లజిలకర

                     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని   విడివిడిగా దంచి  చూర్ణాలు  చేయాలి.
    అన్నింటిని కలిపి  కల్వంలో వేసి తగినంత తులసి రసం గాని,  నీరుగాని చేర్చి నూరి  శనగ
    గింజలంత  మాత్రలు తయారు చేయాలి. నీడలో బాగా ఆరనిచ్చి నిల్వ చేసుకోవాలి.
   
                     పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయం,  సాయంత్రం వేసుకుంటే  జ్వరం తగ్గుతుంది.

            2.  వేడి పాలల్లో  మిరియాల పొడి కలుపుకుని తాగితే జ్వరం తగ్గుతుంది.

            3.      కాఫీ  డికాషన్ లో నిమ్మరసం కలుపుకుని గోరువెచ్చగా తాగితే ఎంతటి మలేరియా
   జ్వరమైనా తగ్గుశొంటి తుంది.  డికాషన్ లో పాలు కలపకూడదు.

                                    సహాయకారక  జ్వర నివారిణి
           తిప్పతీగ
           కృష్ణ తులసి
           నేలవేము
           పుష్కరమూలం
           కటుకరోహిణి
           శొంటి లేదా అల్లం

    అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని దంచి, జల్లించి,  కలిపి నిల్వ చేసుకోవాలి.
    అర టీ స్పూను పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి.  ఈ విధంగా రెండు పూటలా
 తాగాలి. ఎటువంటి జ్వరమైనా తగ్గిపోతుంది.

                                           సకల జ్వర సంహారిణి

          ఎండబెట్టిన వాకుడు కాయల పొడి             --- 50 gr
          (కాడతో సహా) తిప్పతీగ ఆకుల పొడి         --- 50 gr
                               నేలవేము పొడి                  --- 50 gr
          దోరగా వేయించి దంచన శొంటి పొడి           --- 50 gr
                                  కటుకరోహిణి పొడి          --- 50 gr

          అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.

          ఒక టీ స్పూను పొడిని రెండు  కప్పుల   నీటిలో వేసి మరిగించి ఒక కప్పు కషాయానికి
  రానివ్వాలి.  దానిలో 20,  30 గ్రాముల పాతబెల్లం  కలుపుకుని తాగాలి.

           దీనిని సేవించడం వలన ఎటువంటి చలిజ్వరమైనా నివారింపబడుతుంది.

           జ్వరం వున్నసమయంలో అవసరాన్ని బట్టి రోజుకు రెండు, మూడుసార్లు ఆహారానికి
 (రొట్టె,  జావ) ముందు ఈ కషాయాన్ని తాగాలి.

           దీని వలన జ్వరం వలన కలిగే కడుపులో మంట తగ్గుతుంది. ఆకలవుతుంది, సుఖ
  విరేచనం అవుతుంది.

       చిటికెనవేలు,  బొటనవేలు, ఉంగరపువేలు  -- మూడింటిని కలిపి ముద్రవేసుకుని కూర్చోవాలి.

               అన్ని రకాల జ్వరాల నివారణకు ----కరంజాది వటుకములు                 26-5-11.
       
         కానుగ ( కరంజ) గింజల చూర్ణం            --- 50 gr
         దోరగా వేయించిన పిప్పళ్ళ చూర్ణం        --- 50 gr
                               తుమ్మ బంక చూర్ణం     --- 25 gr 

        అన్నింటిని కల్వంలో వేసి నూరి బటాణి  గింజలంత  మాత్రలు చేసి బాగా గాలి తగిలే చోట
  తడిలేకుండా ఆరబెట్టి  తరువాత భద్రపరచుకోవాలి .
        చిన్న పిల్లలలకు చిన్న మాత్రలు తయారు చేయాలి.

        పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా వాడాలి,  జ్వరం తీవ్రంగా వుంటే పూటకు
 రెండు మాత్రల చొప్పున మూడు పూటలా వాడాలి
        చిన్న పిల్లలకు మాత్రలో సగం మాత్రమె ఇవ్వాలి.

                            జ్వరాల నివారణకు గుడూచి  గుటికలు                                 28-5-11.

పొంగించిన పటిక  చూర్ణం                ---20 gr
         తిప్ప తీగ రసం                  --- 20 gr

                     రెండింటిని కలిపి నూరాలి.  తడి ఆరిన తరువాత మాత్రలు కట్టాలి .

పిల్లలకు             --- శనగ గింజలంత
పెద్దలకు             --- బటాణి  గింజలంత   

        జ్వరం ఎక్కువగా వుంటే పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా వాడాలి . లేదా
రెండు పూటలు వాడాలి . మాత్ర వేసుకొని గోరువెచ్చని నీరు తాగాలి .

                                                    జ్వరము ---నివారణ               
 
జ్వరం రావడానికి గల కారణాలు :-- బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్ వలన,  కీళ్ళ నొప్పుల వలన,వడదెబ్బ వలన 
జ్వరం వచ్చే అవకాశాలు వున్నాయి. 
 
  ధనియాల పొడి                   ---- రెండు టీ స్పూన్లు 
         నీళ్ళు                        ---- నాలుగు కప్పులు 
 
         రెండింటిని కలిపి మరిగించి ఒక కప్పుకు రానివ్వాలి.  వడకట్టి చక్కెర  కలుపుకొని తాగితే వెంటనే జ్వరం 
తగ్గుతుంది . 
 
నీళ్ళు                              ---- ఒక గ్లాసు 
తులసి ఆకులు                 ---- గుప్పెడు 
మిరియాలు                      ---- ఐదు 
అల్లం                               ---- చిన్న ముక్క 
 
         అన్నింటిని కలిపి కాచి వడకట్టి థాగాలి. 
 
వెల్లుల్లి ముద్ద                   ---- ఒక  టీ స్పూన్ 
       నెయ్యి                      ---- ఒక టీ స్పూను 
 
        రెండింటిని కలిపి ఉదయం పూట తీసుకుంటే  జ్వరము,  ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి . 
 
 చన్నీళ్ళలో  రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ఒళ్లంతా తుడిస్తే జ్వరం వెంటనే తగ్గుతుంది . 
 
ఒక టేబుల్ స్పూను పాలకు ఒక చిటికెడు పచ్చకర్పూరం కలిపి దానిలో గుడ్డ ముక్కను ముంచి తుడవాలి . 
 
 సూచనలు :-- నీటిని ఎక్కువగా  తాగించాలి . 
        
        పై పద్ధతులను పాటించడం వలన  హఠాత్తుగా వచ్చే జ్వరాలు నివారింపబడతాయి . 
-

                                                        జ్వరము ---నివారణ                                     23-6-11

        శరీరంలో కఫము ఎక్కువైనపుడు దానిని తగ్గించడానికి శరీరం ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది .

ఎకమూలికా ప్రయోగం :--

      నేలవేము ను దంచి జల్లించి ,  పొడి చేసి సీసాలో భద్రపరచుకోవాలి .
      ఒక చిటికెడు పొడిని  బెల్లం కలిపి గాని , తేనె కలిపి గాని ,  లేదా నీళ్ళలో కలుపుకొని గాని సేవిస్తూ వుంటే
ఎటువంటి జ్వరమైనా నివారింపబడుతుంది .

నేలవేము
నేల ఉసిరి
సుగంధపాల వేర్లు
శొంటి
ధనియాలు
కృష్ణ తులసి

     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి చూర్ణాలు  చేసి కలిపి పెట్టుకోవాలి .

     ఒక టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి, మరిగించి అర గ్లాసుకు రానివ్వాలి. తరువాత వడకట్టి పాతబెల్లం
కలుపుకొని తాగాలి .  దీనివలన  ఎంతటి జ్వరమైనా తగ్గిపోతుంది .

                                                   జ్వరాల నివారణకు ---తులసి టీ                          6-9-11.

తులసి ఆకుల పొడి          ---- 10 gr
యాలకుల పొడి              ---- రెండు యాలకులంత
మిరియాల పొడి              ---- పావు టీ స్పూను
శొంటి పొడి ( లేదా) అల్లం  __  పావు టీ స్పూను
పాలు                            ---- అరగ్లాసు
చక్కెర  లేదా కలకండ       ---- ఒక టీ స్పూను

     రెండు గ్లాసుల నీటిని  పెట్టి దానిలో పై పోడులన్నింటిని వేసి మరిగించి , వడకట్టి , పాలు , కలకండ కలిపి తాగాలి .
     దీనివలన వర్షాకాలంలో  కఫ ప్రభావం వలన వచ్చే జ్వరాలు తగ్గిపోతాయి .

     పిల్లలకు దీనిలో సగం మోతాదు ఇవ్వాలి

                                              విషజ్వరాలు --- నివారణ                                  11-9-11.

ఉత్తరేణి ఆకుల  చూర్ణము        ---50 gr
మిరియాల  చూర్ణము            --- 50 gr
వెల్లుల్లి  రసం                       --- 50 gr

      అన్నిటిని  కల్వం లో వేసి నూరి శనగ గింజలంత మాత్రలు తయారు చేసి నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి .

      కొద్దీ జ్వరమైతే మూడు పూటలా ఒక్కొక్క మాత్ర చొప్పున వేయాలి  ( ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం )
      ఎక్కువ జ్వరం వున్నపుడు పూటకు రెండు మాత్రల చొప్పున మూడు పూటలా వాడాలి .

      నీరసించి వున్నపిల్లలకు ,  కాలేయ సమస్యలు వున్న పిల్లలకు కూడా ఈ మాత్రలను ఇవ్వ వచ్చును , టాన్సిల్స్
సమస్యలు వున్న వాళ్లకు కూడా ఇవ్వ వచ్చును.

-                                            


           






                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి