ఆయుర్వేద టీ -- ప్రయోజనాలు

                                    ఆయుర్వేద టీ --- ప్రయోజనాలు
   
                వాంతులను నివారించి , ఆకలిని పెంచే ఆయుర్వేద టీ                              5-3-11.

ఉదయం అల్పాహారం తిన్న వెంటనే మామూలు టీ తాగకూడదు.

అల్లం ముక్కలు             ---- అర టీ స్పూను
దాల్చిన చెక్క                 --- అర టీ స్పూను ( చెక్కలోనే తియ్యదనం వుంటుంది)
యాలకుల పొడి            ---- చిటికెడు
నీళ్ళు                          ---- ఒక కప్పు
పాలు                          ---- అవసరమైతే

     ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. దీనిలో మిగిలిన పదార్ధాలను
వేసి కలియబెట్టి మూత పెట్టి వెంటనే స్టవ్ ఆపెయ్యాలి. అయిదు నిమిషాలు అలాగే ఉంచితే
పదార్ధాలలోని ఔషధ గుణాలు నీటిలోకి దిగుతాయి. దానిని వడ పోసుకుని అలాగే తాగాలి లేదా
వేడి శరీరం వున్నవాళ్ళు అయితే ఒక కప్పు పాలు కలుపుకుని తాగ వచ్చు. దీనిలో కొద్దిగా తేనె
కలుపుకోవచ్చు.

ఉపయోగాలు :--

బాగా ఆకలి అవుతుంది.
వాంతులు, వికారం, ఒకరింపు తగ్గుతాయి.
నోటి దుర్వాసన తగ్గుతుంది.
స్థూల కాయం నివారింప బడుతుంది. శరీరంలోని అధిక కొవ్వు తగ్గుతుంది.
మధుమెహ వ్యాధిగ్రస్తులు దీనిని వాడితే ఎంతో ఉపయోగకరం.

                                               శక్తి చాయ్                                                          13-4-11.

       యవలు లేదా గోధుమలు దంచగా వచ్చిన పొట్టు           --- 10 gr
                                                        మంచి నీళ్ళు         --- రెండు కప్పులు

      రెండింటిని కలిపి  మరిగించి ఒక కప్పుకు రానివ్వాలి. వడకట్టి చక్కెర  కలిపి తాగాలి.

      పూటకు ఒక కప్పు చొప్పున ఉదయం,  సాయంత్రం తాగాలి.   ఉ  +  సా   ---1 + 1
      దీనిలో కావాలంటే పాలు కలుపుకోవచ్చు.

      ఇది అన్ని అవయవాలకు శక్తి ని ఇస్తుంది.

                                 అందానికి ,  ఆరోగ్యానికి ఆయుర్వేద టీ                               20-6-11.

సుగంధపాల వేర్ల పొడి                            ---- 100 gr
పుదీనా ఆకుల పొడి                              ---- 100 gr
శొంటి పొడి                                          ----   10 gr
మిరియాల పొడి                                  ----    10 gr
దాల్చిన చెక్క పొడి                              ----    10 gr
యాలకుల పొడి                                 ----     10 gr
టీ పొడి                                             ----   100 gr

      అన్ని చూర్ణాలను  కలిపి సీసాలో నిల్వ చెసుకొవాలి.
      ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసి,  ఒక స్పూను పొడిని వేసి మరిగించి  అర గ్లాసుకు రానిచ్చి పాలు, చక్కెర  కలిపి  వడకట్టి తాగాలి .

      దీని వలన బాగా ఆకలి పెరుగుతుంది ఆహారం బాగా జీర్ణమై మలబద్ధకం నివారంపబడుతుంది .
      కాలేయం , ప్లీహం , మెదడు బాగా శక్తిని పోడుతాయి .

     

      



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి