సంతానం



                                              ఉత్తమ సంతానం కొరకు


      బహిష్టు ఆగిన 4 రోజు నుండి సరి రోజుల్లో కలిస్తే మగపిల్లలు,బేసి రోజుల్లో కలిస్తే ఆడ పిల్లలు పుడతారు.

     4 రోజు కంటే 14 రోజుకడుపున పడే బిడ్డలు, 5 రోజు కంటే 15 వరోజు బిడ్డలు గొప్ప వారవుతారు. ఇది   వాస్తవం.

    గర్భిణి స్త్రీ కి రక్తపోటు తగ్గాలంటే రోజుకు రెండు ,మూడు సార్లు పుదీనా ఆకును నలగగొట్టి వాసన చూపిస్తే  నియంత్రణ లో ఉంటుంది.ఆందోళన ,భయం,ఉండరాదు.ప్రశాంతంగా ఉండాలి.పుదీనా ఆకును నలగ గొట్టి ఇస్తే   గర్భ స్రావాన్ని కూడా ఆపుతుంది.

                                                 గర్భ ధారణ

    భార్యాభర్తలు అమావాస్య నాడు కలవడం వలన గర్భం ధరిస్తే శక్తి వంతమైన ఆడపిల్లలు, పౌర్ణమి
రోజున గర్భం ధరిస్తే తేజోవంతమైన మగపిల్లలు పుడతారు.

వీరభాద్రాసనం, వీరంజనేయాసనం వేయాలి.

సన్నగా, బలహీనంగా వుండి సంతాన హీనులైన స్త్రీ,పురుషులకు కానుక

నాటు ఆవు లేదా గేదె పాలు   ------ 20 gr
                              నెయ్యి ------ 10 gr
                                తేనె ------- 20 gr
                     పటిక బెల్లం  ------- 20 gr

 పాలు ముందుగా కాచి, చల్లార్చి,మిగిలిన పదార్ధాలు కలిపి తాగాలి. ప్రతి పదార్ధాన్ని గ్రాముల లెక్కన పెంచుకుంటూ వాడుకోవాలి. 7 గంటలకు భోజనము చేసి 10 గంటలకు నిద్రపోవాలి. పాలు రాత్రి నిద్రించే  ముందు తాగాలి.

                                         సంతానవతులగుటకు                                 22-2-09.

దోరగా వేయించిన శొంటి పొడి    ----- 100 gr
"              "      పిప్పళ్ళ పొడి ----- 100 gr
"               " మిరియాల పొడి  ----- 100 gr
                   నాగకేసరాల పొడి  -----100 gr

అన్ని పొడులను కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.

పల్లేరు కాయల పొడి ---100 gr

పల్లేరు కాయల పొడిని వేరే సీసాలో భద్రపరచుకోవాలి.

       బహిష్టు వచ్చిన రోజు నుండి నాలుగు రోజుల వరకు పరగడుపున నాలుగు పొడులు కలిసిన పొడిని వాడాలి నాలుగు రోజులు అన్నము, ఆవు పాలు, కలకండ కలుపుకొని మాత్రమే తినాలి.
నాల్గవ రోజు రాత్రి నుండి పల్లేరు కాయల పొడిని ఆహారానికి అర గంట ముందు గాని తరువాత గాని అర టీ  స్పూను పొడిని అర టీ స్పూను నెయ్యి కలిపి తినాలి. 4,5,6,7,8,9 రోజు వరకు వాడాలి.
10 రోజు నుండి 16 రోజు వరకు భర్త తో సంసారం చేయాలి. విధంగా చేస్తే 6 నెలలలోపు సంతానం   కలగడానికి అవకాశం కలదు.

                                 సంతానం కొరకు ఔషధం                                 15-3-09.

కారణాలు:-- రజస్వల నియమాలు పాటించక పోవడం, ఋతు క్రమం సరిగా లేక పోయినా పట్టించుకోక పోవడం.

స్త్రీలలో అండం సరిగా విడుదల కానపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:--

పెద్ద పల్లేరు కాయలను తెచ్చి ఎండబెట్టి దంచి వస్త్రగాయం పట్టి గాజు సీసాలో భద్రపరచాలి.
వావిలాకు కడిగి నీళ్ళు కలపకుండా దంచి రసం తీయాలి.

పల్లేరు కాయల పొడి ---5 gr
వావిలాకు రసం    --- 30 gr

పల్లేరు కాయల పొడిని తగినంత వావిలాకు రసం లో కలిపి కల్వంలో వేసి నూరి కుంకుడు గింజలంత మాత్రలను తయారు చేయాలి గాలిలో ఆరబెట్టాలి  ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు రెండేసి  మాత్రల ను సేవించాలి
  ముఖ్యంగా బహిష్టు కాలంలో తీసుకుంటే గర్భాశయం లోని లోపాలు తొలగి పోతాయి. నాల్గవ రోజు నుండి పదవరోజు వరకు సంసారం చెయ్యాలి.

బహిష్టు నాలుగు రోజులు తప్పకుండా ఉదయం, సాయంత్రం తప్పకుండా తాగాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- గుడ్డను గట్టిగా కట్టడం, త్వరగా నడవడం చెయ్యకూడదు వీటి వలన గర్భాశయంలో వాయువు చేరుతుంది. బహిష్టు రోజులలో అధికంగా రక్త స్రావం అయ్యే వాళ్ళు నాల్గవ రోజు నుండి పదవరోజు వరకు వాడి పదవ రోజు నుండి సంసారం లో పాల్గొనాలి.

            మేనరికాల వలన కలిగే సంతానలోపాలను పోగొట్టే వ్యాయామం                15-5-09.

హోమం చెయ్యడానికి తగిన మట్టి తొట్టి తెచ్చుకొని దానిలో ఆవు పిడకలను కర్పూరం వేసి వెలిగించి
దానిని కాల్చి దానిపై ఆవు నెయ్యి వేస్తూ హోమం చెయ్యాలి.

   మారేడు, నేరేడు, రావి, జువ్వి, మర్రి, మేడి, వేప,తులసి, గరిక మొదలైన ఎండు మొక్కల యొక్క ముక్కలను హోమం లో వెయ్యాలి. తలుపులను బంధించి దూపాన్ని బయటకు పోనివ్వకుండా చెయ్యాలి.

శారీరక, మానసిక లోపం కలిగిన పిల్లలను ఇంటిలో కూర్చోబెట్టి గాలిని పీల్చే విధంగా చెయ్యాలి. దీని వలన రక్త సరఫరాలోచాలా మంచి మార్పులు వస్తాయి. జన్యు లోపాలు సవరించ బడతాయి.

సిద్ధ నాగార్జున ఆయుర్వేద పీఠం వారు దీని పై ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.

మర్రి :-- మరణం లేని చెట్టు .

   మర్రి, రావి, జువ్వి, మేడి పండ్లను సమాన భాగాలుగా తెచ్చి ఎండబెట్టి విడివిడిగా దంచి పొడి చేసి కలిపి   నిల్వ చేసుకోవాలి.

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను పొడిని, ఒక్కొక్క టీ స్పూను కలకండ పొడిని కలిపి   తినిపించి ఆవు పాలు తాగించాలి. దీని వలన వికలాంగ మైన అవయవాలు పునరుజ్జీవిత మవుతాయి.

మేనరికాల వాళ్ళు గర్భం ధరించే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

   రావి చెట్టు యొక్క కాండము పై బెరడు తెచ్చి కడిగి చిన్న ముక్కలు చేసి ఎండబెట్టి దంచి జల్లించి అతి    మెత్తని చూర్ణం తయారు చెయ్యాలి. అంతే సమాన బరువుతో కలకండ పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి.

దంపతులిద్దరు ఉదయం, సాయంత్రం అర టీ స్పూను నుండి ఒక స్పూను వరకు ఆవు పాలలో కలుపుకొని   తాగాలి. దీనిని వాడేటపుడు 100 రోజులు బ్రహ్మచర్యం పాటించాలి. దీని వలన వీర్యము, ఆస్తావము శుభ్ర పరచబడి ఆరోగ్య వంతమైన పిల్లలు పుడతారు.

గర్భం ధరించిన తరువాత కూడా దీనిని వాడితే సంతానం ఎటువంటి అవయవ లోపాలు లేకుండా కలుగుతుంది

                                                 సంతానం కలగడానికి                               10-4-10.

కలబంద రసం
శంఖ పుష్పి
చందనం
తానికాయల పొడి

అన్నింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి.

   అన్నిపోడులను కలబంద గుజ్జులో వేసి బాగా కలపాలి. బహిష్టు అయిన నాలుగవ రోజు స్నానం చేసిన      వెంటనే దీనిని తాగాలి. ఆరోజు ఆవు పాలతో అన్నం తినాలి. రోజునుండి సంసారం చెయ్యాలి. విధంగా   చెయ్యడం వలన మంచి సంతానం కలుగుతుంది.


                                      సంతాన సాఫల్య చూర్ణము                                19-4-09.

శివలింగ గింజల పొడి ---50 gr (కడిగి ఆరబెట్టి దంచిన పొడి)
అశ్వగంధ దుంపల పొడి ---100 gr (ఆవు పాలతో శుద్ధి చేయాలి)
పటికబెల్లం ---150 gr ( జల్లించాలి )

అన్నింటిని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి/

        ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున ఆహారానికి గంట ముందు తీసుకోవాలి.

    బహిష్టు అయిన  రోజు నుండి వాడాలి. 10, 12, 14, 16, 18 రోజులలో సంసారం చేస్తే అబ్బాయి,
11, 13, 15, 17  రోజులలో సంసారం   చేస్తే అమ్మాయి పుడతారు.


                  అందమైన పిల్లలు పుట్టడానికి --- చ్యవన ప్రాశము                     22-9-10.

     ఎండిన మంచి ఉసిరి ముక్కలను మట్టి పాత్రలో గాని, గాజు పాత్రలో గాని, పింగాణి పాత్రలో గాని వేసి అవి    మునిగే వరకు తేనె పోసి 40 రోజులు కదిలించకుండా ఉంచాలి.

ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు కొద్దిగా తినాలి. దీనిని గర్భిణి స్త్రీ సేవించడం వలన ఆమె  యొక్క ఆరోగ్యం బాగుండడమే కాక తరువాత అందమైన బిడ్డ పుడుతుంది.


                                         స్త్రీలలో సంతానలేమి-- చికిత్స                            7-7-10.

                       ( కారణం తెలియకుండా గర్భం రాకుండా వుంటే )

ధాతకి పుష్పం ( ఆరె పువ్వు ) పొడి
నల్ల కలువ పూల పొడి

             రెండింటిని సమానంగా తీసుకుని కలిపి సీసాలో భద్ర పరచాలి.
బహిష్టు అయిన 5 రోజు నుండి ఉదయం, రాత్రి భోజనానికి ముందు అర కప్పు పాలలో 5 గ్రాముల పొడిని  5 రోజులు తీసుకోవాలి.

విధంగా 2 3 నెలలు చేస్తే కారణం తెలియక గర్భం రాని  స్త్రీలకు తప్పకుండా గర్భం వస్తుంది. ఇది
ఎంతోమంది ద్వారా ప్రయోగం చెయ్యబడినది.

ఆహార నియమాలు:--

కారం, ఘాటైన మసాలాలు, వేపుళ్ళు, నిలువ పచ్చళ్ళు పూర్తిగా మానెయ్యాలి. తేలికగా, సులభంగా
జీర్ణమయ్యే పదార్ధాలు వాడాలి.

                                 వంద్యత్వము ( Infertibility) -- చికిత్స                28-8-10.

గర్భ సంచికి రెండు వైపులా వున్న ఫెలోపియన్ ట్యూబ్స్ లో అవరోధాలు ఏర్పడడం వలన లేదా మూసుకు  పోవడం వలన సంతాన లేమి అనే సమస్య ఏర్పడుతుంది. రెండు వైపులా మూసుకపోతే అండము శుక్రకణము తో కలవ లేదు. అండము ఒక నెల ఒకవైపు ట్యూబ్ నుండి మరొక నెల ఇంకొక వైపు ట్యూబ్ నుండి గర్భాశయాన్ని చేరుతుంది. శుక్ర కణము గర్భాశయ ముఖ ద్వారమునుంది గార్భాశయములోనికి చేరుతుంది

కొన్ని వ్యాధుల వలన కూడా ట్యూబ్ లు మూసుకు పోవడం జరుగుతుంది. కొన్ని సార్లు అబార్షన్ జరగడం వలన, ఇన్ఫెక్షన్ చేరి వాచడం వలన కూడా మూసుకు పోవడం జరుగుతుంది.

పంచ కోలా ఘ్రుతము :---

పిప్పలి
పిప్పలి మూలము (మోడి )
చిత్ర మూలము
శొంటి
చవ్యము
యవాక్షారము

            ఈ ఐదింటిని పంచ కోలాలు అంటారు.

     వీటి యొక్క చూర్ణాలను ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి . అన్ని చూర్ణాలను కలపాలి.దీనిని ఒక పాత్రలో వేసి దానిలో 1200 గ్రాముల ఆవు నెయ్యి, 5 లీటర్ల ఆవు పాలు కలపాలి. అన్నింటిని బాగా  కలిపి స్టవ్ మీద పెట్టి నెయ్యి మాత్రమే మిగిలేట్లు కాచాలి. దీనినే పంచ కోలా ఘ్రుతము అంటారు.

5 నుండి 10 గ్రాముల ఘ్రుతాన్ని వేడి పాలల్లో కలిపి ఆహారానికి ముందు మూడు పూటలా తాగితే 2, 3నెలలలో గర్భం నిలిచే అవకాశం చాలా ఎక్కువ.

                               ఆరోగ్య వంతమైన పిల్లలు పుట్టడానికి                         7-12-10.

ఆరోగ్య వంతమైన పిల్లలు పుట్టక పోవడానికి ముఖ్యమైన కారణం తల్లి దండ్రులు ఆరోగ్యంగా లేక పోవడం.పూర్వం వివాహానికి మూడు నుండి ఆరు నెలల ముందే శరీరాన్ని శుద్ధి చేసే వాళ్ళు అనగా శరీరంలోని
మలినాలను  తొలగించడం . దీనిలో విరేచనం, వమనం లేదా వాంతి అతి ముఖ్యమైనవి.

సూచనలు :-- కేవలం ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలి. కారం, ఉప్పు, చేదు ఎక్కువగా ఉన్న పదార్ధాలు  తినకూడదు. తియ్యని, పుల్లని పదార్ధాలు వాడాలి. స్త్రీలు మినుములతో తయారైన పదార్ధాలు ఎక్కువగా  తీసుకోవాలి ( సున్నుండలు, ఇడ్లీలు )

మానసిక సమస్యలు వుండకూడదు. ఇంటిలో వేసే రంగుల వల కూడా మానసిక స్థితి సరిగా వుండదు. అందువలన ముఖ్యంగా ఇంటిలోపల తెల్ల సున్నాన్ని మాత్రమే వాడాలి.

అశ్వగంధ దుంపల చూర్ణం      --- 50 gr
శతావరి వేర్ల చూర్ణం              --- 50 gr
అతిమధురం చూర్ణం             --- 50 gr
శొంటి                                ---- 50 gr
ఉసిరిక చూర్ణం                    ---- 50 gr

         అన్నింటి చూర్నాలను కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

అర టీ స్పూను చూర్ణాన్ని ఒక టీ స్పూను తేనె, అర టీ స్పూను నెయ్యి కలిపి లేహ్యం లాగా కలుపుకొని  ఉదయం, సాయంత్రం తీసుకోవాలి ఎప్పటి కప్పుడు తయారు చేసుకొని వాడాలి. గర్భవతి గా వున్నపుడు  తీసుకోవడం అవసరం


                                  సంతాన లేమి-- పరిష్కారమార్గాలు                                 25-1-11.

సీతా అశోక బెరడు పొడి              --- 100 gr ( ఇది స్త్రీల పాలిటి కల్పతరువు)
శతావరి వేర్ల ( దుంపల) పొడి       --- 100 gr
తిప్ప తీగ పొడి                          --- 50 gr
బోడసరం పూల పొడి                   --- 50 gr
తామర గింజల పప్పు పొడి          --- 50 gr
నల్ల నువ్వుల పొడి                    ---- 50 gr
అతిమధురం పొడి                      --- 50 gr
పాతబెల్లం                                --- తగినంత

   అన్ని పొడులను బాగా కలిపి కల్వంలో వేసి తగినంత బెల్లం కలిపి బాగా మెత్తగా నూరి సీసాలో భద్రపరచుకోవాలి.

ప్రతి రోజు గోలి అంత సైజు ముద్దను ఆహారం తరువాత సేవిస్తూ వుంటే సంతానలేమికి
సంబంధించి ఎలాంటి సమస్యలున్నా నివారింపబడతాయి.

                                                          14-9-11

నాగకేసరాల చూర్ణము               --- అర టీ స్పూను
ఆవు నెయ్యి                            --- తగినంత

     రెండింటిని కలిపి ఉదయం పరగడుపున సేవించాలి .

     పిళ్ళేరు కాయ ల చూర్ణాన్ని ఒక సీసాలో భద్రపరచుకోవాలి . సాయంత్రం అర టీ స్పూను పొడిని తేనెతో సేవించాలి .

     ఈ విధానాన్ని బహిష్టు అయిన 3 వ  రోజు నుండి ప్రారంభించాలి .

      గర్భం దాల్చిన తరువాత  5 వ నెల నుండి నేల  ఉసిరిక పొడిని వాడితే అందమైన పిల్లలు పుడతారు












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి