ముఖ సౌందర్యము



                                             ముఖ సౌందర్యం                                      4-12-08.


         నిటారుగా కూర్చొని ధ్యానముద్ర వేసుకొని తన ముఖాన్ని గుర్తు తెచ్చు కోవాలి. ధ్యానంలో,
భావన ప్రపంచం లో తన ముఖం తెల్లగా ఉన్నట్లు ఉహించుకోవాలి. శ్వాస ద్వారా చల్లని  చంద్రుని కిరణాలను లోపలి తీసుకోవాలి. కాసేపు శ్వాసనుఆపి,ఆనందించి,శిరస్సులోని నల్లని పదార్ధాన్ని భయటకు వదులుతున్నట్లు భావించాలి


    మళ్ళి మళ్ళి అదే విధంగా చేయాలి. 10,15 నిమిషాలు చేయాలి. మానవుని శరీరంలో అంత శక్తీ
దాగి వున్నది నిద్రించే ముందు ఈవిధంగా చేయాలి. ఒక విధంగా ఇది హిప్నటిజం .


                                                    ముఖలేపనం                                     1-2-09

పచ్చి పసుపు                                            ---- 250 gr
మాని పసుపు                                           ---- 250 gr
మంజిష్ఠ                                                   ---- 250 gr
కావిరాయి                                                ---- 250 gr
దో. వే. దంచిన తెల్ల ఆవాల పొడి                    ---- 250 gr

    అన్నింటిని విడివిడిగా చూర్ణాలుచేసి వస్త్ర గాయం పట్టి భద్ర పరచుకోవాలి. అన్నింటి నుండి
ఒక్కొక్క స్పూను పొడి చొప్పున తీసుకొని కల్వంలో వేసి తగినంత నెయ్యి వేసినూరాలి.అద్భుతమైన లేపనం తయారవుతుంది.

   ఒక ప్లేటులో పెట్టుకోవాలి.ఉదయం, సాయంత్రం లేక అవకాశం వున్నపుడు ముఖానికి లేపనం చేసుకోవచ్చు.

ఒక అంగుళం మందంగా వేసుకోవాలి. బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

                                        ముఖ సౌందర్యానికి                                       5-2-09.

       ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ వుండే వాళ్ళు ఆరోగ్యంగా వుంటారు.

అతిమధురం పొడి       -----100 gr
బార్లీ గింజలపొడి        ----- 100 gr
తెల్ల ఆవాలపొడి        ----- 100 gr
లోద్దుగ చెక్క పొడి      ----- 100 gr

    బార్లీ గింజలను ఒక రాత్రి నానబెట్టి ఉదయం పిసికితే పొట్టు పోతుంది. తరువాత ఎండబెట్టి పొడి చెయ్యాలి.
తెల్ల ఆవాలను దోరగా వేయించి దంచి పొడి చెయ్యాలి.

 అన్ని పొడులను కలిపి వస్త్రగాయం పట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఉదయం గాని, సాయంత్రం గాని, ఒక టీ స్పూను పొడి తీసుకొని కొద్దిగా నీరు కలిపి పేస్టు లాగా చేసి ముఖానికి పట్టించాలి.ఒక గంట తరువాత  ముఖం కడుక్కోవాలి.

      నల్ల వలయాలు, ముఖం మీది మచ్చలు, మంగు వంటివి నివారింప బడ పొడిని పాలతో కూడ
 కలుపుకోవచ్చు.

దీనివలన ముఖం మీది మచ్చలు, మంగు మాయమవుతాయి. ముఖం లో మంచి నిగారింపు వస్తుంది.

                   ముఖం మీద నల్లగా అట్టకట్టినట్లు వుంటే -- నివారణకు               11-2-09.

ఎర్ర చందనం చెక్క గాని, పొడి గాని
పచ్చి పసుపు
గేదె పాలు

   ఒక సాన రాయి మీద కొద్దిగా పాలు పోసి గంధపు చెక్కతో చాది గంధం తియ్యాలి, అలాగే పసుపు కొమ్మును కూడా చాది గంధం తియ్యాలి. రెండింటిని కలిపి ముఖం మీద నల్లగా వున్నా చోట బాగా మందంగా, దట్టంగా పట్టు వెయ్యాలి. ఒక గంట తరువాత కడిగెయ్యాలి.

                        ముఖం మీద ముడతలు --నివారణ                                         12-2-09.

మదం పెరిగితే ముఖం మీద ముడతలు వస్తాయి.

నేలతాడి దుంపలు ---- పావు కిలో

  ఈ దుంపలను ముక్కలు చేసి దంచి, జల్లించి, వస్త్రగాయం పాట్టి నిల్వ చేసుకోవాలి. సగం పొడిని ముఖానికి ఉపయోగించడానికి, సగం పొడి కడుపులోకి వాడడానికి పెట్టుకోవాలి. సగం పొడిలో దానికి సమానంగా కలకండ  కలిపి పెట్టుకోవాలి.ఉదయం, సాయంత్రం అర టీ స్పూను పొడి చొప్పున నాలుక తో అద్దుకొని తిని పాలు తాగాలి.

  మిగిలిన పొడిలో ఒక టీ స్పూను పొడి తీసుకొని దానికి తగినన్ని పాలు కలిపి పేస్టూ లాగా చేసి కళ్ళకింద ముఖం మీద వున్నముడతల మీద పూయాలి.

  నేలతాడిని సంస్కృతం లో ముసలి అంటారు.

                                         ముఖ సౌందర్యానికి                                            12-2-09.


మేలు రకమైన నువ్వుల నూనెను చెవుల్లో, ముక్కుల్లో రెండేసి చుక్కల చొప్పున వేసుకోవాలి,
నోటిలో  పోసుకొని పుక్కిలించాలి. ముఖానికి, జుట్టుకు బాగా పట్టించాలి. 20 రోజులలోనే ముఖ సౌందర్యం పెరుగుతుంది.

         క్రమం తప్పకుండా విధంగా చేస్తే శిరో సౌందర్యం కూడా పెరుగుతుంది.

                                       ముఖ సౌందర్య లేపనం                                           1-3-09.

మంజిష్ఠ పొడి                          ----- 10 gr
మాను పసుపు పొడి                ------ 10 gr
ఎర్ర చందనం పొడి                  ------ 10 gr
కొమ్ము పసుపు                      ------ 10 gr

          అన్నింటిని బాగా కలపాలి. పొడిని కల్వంలో వేసి కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలు
కొద్ది కొద్దిగా పోస్తూ నూరాలి. లేపనం తయారవుతుంది. జిడ్డుగా వున్న శరీరం వాళ్ళు నీళ్ళు పోసి నూరాలి. తీసి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.

                 ఈ లేపనాన్ని ముఖానికి మందంగా పట్టించాలి. ఎండి పోయేంత వరకు వుంచి గోరు
వెచ్చని నీటితో కడగాలి.

                                         కలబంద ముఖ లేపనం                              2-3-09.

కలబంద గుజ్జు            ----- ఒక స్పూను
పసుపు                    -----  పావు స్పూను
ఉసిరిక పొడి              -----       "
మెంతి పొడి               -----       "
జాపత్రి పొడి             ------       "

   అన్నింటిని కలిపి కల్వం లో వేసి తగినన్ని నీళ్ళు కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఉదయం పూట ముఖానికి కొద్దిగా మందంగా పూయాలి. ఒక గంట తరువాత కడగాలి. విధంగా ప్రతి రోజు చేస్తూ వుంటే ముఖం ఎంతో తేజో వంతంగా తయారవుతుంది.

                                       ముఖ సౌందర్యానికి                           6-3-09.

  నల్ల నువ్వులను కొద్దిగా నెయ్యి వేసి వేయించాలి. దంచి, ఎండబెట్టి మళ్లీ దంచి మళ్లీ ఎండ బెట్టాలి. దీనిని జల్లించి నిల్వ చేసుకోవాలి. పచ్చి పసుపు ముద్దగా నూరి దానిలో తగినంత నువ్వుల పొడిని కలిపి ముఖానికి పట్టించాలి.

    ఈ విధంగా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే ముఖం ఎంతో తేజోవంతంగా తయారవుతుంది.

                           ముఖ సౌందర్యానికి ఆపిల్ పండు లేపనం          12-3-09.

     మంచి మేలు రకపు గట్టి గా వుండే ఆపిల్ పండును (పిండి గా వున్నది కాదు) మిక్సి లో వేసి
 గుజ్జుతయారు చెయ్యాలి. దానికి కొద్దిగా కస్తూరి పసుపు కలపాలి. జిడ్డు శరీరమైతే నీరు కలిపి, కాకపోతే పాలు కలిపి నూరాలి.

       ఈ పేస్ట్ ను ముఖానికి ఒక అంగుళం మందంగా లేపనం చెయ్యాలి. పూర్తిగా ఆరిపోనివ్వాలి.
కనీసం  అరగంట వుంచి తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.

                                        ముఖ సౌందర్యానికి                                               1-4-09.

కస్తూరి పసుపు                       ----- ఒక స్పూను
తేనె                                     ----- ఒక స్పూను
పాలు                                   ----- ఒక స్పూను.
నిమ్మ రసం                           ----- కొద్దిగా

              అన్నింటిని పేస్ట్ లాగా కలపాలి. దీనిని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించాలి. ఎంతో
సౌందర్య వంతం గా   తయారవుతుంది.

                                       ముఖ సౌందర్యానికి లేపనం                                    29-4-09.

        పావు కిలో చిరి శనగలను తీసుకొని నాలుగైదు చుక్కల నెయ్యి వేసి దోరగా వేయించాలి.
చల్లారినతరువాత విసిరి జల్లించాలి.

     అవసరమైనంత పిండిని తీసుకొని దానిలో నాటు ఆవు లేదా గేదె నెయ్యి కలిపి అర టీ స్పూను పసుపుకలిపి ముఖానికి పూసుకోవాలి. గంట తరువాత కడగాలి. విధంగా క్రమం తప్పకుండా చేయడం వలన  మచ్చలు, కళ్ళచుట్టూ వుండే నల్లని వలయాలు కూడా మాయమవుతాయి.

                            ముఖం మీది నల్ల మచ్చలు తొలగించడానికి                          16-7-09.

                చిరి శనగలను చిన్న మంట మీద వేయించి మెత్తని పిండి తయారు చేసుకోవాలి.
తగినంత పిండి తీసుకొని మంచి పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దానిలో నాటు ఆవు నెయ్యి గాని, నాటు గేదె నెయ్యి గానికలిపి నూరి ముఖానికి రాసుకోవాలి.

      దీని వలన ముఖం మీది మచ్చలు నివారింపబడతాయి. శరీరం మొత్తం కూడా పూసుకోవచ్చు. తరువాతగోరువెచ్చని నీటితో స్నానం చెయ్యాలి.

                             ముఖ సౌందర్యానికి కానుక -- చంద్రముఖి                           3-7-10.

పచ్చి పసుపు ఎండబెట్టి దంచిన పొడి   ---- 50 gr
                                నువ్వుల పొడి ---- 50 gr

          ఈ రెండు కలిపి మెత్తగా నీటితో నూరితే మంచి లేపనం తయారవుతుంది. దీనిని ప్లేటులో
పెట్టుకొని యాప్రాన్ కట్టుకొని ముఖానికి దట్టంగా, మందంగా లేపనం చెయ్యాలి. వారం రోజుల్లో ఎంతో మార్పు కనిపిస్తుంది

పసుపు గిట్టని వాళ్ళు టెస్ట్ డోస్ వాడాలి

                     ముఖ సౌందర్యానికి ఏక మూలికా ప్రయోగము                4-7-10.

జటామాంసి వేర్లను దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.
అవసరమైనంత పొడిని తీసుకొని నీటితో మెత్తగా నూరి ముఖానికి లేపనం చెయ్యాలి. ఒక గంట తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి.

ఒక్క చిటికెడు పొడితో ప్రారంభం చేసి రెండు, మూడు చిటికెల పొడిని నీటితో కడుపులోకి సేవించాలి.
ఒక గంట వరకు ఏమి తినకూడదు.

                                   ముఖ వర్చస్సుకు -- తేజస్విని తైలం                  24-11-10

శనగ పిండి               ---- 50 gr
కస్తూరి పసుపు          ---- అర టీ  స్పూను మాత్రమే లేదా పచ్చి పసుపు
ఎర్ర చందనం            ---- అర టీ స్పూను మాత్రమే
పాలు ---- తగినన్ని

అన్నింటిని కలిపి లేపనం లాగా తయారు చేసుకొని ముఖానికి పూసుకుంటే ముఖం మీది మచ్చలు తొలగింప  బడి కాంతి పెరుగుతుంది. 40 రోజులు వాడాలి.
 
                                       ముఖ వర్చస్సు పెరగడానికి                              6-7-10.

వేపాకుల రసం
దోసకాయ రసం
చందనం పొడి
పసుపు పొడి
పాలు

    అన్ని పొడులను సమాన భాగాలు గా తీసుకుని దానికి పాలు కలిపి ముఖానికి పూసుకోవాలి.
ఒక గంటతరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడగాలి.

దీనితో ముఖ సౌందర్యం పెరగడమే కాక ముడుతలు కూడా నివారింప బడతాయి.

కలువపూల రేకులు
గరిక రసం
చందనం
చంగల్వ కోష్టు

  అన్నింటిని సమానంగా తీసుకుని పేస్ట్ లాగా కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని  నీటితో కడగాలి.

దీని వలన చర్మం పై ముడతలు, మచ్చలు, మొటిమలు నివారింప బడతాయి.

      వేపాకు వేసి కాచిన నీళ్ళతో గాని, లేదా నారింజ తొక్కలను వేసి కాచిన నీటితో గాని ముఖం కడుగుతూ వుంటే  ముఖం ఎంతో కాంతి వంతంగా అవుతుంది.

                                                            30-10-10

   మొక్క జొన్న పిండి లో కమలా పండు రసం కలిపి లేపనాన్ని ముఖానికి పూసుకుంటే ముఖం మృదువుగా  తయారవుతుంది.

                                  ముఖం మీది జిడ్డును తొలగించడానికి                        2-11-10.

       స్ట్రాబెర్రి పండ్లను బాగా పిసికి దానికి తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత కడిగితే
జిడ్డుతొలగించబడుతుంది.

                                    ముఖ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్                         2-12-10.

మసూరి పప్పు                        --- పావు కప్పు
మంచి గంధం                           --- ఒక స్పూను
మామిడి టెంకలోని పప్పు పొడి    --- ఒక స్పూను
పసుపు                                  --- పావు స్పూను
మంజిష్ఠ వేరు చూర్ణం                 --- అర స్పూను
జింక్ పౌడర్                             --- పావు స్పూను
అతి మధురం                         --- అర స్పోను
లేత మర్రి వూడల పాలు            --- ఒక స్పూను

     అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా పేస్ట్ లాగా కలిపి ముఖానికి పట్టించి పావు గంట తరువాత
తడిచేతులతో ఫేస్ ప్యాక్ ను తొలగించి, ఐస్ క్యుబ్స్ తో ముఖమంతా తుడవాలి.

2. వేప బెరడు చూర్ణం                        --- అర స్పూను
అతి మధురం చూర్ణం                        --- అర స్పూను
చందనం                                         --- అర స్పూను
త్రిఫల చూర్ణం                                  --- అర స్పూను
మజిష్ట వేరు చూర్ణం                         --- పావు స్పూను

           అన్నింటిని కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టిస్తే జిడ్డు తొలగించ బడుతుంది, మంచి
ఫేస్ ప్యాక్ లాగా  ఉపయోగపడుతుంది.

                        ముఖం మీద ముడతలు పోవడానికి చిట్కా                 13-12-10.

బాదం పప్పుల పేస్ట్ --- రెండు టీ స్పూన్లు
గులాబి రేకుల పేస్ట్ ---- రెండు టీ స్పూన్లు

    రెండింటిని కలిపి ముఖానికి పట్టించి ఒక గంట తరువాత కడగాలి. విధంగా నెలరోజులు చేస్తే ముఖం మీది  ముడుతలు నివారింప బడతాయి.

                                  ముఖం ఎర్రగా మారే సమస్య -- నివారణ                       16-12-10.

       చిన్న వయసులో అతిగా సిగుపడడం వలన ఎర్రబడుతుంది. మెనోపాజ్ దశలో హార్మోన్ల
కారణంగాజరుగుతుంది. రోజేషియా అను వ్యాధిలో మొటిమల చుట్టూ ఎర్రబారడం వలన వస్తుంది. వేడి పానీయాలను   చాలా వేడిగా తాగడం వలన కూడా వస్తుంది.

ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ ముఖ్య కారణం.

సోయా చిక్కుళ్ళు ఎక్కువగా వాడాలి. ఇది ఈస్త్రోజన్ తగ్గితే పెంచుతుంది, పెరిగితే తగ్గిస్తుంది.

శరీరాన్ని చల్లబరచడానికి సుగంధ పాల వేర్లను దంచి పాలల్లో వేసి కాచి తాగాలి.

                                  ముఖం మీద ముడుతలు -- నివారణ                       20-10-12.

        కొంత వయసు తరువాత కాకి కాళ్ళ గుర్తులు ఏర్పడతాయి. దీని వలన ఎక్కువ వయసు
ఉన్నట్లుగా కనిపిస్తారు.

కారణాలు :-- ఒత్తిడి, రక్త సరఫరా తగ్గడం, అతినీలలోహిత కిరణాల ప్రభావం ( అలవాటు లేకుండా ఎండలో తిరగడంవలన) మద్యపానం, ధూమపానం వంశ పారంపర్యం మొదలైనవి.

సౌందర్య లేపనం

తేనె మైనం                              ---100 gr
సిల్క్ దారపు గూళ్ళు              ---100 gr
వేలిగారం లేక టంకణం            ---ఒక గ్రాము లేదా చిటికెడు ( బోరాక్స్ )
బాదం నూనె                         ---తగినంత

     పట్టు కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి రేకుపై వేసి మందిస్తే బూడిద అవుతుంది.
తేనె మైనాన్ని పరోక్షంగా వేడి చేయాలి. కరిగిన తరువాత వడకట్టి దానిలో బూడిదను, బాదం నూనెను  కలపాలి. తరువాత వేలిగారాన్ని చిలకరించాలి. గట్టి పడిన తరువాత సీసాలో భద్ర పరచుకోవాలి.

రాత్రి పూట ముఖానికి లేపనాన్ని పూసి ఉదయం బట్టతో తుడిచి తరువాత కడగాలి.

                             ముఖం మీద జిడ్డును తొలగించడానికి              23-12-10.

కారణాలు :-- మానసిక ఒత్తిడి వలన, హార్మోన్లలో తేడాల వలన, ఎక్కువ చెమట పట్టడం వలన, వాతావరణకారణాల వలన, తైల సంబంధ పదార్ధాలను ఎక్కువగా తినడం వలన, నీళ్ళు సరిపడినంతగా తాగక పోవడం వలన మలబద్ధకం వలన, కాలేయం మందకొడిగా పని చేయడం వలన ముఖం జిడ్డుగా తయారవుతుంది.

గోధుమలు                          ----ఒక కప్పు
పత్తి గింజలు                      ---- 100 gr
జిలకర                              ---- ఒక టేబుల్ స్పూన్
మెంతులు                          ---- ఒక పెద్ద స్పూన్
ఎండిన రోజా పూలు             ---- 25 gr

పదార్దాలన్నింటిని విడివిడిగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించి దంచి చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. సాధారణమైన నీటితో గాని లేదా రోజ్ వాటర్ తో గాని కలిపి పూసి ఉదయం గోరు వెచ్చని నీటితో కడగాలి.

                        ముఖం మీద మచ్చలు, గాట్లు --నివారణ            27-12-10.


     లివరు సంబంధ సమస్యల వలన ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి. హార్మోన్లలో తేడాల
వలన ముఖం   మీద సీతాకోక చిలుక ఆకారం ( మంగు) లో మచ్చలు ఏర్పడతాయి.

గాట్లు :-- మొటిమలను గిల్లడం వలన కొంత పదార్ధం దానిలోనే మిగిలి వుంటుంది దాని వలన మచ్చలు, గాట్లు  ఏర్పడతాయి.

పై పొరను శుభ్ర పరచడం వలన మృత కణాలు తొలగించ బడతాయి.

బొప్పాయి ఆకుల చూర్ణం                ---- 50 gr
గుజ్జు తీసిన కలబంద ఆకుల చూర్ణం  ---- 50 gr
గంధ కచ్చూరాల చూర్ణం                 ---- 50 gr
ముల్తాని మట్టి                              ---- 50 gr
కస్తూరి పసుపు                             ---- 50 gr
గులాబి పూల రేకుల పొడి              ---- 50 gr

       అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.


                                       ముఖం మీద ముడుతలు                                       15-2-11.

       ఉల్లి గడ్డ రసాన్ని ముఖం మీద పూసి ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. మంట వలన
ఎలాంటి ఇబ్బంది లేదు.


                                   ముఖ సౌందర్యం                                      18-4-11
         ఇది అన్ని రకాల శరీర తత్వము కలిగిన వాళ్లకు  ( వాత,  పిత్త,  కఫ శరీరము కలిగిన వాళ్లకు ఉపయోగపడుతుంది.

 చిన్న యాపిల్        ----  ఒకటి. 
        తేనె                ---  ఒక టేబుల్ స్పూను
కోడి గుడ్డు                ---  ఒకటి 
సిడర్  వెనిగర్          ----- 15  ml
బాదం నూనె             ----- 3 టీ స్పూన్లు

   యాపిల్ యొక్క తొక్కను, గింజలను తొలగించి ముక్కలు చేసి,  మిక్సి లో వేసి పేస్ట్ లాగా చేయాలి. దానిలో కోడిగుడ్డు యొక్క మొత్తాన్ని,  వెనిగర్ ను, బాదం నూనెను కలిపి బాగా మిక్స్ చేయాలి.
      దీనిని ముఖమంతా ( కళ్ళకు తప్ప )  మందంగా పట్టించాలి.  కళ్ళ మీద కీర దోస ముక్కలను ఉంచాలి.

సూచనలు :--    చర్మాన్ని వీలైనంత వరకు శుభ్రంగా వుంచుకోవాలి.  నీళ్ళు ఎక్కువగా తాగాలి. ఎండలో తిరగ కూడదు 
 
                               ముఖ సౌందర్యానికి                                        19-4-11.
  నిమ్మ కాయ                    --సగం        
 కమలాపండు తొక్కలు        -- ఒకటి,  రెండు 
   చందనం చెక్క పొడి         -- చిటికెడు
 గులాబి పూరేకులు          --  గుప్పెడు 
 అతిమధురం పొడి            --- 5 gr 
 లవంగాల పొడి                --- 3 gr 
  అల్లం తురుము                       --- 3 gr

 పుదీనా ఆకులు                       --- గుప్పెడు

సోంపు గింజల పొడి                     --- 3 gr 

     నీళ్ళు                    --- రెండు లీటర్లు

   ఒక పెద్ద పాత్రను తీసుకొని దానిలో నీళ్ళు పోసి నిమ్మరసం పిండాలి.  దీనిని స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగేటపుడు  మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా కలిపి మూత పెట్టాలి.  నీళ్ళు ఆవిరి కావడం ప్రారంభమైన వెంటనే స్టవ్ ఆపెయ్యాలి.

      ఒక నిమిషం అలాగే ఉంచాలి. లేకపోతే అంత వేడి కళ్ళ మీద పడితే కళ్ళు దెబ్బ తింటాయి.

    తరువాత కింద కూర్చొని ఈ గిన్నెను ముందు పెట్టుకొని మందంగా వున్న బెడ్ షీట్ ను తల మీద నుండి శరీరాన్నంత కప్పుతూ కిందికి వేయాలి.  బయటి గాలి లోపలి వెళ్ళకుండా చూసుకోవాలి. తరువాత  గిన్నెలో నీళ్ళ నుండి వచ్చే ఆవిరిని కళ్ళు మూసుకొని ముఖానికి పట్టించాలి.  ముఖం నుండి చెమట బయటకు వచ్చేంత వరకు మాత్రమే పట్టాలి.

      దీని వలన ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది,  ముఖం ఎంతో కాంతి వంతమవుతుంది.
 
               ముఖము యొక్క ముదురు చర్మాన్ని కోమలంగా మార్చే ముఖ సౌందర్య చూర్ణం  
                                                                    20-4-11.
                   కారణాలు,  లక్షణాలు :--  ప్రధాన కారణం ఆందోళన,  దీని వలన రక్త సరఫరా తగ్గుతుంది  .  కాకి కాళ్ళ మచ్చలు    ఏర్పడతాయి.  మలబద్ధకం వలన కూడా ఏర్పడతాయి . 

సూచనలు :--   నీళ్ళు బాగా తాగాలి,  వాకింగ్ చేయాలి. పీచు పదార్ధాలున్న ఆహార పదార్ధాలను తీసుకోవాలి.
    ఆందోళన తగ్గించుకోవాలి. కాలుష్యంలో జాగ్రత్తగా వుండాలి. కళారాధన పెంచుకోవాలి.
పెసర పప్పు  పిండి                               ---10 gr 
 గోధుమ పిండి                                     ---10 gr
 ఎండిన కమలా పండ్ల తొక్కల పొడి      --- 10 gr
   ఓట్స్ పిండి                                    --- 10 gr
         శనగ పిండి                                 --- 10 gr
   నీళ్ళు                                              ---తగినన్ని
         నిమ్మ రసం                              ---తగినంత
                 ఒక గిన్నెలో అన్ని పొడులను వేసి బాగా కలిపి గాలి చొరబడని  సీసాలో భద్రపరచుకోవాలి.
      ఎప్పటికప్పుడు ఒక టేబుల్ స్పూన్ పొడిని తీసుకొని దానిలో కొద్దిగా నీళ్ళు,  కొంచం నిమ్మరసం కలిపి జారుడుగా చేయాలి. దానితో ముఖాన్ని బాగా రుద్దుకోవాలి.  కొంత సేపు అలాగే వుంచి వేడి నీటితో కడిగి  వెంటనే చన్నీటితో కడగాలి.

                               పొడిగా వున్న ముఖానికి  తేనె , పచ్చసొన  ఫేస్ ప్యాక్                 28-5-11.

       ముఖము పైన వున్న పైపొర దెబ్బ తిన్నపుడు పొడిగా తయారవుతుంది . 

 తేనె                         --- అర టీ స్పూను
 గుడ్డు పచ్చసొన        --- ఒకటి
పాల పొడి                   --- ఒక టీ స్పూను
        
      ఒక చిన్న గిన్నెలో గుడ్డు సొనను తీసుకొని బాగా గిలక్కొట్టాలి .   దానికి తేనె కలపాలి . బాగా
కలిసిన తరువాత పాల పొడి కలిపి పేస్ట్ లాగా చేయాలి .

   దీనిని ముఖం మీద పల్చగా పూయాలి .  20 నిమిషాల తరువాత గట్టిపడడం  ప్రారంభమవుతుంది
అప్పుడు ముఖాన్ని బాగా మసాజ్ చేయాలి.  తరువాత చన్నీటితో గాని లేదా గోరువెచ్చని నీటితో
గాని కడగాలి.   స్నానానికి వేడి నీరు వాడకూడదు .

                                                        శనగ పిండితో ఫేస్ ప్యాక్                                       3-6-11.

శనగ పిండి               --- ఒక టేబుల్ స్పూను
ఆలివ్ ఆయిల్         --- ఒక  టీ  స్పూను
నిమ్మ రసం             --- ఒక టీ స్పూను

        జిడ్డు చర్మం అయితే నిమ్మ రసంతో కలపాలి .  పొడి చర్మం అయితే పెరుగుతో కలపాలి .
        అన్నింటిని కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.

        కళ్ళ  మీద , పెదవుల మీద తప్ప ముఖం మీద ఈ పేస్ట్ ను ప్యాక్ లాగా పరచాలి . 20 నిమిషాల
తరువాత బాగా మసాజ్ చేయాలి . తరువాత తడి గుడ్డతో తుడవాలి . తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి . 
                                        ముఖ  సౌందర్యానికి  ఫేస్ ప్యాక్                               9-6-11.

కలబంద గుజ్జు          --- 30 gr
ఉసిరిక పొడి             --- పావు టీ స్పూను 
కస్తూరి పసుపు         --- పావు టీ స్పూను 
మెంతి పొడి              --- పావు టీ స్పూను 
జాపత్రి పొడి               --- పావు టీ స్పూను

      కలబంద యొక్క పై మట్టను తొలగించి లోపలి గుజ్జును తగినంత తీసుకొని దానిని నీటిలో ఏడు
సార్లు జాడించి కడగాలి .  దానిలోచూర్ణాలన్నింటిని కలపాలి . దీనిని గుజ్జు గా కలిపి ముఖం
మీద లేపనం చేయాలి .   ఆరడం ప్రారంభమైన తరువాత  నీటిలో ముంచిన దూది వుండ  తో తడపాలి .  తరువాత కడగాలి .

నల్ల నేలతాడి దుంపలు
సుగంధ పాల వేర్లు
అతిమధురం

   అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని వాటిలో తగినన్ని ఆవుపాలు పోసి ఉడికించి ఎండబెట్టాలి 
తరువాత చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి .
    దీనిని అర టీ స్పూను పొడి చొప్పున కడుపులోకి తీసుకోవాలి .
 
ఈ విధంగా పై రెండు విధానాలను ఆచరిస్తూ వుంటే  ముఖం ఎంతో తేజోవంతంగా తయారవుతుంది .

                                                మంగు మచ్చలు -- నివారణ                           3-7-11.

ముఖ్యమైన కారణాలు :---  సూర్య కిరణాల వలన , మెలనిన్ వలన  మచ్చలు తయారవుతాయి . గర్భధారణ
సమయం లోను మరియు వర్షాకాలం లో తేమ ఎక్కువగా ఉండడం వలన కూడా  మచ్చలు ఏర్పడే అవకాశం వున్నది .

1.పచ్చి పసుపు                    ---- 5 gr
        నువ్వులు                    ---- 5 gr

        రెండింటిని మెత్తగా దంచి  నీటిని కలిపి పేస్ట్ లాగా రాత్రి పూట ప్రతి రోజు ముఖం మీద పూస్తూ వుంటే త్వరగా
తగ్గి పోతాయి .

2. తులసి ఆకులు                ---- గుప్పెడు
    హారతి కర్పూరం               --- ఒక టీ స్పూను

            తులసి ఆకును మెత్తగా నూరి కర్పూరం కలిపి ముఖానికి పోయాలి .

3. ఎందు బటాణీ  ల పొడి
                నీళ్ళు

     రెండింటిని మెత్తగా కలిపి ముఖానికి పోసి ఆరగంట తరువాత కడగాలి .

     వీటితోపాటు  సన్ స్క్రీన్ లోషన్ కూడా పూస్తూ వుండాలి . కాని దీనిని రెండు గంటల కొకసారి కడుగుతూ వుండాలి .

 4. స్నానానికి ముందు ముఖాన్ని మజ్జిగతో కడగాలి

           ఈ విధంగా ప్రతి రోజు  ఏదో విధానాన్ని అమలు చేస్తూ వుంటే  మంగు మచ్చలు , శోభి మచ్చలు నివారింప
బడతాయి .

                                            వర్షాకాలం లో ముఖం మీద ఏర్పడే జీడ్డు  ---- నివారణ                     14-7-11.

ఎర్ర గులాబీ రేకుల చూర్ణం                ---- 10 gr
సిట్రిక్ యాసిడ్ పొడి                           ---     1 gr
ఎందు ఖర్జూరం  పొడి                        ---     1 gr
కుంకుళ్ళ  పొడి                                 ---     2 gr
పటిక  పొడి                                        ---    1 gr
గులాబి జాలం                                ---  100 ml

      ఒక శుభ్రమైన గిన్నెను తీసుకొని దానిలో మొదట గులాబి జాలాన్ని పోయాలి . తరువాత మిగిలిన పదార్ధాలను
ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలపాలి .థరువాథ వదపోసుకోవాలి . దీనిని ఏ రోజుకారోజు తయారు చేసుకోవాలి .
శుభ్రమైన దూది ని తీసుకొని  తయారు చేసుకొన్న పదార్ధం లో ముంచి దానితో ముఖాన్ని తుడాలి .
     దీనివలన ముఖానికి ఆహ్లాదం కలుగుతుంది .
జాగ్రత్తలు :-- మంచి సమతులాహారం తీసుకోవాలి . స్నానానికి ముందు ముఖాన్ని సున్ని పిండి తో మర్దన చేసుకోవాలి

                                     వర్షాకాలం లో ముఖం జిద్దుబారడం --- నివారణ                            6-7-11.
                                                              చందన లేపనం

ముల్తాని మట్టి                         ---- 50 gr
కమలా పండ్ల తొక్కల చూర్ణం    ---- 50 gr
తెల్ల చందనం  చూర్ణం               ---- 50 gr
టమాటా గుజ్జు                         ---- తగినంత

         ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను  వేసి బాగా కలిపి సీసాలో నిల్వ చ్చేసుకోవాలి .
         అవసరమైనపుడు  ఒక టీ స్పూను చూర్ణాన్ని తీసుకొని దానికి  తగినంత టమాటా గుజ్జును కలిపి ముద్దగా చేసి
ముఖానికి పట్టించాలి .  ముఖం మీద నుండి కారకుండా  గట్టిగా కలుపుకోవాలి .               

                                                    ముఖ సౌందర్య చూర్ణము                                   9-8-11.

        రక్తంలో మలినాలు  చేరడం , మలబద్ధకం మొదలైన కారణాల వలన ముఖ సౌందర్యము లోపిస్తుంది .
        మనసులో అసూయ ,  ద్వేషం , బహిష్టు సక్రమం గా లేకపోవడం  మొదలైనవి కూడా కారణాలు .

వసకోమ్ముల పొడి                       ---- 50 gr
లొద్దుగ  చెక్క పొడి                      ---- 50 gr
          శొంటి                               ---- 50 gr
మిరియాల పొడి                          ---- 50 gr
పిప్పళ్ళ  పొడి                             ---- 50 gr

       అన్నింటిని బాగా కలిపి వస్త్రఘాలితం చేసి నిల్వ చేసుకోవాలి .
       స్నానానికి గంట ముందు  అవసరమైనంత పొడిని పాలల్లో గాని ,  నీటిలో గాని కలిపి ముఖానికి పట్టించాలి .  దీనిని
ముఖం మీది గడ్డల మీద , మొటిమల మీద పెడితే అవి క్రమేపి  కరిగిపోతాయి .

                                                        ముఖ సౌందర్యాన్ని పెంచే ఔషధాలు                             29-8-11.

ముఖ సౌందర్యం దెబ్బ తినడానికి గల కారణాలు :--- ఎండలో తిరగడం , సరైన స్థాయిలో ఆక్సిజన్ అందకపోవడం , ముఖం
ఉబ్బరించడం , నిద్ర లేకపోవడం ఒత్తిడి , గర్భధారణ , అకాల వార్ధక్యం  మొదలైనవి .

1. లోద్దుగ చెక్క చూర్ణం              ---- ఒక టీ స్పూను
     చందనం చెక్క    "                 ----   "       "
     మంజిష్ఠ వేర్ల       "                 ----   "       "
     కస్తూరి పసుపు   "                 ----    "      "
     గంధ కచ్చూరాల  "               ----    "      "
     రోజ్ వాటర్                           ---- తగినంత

          ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దానిలో అన్ని చూర్నాలను వేసి బాగా కలపాలి .  తరువాత దానికి కొద్ది కొద్దిగా
రోజ్ వాటర్ కలుపుతూ పేస్ట్ లాగా చేయాలి .  దీనిని ముఖానికి పట్టించి అరగంట తరువాత నీటితో కడగాలి .

2. చందనం చెక్క చూర్ణం           ---- ఒక టీ స్పూను  
     అగరు కట్టే కాండ సారం         ----   "       "
     వట్టివేర్ల  చూర్ణం                   ----   "       "
              పాలు                         ---- తగినన్ని
  
     పై మూడింటిలో ఏదైనా ఒకటి దొరకక పోయినా పరవాలేదు . మిగిలిన రెండింటిని మాత్రమె కూడా ఉపయోగించవచ్చును .
   
     అన్ని చూర్ణాలను  ఒక చిన్న గిన్నెలో వేసి తగినన్ని పాలు కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టించాలి .

సూచనలు :--- నీళ్ళు బాగా తాగాలి . మంచి సాత్వికాహారాన్ని తీసుకోవాలి .  కోపాన్ని తగ్గించుకోవాలి .

                                                           ముఖ సౌందర్యానికి
                                              చలి నుండి కాపాడుకోవడానికి  నైట్ క్రీమ్                                   6-9-11.

           చర్మం మీద సహజంగానే  తైల సంబంధమైన ఒక పలుచని పోరా వుంటుంది

బాదం నూనె                   ---- 2 టేబుల్ స్పూన్లు
లానోలిన్                       ---- 1 టేబుల్ స్పూను
కోకో పౌడర్                     ---- 1 టీ స్పూను
రోజ్ వాటర్                    ---- 2 టీ స్పూన్లు

          ఈ పదార్దాలన్నింటిని ఒక గాజు విన్నేలో వేయాలి . దానికంటే పెద్ద గిన్నెను తీసుకొని దానిలో నీళ్ళు పోసి స్టవ్ మీద
పెట్టి  ఆ నీటిలో గాజు గిన్నెను పెట్టాలి ( పరోక్ష పద్ధతిలో వేడి చేయడం ) . దీనిని కలియబెడుతూ వుంటే కొంతసేపటికి  ఒక
చిక్కటి పదార్ధం తయారవుతుంది .   దీనిని ఎంత బాగా గిలకొడితే  అంత మంచి క్రీమ్ తయారవుతుంది . 

         దీనిని పెద్ద మూతి వున్న సీసాలో నిల్వ చేసుకోవాలి .

         రాత్రి పడుకునే ముందు  ముఖానికి , పెదవులకు , సున్నితమైన చర్మ భాగాలకు  రాసుకోవాలి . ఇది చలినుండి
అన్ని  భాగాలను కాపాడుతుంది .

         నూనెలను ,  సహజమైన తైలాలను  స్నానం చేసిన వెంటనే రాసుకోవాలి . ఇది  చర్మానికి PTOTECTIVE గా
పనిచేస్తుంది






                                                         


      



 
                  
 
 
 
                        




                             

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి