టైఫాయిడ్

                   టైఫాయిడ్  లేదా సన్నిపాత జ్వరము ---నివారణ                 12-2-10.
 
మారేడు దళాలు                ----5
రావి  ఆకులు                  ---- 10
తులసి  ఆకులు              -----50
 
        అన్నింటిని నలగగొట్టి నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించి వడకట్టి గంటకొకసారి  ఒక టీ స్పూను చొప్పున  తాగిస్తూ వుంటే ఎటువంటి జ్వరమైనా నివారింప బడుతుంది.
 
                      టైఫాయిడ్  జ్వరము లేదా ఆంత్రిక జ్వరం                        3-11-10.

లక్షణాలు :-- జ్వరం రోజుల  తరబడి తగ్గకుండా వాంతులు, విరేచనాలు అవుతూ వుంటే దానిని టైఫాయిడ్ జ్వరంగాగుర్తించవచ్చు.  ఇది అంటువ్యాధి. ప్రేవులలో బాక్టీరియా చేరడం ద్వారా వస్తుంది. ఈ బాక్టీరియాను ఎంత నిర్మూలించినా కనీసం రెండు శాతమైనా మిగిలే వుంటుంది.  శరీరంలో వ్యాధినిరోధక శక్తి వుంటే గాని ఇది  తగ్గదు.

సౌభాగ్య వటి      ని వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.

తుంగ ముస్థలు                         ---- 50 gr
వట్టి వేర్లు                                 ---- 50 gr

       రెండింటిని వక్కలుముక్కలుగ దంచి  నీటిలో వేసి కషాయం కాచి రోజంతా ఈ నీటిని తాగుతూ వుండాలి.

ఇది ప్రేవులలోని బాక్తీరియాని తొలగిస్తుంది.  చల్లదనాన్ని ఇస్తుంది.

కరక్కాయల చూర్ణం                    --    50 gr
ఉసిరిక చూర్ణం                            ---  50 gr
కరక్కాయల చూర్ణం                    --- 150 gr
తిప్ప తీగ చూర్ణం                       --- 150 gr
శొంటి       చూర్ణం                       ----150 gr
నేలవేము చూర్ణం                        ----150 gr
అల్లం రసం                               ---- తగినంత

     అన్ని చూర్ణాలను కల్వంలో వేసి తగినంత అల్లం రసం  గాని, నేలవేము రసం గాని పోసి నూరి బటాణి గింజంత మాత్రలు కట్టి నీటిలో ఆరబెట్టి నిల్వ చేస్తే సంవత్సరం వరకు నిల్వ వుంటాయి.

      పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం,  సాయంత్రం వాడాలి.   జ్వరం తగ్గిన వెంటనే ఆపకూడదు.

జాగ్రత్తలు:--      ప్రేవులలో పుండ్లు పడవచ్చు. కాబట్ట్టి కారం, పులుపు లేని ఆహారం తీసుకోవాలి.

కొబ్బరినీరు,  పండ్ల రసాలు, మజ్జిగ వంటి తేలికైన ఆహారం తీసుకోవాలి.


1 కామెంట్‌: