మలేరియా






                                  మలేరియా --పరిష్కార మార్గాలు                             13-11-10.

  దోమ కుట్టిన తరువాత దాని ద్వారా శరీరంలో చేరిన సూక్ష్మ జీవులు రక్తంలో ప్రవహించేటపుడు జ్వరంవస్తుంది  
చలి, తలనొప్పి మొదలగు వాటితో ప్రారంభమవుతుంది. ఒక్కోసారి దోమ కుట్టిన తరువాతః బయట పడడానికి కొన్ని రోజులు లేదా నలభై రోజులు పడుతుంది

.జ్వరం రాబోయే ముందు తలనొప్పి ప్రారంభం కావడం, తగ్గడం జరుగుతుంది.
 రక్తనాళాలు చిట్లడం అంతర్గత రక్త స్రావం, రక్త హీనత, ముక్కు ద్వారా, నోటి ద్వారా రక్తం పడడం జరుగుతుంది.
1. పిప్పళ్లను శుద్ధి చేసి పాలల్లో ఉడికించి చల్లారిన తరువాత తేనె కలిపి తాగాలి.

2. కటుక రోహిణి        --- 50 gr
 అతి మధురం          ----50 gr
 తుంగ ముస్థలు       ----50 gr
కరక్కాయలు           ----50 gr ( అతి ప్రధానమైనది )
బెల్లం                      ----తగినంత

అన్నింటిని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి బెల్లం కలిపి శనగ గింజలంత మాత్రలు చేసుకోవచ్చు.లేదా అర టీ స్పూను పొడిలో తేనె కలిపి తీసుకోవచ్చు.పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వాడాలి.



                                                            24-1-11


లక్షణాలు -- ముందు తల నొప్పి వుంటుంది. ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు వుంటాయి.
అతి చలి ముఖ్య లక్షణం . విపరీతమైన జ్వరం, వెంటనే తగ్గి విపరీతంగా చెమట పట్టడం వంటి
లక్షణాలు వుంటాయి.

1. తాజా తులసి ఆకులు  --- పది
                             తేనె --- రెండు టీ స్పూన్లు

   ఆకులను మెత్తగా నూరి తేనె కలిపి ప్రతి రోజు రెండు పూటలా తీసుకోవాలి.

2. దోరగా వేయించిన శొంటి పొడి   --- మూడు గ్రాములు
                          పిప్పళ్ళ పొడి ----మూడు గ్రాములు

     రెండింటిని కలిపి నాలుగు కప్పుల నీళ్ళలో వేసి స్టవ్ మీద పెట్టి రెండు కప్పుల కషాయం మిగిలే వరకు మరిగించాలి.

           దీనిని రోజుకు నాలుగు సార్లు తాగాలి.

  తేమగా వున్నప్రదేశంలో ఉండరాదు. దోమతెరలు వాడాలి. జ్వరం ఎక్కువగా వున్నపుడు విశ్రాంతి తీసుకోవాలి.


















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి