వివిధ రకాల పానీయాలు
వేసవిలో చల్లదనానికి పానీయం 10-5-09
నీళ్ళు --- ఒకటిన్నర లీటరు
పటికబెల్లం --- 150 జి
నిమ్మకాయలు --- రెండు
పనస తొనలు --- నాలుగు
చక్కెరకేళి అరటి పండ్లు --- నాలుగు
మామిడి పండు --- ఒకటి
సూచనలు :-- కలకండను పొడి చెయ్యాలి. నిమ్మకాయలను గింజలు లేకుండా రసం తీయాలి. పనస తొనలనుఅరటి పండ్లను, మామిడి పండును బాగా పిసికి గుజ్జుగా చేయాలి.
కుండలో నీళ్ళు పోసి దానిలో పై పదార్దాలన్నింటిని కలపాలి. మూత పెట్టి మూడు గంటల సేపు కదిలించకుండ ఉంచాలి. కుండను చల్లటి ఇసుక మీద పెట్టి కుండ చుట్టూ తడిపిన నూలు గుడ్డను చుట్టాలి.
తరువాతఈ పానీయాన్ని గ్లాసులో పోసుకుని తాగాలి. దీనిని ప్రతి రోజు తాగవచ్చు. శరీరానికి ఎంతో శక్తిని, చల్లదనాన్నిఇస్తుంది.
వేసవిలో ఎంత ఎండలో తిరిగినా ఈ పానీయం శరీరానికి హాని కలగకుండా కాపాడుతుంది.
వేసవిలో చల్లదనానికి మామిడికాయల రసాయనం 12-6-10.
మామిడి కాయలు
పుదీనా
జిలకర
ఇంగువ
మామిడి కాయలను తొక్క తీసి ముక్కలను ఉడికించి రసం తీయాలి. దానిలో కొద్దిగా జిలకర, చిటికెడుఇంగువ కలిపి కొన్ని పుదీనా ఆకులను, ఉప్పును కలిపి తాగాలి. ఉప్పుగాని, చక్కర గాని కలుపుకోవచ్చు.ఇది శరీరం యొక్క అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. విరేచనం సాఫీ గా అయ్యేట్లు చేస్తుంది.
మామిడి కాయల రసాన్ని బెల్లం పాకంతో గాని, చక్కర పాకంతో గాని కలిపి నిల్వ చేసుకోవచ్చు.

ఆపిల్ జూస్ 5-2-11'
ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టరు తో అవసరం వుండదు. దీనిని వాడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఆపిల్ పండు --- ఒకటి
తేనె ---- ఆరు టీ స్పూన్లు
నీళ్ళు ---- తగినన్ని
ఆపిల్ ను ముక్కలుగా కోసి గింజలను తొలగించాలి. ( గింజలలో విషం వుంటుంది) తొక్క తో
సహా మిక్సి లో వేసి నీళ్ళు పోసి తిప్పాలి. పాలు కలప కూడదు. తేనె మాత్రమే కలపాలి. చెత్త ఎక్కువనుకుంటే వడ కట్టుకోవచ్చు
ఔషధ గుణాలు, ఉపయోగాలు :--
ఉత్తమమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనిలో ఇనుము ఎక్కువగా వుంటుంది. అందువలన
రక్త హీనత తగ్గి ఆయాసం,. నిస్త్రాణ తగ్గుతాయి, జలుబు, , ఉబ్బసం ఒత్తిడి తగ్గుతాయి.
అజీర్ణాన్ని నివారించి ఆకలిని పెంచే
ఆయుర్వేద లస్సీ 16-3-11.
పెరుగు --- మూడు కప్పులు
మీగడ --- మూడు టేబుల్ స్పూన్లు
నిమ్మ రసం --- మూడు టేబుల్ స్పూన్లు
చన్నీళ్ళు --- ఒక కప్పు
ఉప్పు --- అర టీ స్పూను
ఐస్ క్యుబ్స్ --- తగినన్ని
వేయించిన జీలకర్ర పొడి --రెండు టీ స్పూన్లు
మిక్సి లో పెరుగు, మీగడ, నిమ్మరసం, చన్నీళ్ళు, ఉప్పు వేసి రెండు నిమిషాలు
తిప్పాలి. తరువాత ఐస్ క్యుబ్స్ వేసి ఒక నిమిషం తిప్పాలి. తరువాత జీలకర్ర పొడి వేసి ఒకసారి
తిప్పి గ్లాసులో పోసుకుని తాగాలి.
ఇది వేసవి కాలపు సమస్యలను నివారించే మంచి పానీయం. నులిపురుగులను,
ఆంత్ర క్రిములను పొట్టలో పురుగులను నివారిస్తుంది. అజీర్ణాన్ని పోగొడుతుంది. దురదలను,
అతిసారను, నేత్ర రోగాలను నివారిస్తుంది.
గులాబీ షర్బత్ 18-3-11.
గులాబి రేకులు --- ఒకటిన్నర కప్పులు
వేడి నీళ్ళు --- ముప్పావు కప్పు
యాలకుల పొడి --- చిటికెడు
పంచదార --- ముప్పావు కప్పు
దానిమ్మ గింజల రసం --- అర కప్పు
చన్నీళ్ళు --- ఐదు కప్పులు
నిమ్మరసం --- పావు కప్పు
గులాబి రేకులను కల్వంలో వేసి మెత్తగా నూరాలి. ఆ ముద్దను ఒక గిన్నెలో వేసి వేడినీళ్ళు
పోసి మూతపెట్టి రాత్రంతా కదిలించకుండా అలాగే ఉంచాలి. ఉదయం వడ పోయాలి. దీనికి
చక్కెర కలపాలి. ఈ గిన్నెను ఒక పెద్ద గిన్నెలోని నీళ్ళలో పెట్టి పెద్ద గిన్నెను వేడి చేయాలి.
దీనివలన చక్కెర త్వరగా కరుగుతుంది. తరువాత వడపోసి, చల్లారనివ్వాలి. దీనికి నిమ్మరసం
దానిమ్మరసం, చన్నీళ్ళు కలిపి, ఐస్ క్యుబ్స్ వేసి తాగాలి.
దీనిని మధ్యాహ్న సమయంలో తాగితే ఎండవేడి వలన కలిగే వేడి తగ్గుతుంది. మలబద్ధకం
నివారింపబడుతుంది. అన్ని రకాల రక్త స్రావాలను ఆపుతుంది. ఒంటిపైన మంటలు, దాహం
నివారింప బడతాయి. గుండె జబ్బులు కలిగిన వాళ్లకు ఇది ఎంతో ఉపయోగకరం .
శరీరంలోని వేడి తగ్గడానికి ఆయుర్వేద షర్బత్ 30-3-11.
దీనిని సేవిస్తే శరీరంలోని వేడి మంత్రం వేసినట్లు గా తగ్గుతుంది.
ఉపయోగాలు :--
దప్పిక నివారింపబడుతుంది.
అలసట, నిస్త్రాణ తగ్గుతాయి ఇంద్రియ ప్రసన్నతను కలిగిస్తుంది ఆహారానికి ఈ లక్షణం వుంటే అది మంచి ఆహారం అని అర్ధం.
ఒత్తిడిని తగ్గిస్తుంది.
కాళ్ళ, చేతుల, శరీరం యొక్క మంటలను తగ్గిస్తుంది. చిరాకు, అసహనం తగ్గుతాయి.
శరీరపు కాంతి పెరుగుతుంది.
వట్టివేర్ల పొడి ---- 10 gr
చందనం పొడి ---- 10 gr
ఎర్రచందనం పొడి ---- 10 gr
సుగంధిపాల వేర్ల పొడి ---- 10 gr
అతిమధురం వేర్ల పొడి ---- 5 gr
మందార పూరేకుల పొడి ---- 5 gr
గులాబి పూరేకుల పొడి ---- 5 gr
నీళ్ళు --- 1200 ml
కలకండ ---- 150 gr
నిమ్మరసం ---- తగినంత
ఒక పాత్రలో పై పదార్దాలన్నింటిని వేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద
మరిగించాలి. దీనికి కలకండ కలపాలి. తరువాత వడకట్టి చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టాలి.
ఒక గ్లాసులో 20 ml షర్బత్ ను తీసుకుని నీళ్ళు, నిమ్మరసం కలిపి తాగాలి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి