తేనె, పంచదార, బెల్లం, పటికబెల్లం

                                         తేనె, పంచదార, బెల్లం, పటికబెల్లం

                                                           బెల్లం                                           6-1-11.

పంచదార కంటే బెల్లం మంచిది . చక్కర హైలీ రిఫైండ్ ( Highly Refind )
బెల్లంలో పోషక విలువలు ఎక్కువ. శుశ్రుత సంహిత లో బెల్లాన్ని గురించి చెప్పబడినది.

బెల్లం వాత నొప్పులను, గ్యాస్ ను తగ్గిస్తుంది. రక్తాన్ని పెంచుతుంది. మూత్రాన్ని జారీ చేస్తుంది.

పురాణ గుణం = పాతబెల్లం

పాతబెల్లం ఆరోగ్యకరం, త్రిదోష హరం.

కఫనివారణకు :-- బెల్లాన్ని అల్లం తో కలిపి తీసుకోవాలి

పైత్య నివారణకు :--

బెల్లం + కరక్కాయ

వాత నివారణకు :--

బెల్లం +

దద్దుర్లు :--

బెల్లం --- 5 gr
అల్లం --- చిన్న ముక్క


కలిపి తినాలి.

  మెట్లు దిగేటపుడు కాలు స్లిప్ అయి వాపు, నొప్పి వుంటే :--
బెల్లం            ---100 gr
నీరు సున్నం ---100 gr

    రెండింటిని బాగా పిసికి దెబ్బ తగిలిన చోట పట్టు వేస్తే తెల్లారే సరికి నొప్పి, వాపు తగ్గుతాయి.

విటమిన్ల లోపం, రక్త హీనత :--

బెల్లం                     --- 5 gr
కొబ్బరి                  --- 5 gr
బాదం పప్పులు     --- 4, 5
అరటి పండు          --- ఒకటి

   అన్నింటిని కలిపి తింటే విటమిన్ల లోపం, రక్త హీనత నివారింప బడతాయి. విధంగా ప్రతి రోజు చేయాలి.

                                                           తేనె                                                  26-2-11.
1. మొటిమలు :--

తేనె                      --- ఒక టీ స్పూను
దాల్చిన చెక్క పొడి --- ఒక గ్రాము

      ప్రతి రోజు రాత్రి పూట పూస్తుంటే ఒక వారంలో తగ్గిపోతాయి.

2. కాలిన గాయాలు:--

తేనె     --- 10 gr
పసుపు --- 5 gr

     కలిపి పై పూతగా పూయాలి. మచ్చ పడకుండా, ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా తగ్గుతాయి.

3. పెదవుల పగుళ్ళు :--

తేనె                --- ఒక టీ స్పూను
మీగడ            --- అర టీ స్పూను
రోజ్ వాటర్     --- నాలుగైదు చుక్కలు

     అన్నింటిని కలిపి పూయాలి.
















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి