లవణాలు ---ఉపయోగాలు

                                               లవణాలు ---ఉపయోగాలు

                                            సైంధవ లవణం ---ఉపయోగాలు                      29-5-10.

  ఇది వేడి చెయ్యదు . పైత్య సమస్యల నుండి బయటపడవచ్చు. గుండెకు మంచిది. గొంతులో కఫం పేరుకుని ఊపిరాడనపుడు కొద్దిగా సైంధవ లవణం నోట్లో వేసుకుని చప్పరించడం లేదా తేనె కలిపి చప్పరించడం గాని చేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

   సైంధవ లవణం లో తామస ( సాత్విక) గుణం ఎక్కువ
మిగిలిన లవణాలలో ( సముద్రపు ఉప్పు, నల్ల ఉప్పురాజస గుణాలు ఎక్కువ వుంటాయి.

కాబట్టి మెడిటేషన్ చేసేవాళ్ళు సైంధవ లవణం ఎక్కువగా వాడాలి.

        రక్త హీనత తో బాధపడే వాళ్ళు వంటలలో సైంధవ లవణం వాడితే రక్తంలో ఇనుము శాతం పెరుగుతుంది. దీనిలో  ఇనుప ధాతువులు వుంటాయి. దీని వలన ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఇది అన్ని రకాల శరీర తత్వాలకు   అందరికి అనుకూలమైనది.

ఇది నిర్జలీయతను తగ్గిస్తుంది.

                                                                 ఉప్పు                               22-2-11.

కీళ్ళనొప్పులు :--

నీళ్ళు            --- ఒక మగ్గు
ఉప్పు           --- అర కప్పు
తెల్ల వాము   --- పావు కప్పు

    అన్నింటిని కలిపి మరిగించాలి.నలు చదరంగా వున్న ఒక మెత్తని గుడ్డను మడిచి నీటిలో
ముంచి, పిండి నొప్పి వున్న చోట పరచాలి. నొప్పి చాలా బాగా తగ్గుతుంది.

గొంతు నొప్పి :--

నీళ్ళు ----ఒక గ్లాసు
ఉప్పు --- ఒక స్పూను

        రెండు కలిపి పుక్కిట పడితే నొప్పి తగ్గుతుంది.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి