స్నానజలము తయారు చేయడం 1-3-11
1. చిన్న పిల్లల స్నానానికి :
నలగ గొట్టబడిన అతిబల వేర్లు
" " వసకోమ్ములు
" " వేపాకులు
చిటికెడు కర్పూరం
ఒక చెంబు నీటిలో అన్నింటిని వేసి నానబెట్టాలి.
ఆ నీటిని స్నానపు నీటిలో కలిపి స్నానం చేయించాలి.
2. ఆడపిల్లల స్నానానికి :--
వేపాకులు
తులసి ఆకులు లేదా పొడి
మారేడు ఆకుల పొడి లేదా పండు గుజ్జు పొడి
వీటిని నీటిలో కలుపుకుని స్నానం చేయాలి.
3. జటామాంసి
వట్టి వేర్లు
ఆకుపత్రి
గంధకచ్చూరాలు
తుంగ గడ్డలు
కర్పూరం -- చిటికెడు
అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని నలగగొట్టి రాత్రి పూట బిందెడు నీళ్ళలోవేసి
కలియబెట్టి ఉంచాలి. ఉదయం వడపోసి ఆ నీటితో స్నానం చేయాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి