అధిక చెమట

                                 అధిక చెమట సమస్య --నివారణ                                     10-3-09.
                     50, 60 సంవత్సరాల వయసు దాటిన  వారిలో  అధిక చెమట సమస్య వుంటుంది.
                                               నాగకేసరాలు
                                               వట్టి వేళ్ళు
                                               దిరిసెన చెట్టు బెరడు (చర్మ సౌందర్య విష హరిణి)
                                               ఆకు పత్రి
                                               పచ్చ కర్పూరం
                                               నల్ల ఉలవలు
         అన్నింటిని నానబెట్టి రుబ్బి ముద్దలాగా చేసి శరీరం పై రుద్దితే అతి చెమట సమస్య నివారింప బడుతుంది.
ఇది అన్ని వయసుల వాళ్లకు ఉపయోగపడుతుంది. ఇది పూసుకున్న తరువాత గంట ఆగి స్నానం చెయ్యాలి.

                           అధికంగా చెమట పట్టుట --నివారణ                         24-3-09.

లక్షణాలు:-- ఎండలో తిరగక పోయినా, ఇంట్లో వున్నా, ఫ్యాన్ కింద వున్నా అరికాళ్ళకు, అరిచేతులకు ఎక్కువగా చెమట పట్టడం.

కారణాలు:-- కాలేయంలో ఎక్కువగా వేడి చేరడం వలన ఇది వస్తుంది.  కారం, చెడు, మాంసం, మద్యం ఎక్కువగా  సేవించడం వలన వస్తుంది.

       పొట్ట మీద కాలేయం వున్నచోట నువ్వుల నూనెతోమృదువుగా  మర్దన చెయ్యాలి.

ఆసనాలు:--

1. జానుశిరాసనం :-- కాళ్ళు చాపి కూర్చొని ఒక కాలును గుదమునకు ఆనుకునేట్లు పెట్టి కుడి చేతిని నడుము  మీదపెట్టి, ఎడమ చేతితో ఎడమ కాలి బొటన వ్రేలును పట్టుకొని వంగాలి.  ఈ విధంగా రెండవ వైపు కూడా  చెయ్యాలి.

2. నౌకాసనం:-- వెల్లకిలా పడుకొని రెండు చేతులను బాగా  చాపి రెండు కాళ్ళను కదలకుండా లేపాలి.

ఆహారం:-- వామును శుభ్రం చేసి దోరగా వేయించి దంచి పొడి చెయ్యాలి. అది మునిగే వరకు నువ్వుల నూనె పోసి  రాత్రంతా నానబెట్టాలి.  ఉదయం దంతధావనం తరువాత కొంచం కొంచం గా తినాలి. ఒక గంట వరకు ఏమి తిన కూడదు .

                              చిన్న పిల్లలకు           ----- పావు టీ స్పూను
                              పెద్ద పిల్లలకు             ----- అర టీ స్పూను
                              పెద్దలకు                    ----- ఒక టీ స్పూను

     సునాముఖి ఆకును ఎండబెట్టి దంచి జల్లించిన పొడిని సీసాలో భద్రపరచాలి.
 
     పావు టీ స్పూను సునాముఖి పొడిని అర కప్పు ఆవు మజ్జిగ లో కలిపి రాత్రి నిద్రించే ముందు తాగాలి.
 చారెడు ఉలవలను చాలా మెత్తగా పప్పులాగా ఉడకబెట్టాలి. రెండు పూటలా స్నానానికి ముందు ఈ పప్పు ముద్దను అర చేతుల్లో వేసుకొని అరి కాళ్ళ మీద, అరి చేతుల్లో  రుద్దాలి.

                         అధిక చెమట వలన శరీర దుర్గంధం --నివారణ                     24-11-10.
        గాలిని బాగా తగలనివ్వాలి.
        కొన్ని గ్రంధుల పని తీరు,  వంశ పారంపర్యం ముఖ్యమైన  కారణాలు.
        గోధుమ పిండి నుండి, యాపిల్ నుండి తయారైన వెనిగర్ ను డియోడరెంట్ గా దూదితో అడ్డుకోవాలి.
       పటిక పొడిని చెమట పట్టిన చోట చల్లాలి.
 మొక్క జొన్నల పిండి               --- 10 gr
వంట సోడా                              --- 10 gr
మంచి గంధం నూనె                   ---  రెండు చుక్కలు
     అన్నింటిని కలిపి పౌడర్ లాగా పూసుకోవాలి.
2. స్నానపు నీళ్ళలో రెండు కప్పుల టొమాట రసం కలిపి స్నానం చేస్తే ఎంతో ఫ్రెష్ గా వుంటుంది.
3. స్నానం చేసే నీటిలో రెండు టీ స్పూన్ల వంట సోడా కలిపి చేస్తే ఎంతో మంచిది.
4. టాల్కం పౌడర్, వంట సోడా కలిపి పోసుకుంటే ఫ్రెష్ గా వుంటుంది.

               అతి క్తోవ్వు వలన శరీరంలో వచ్చే దుర్గంధం-- నివారణ              14-12-10.

ఎర్రని లేదా తెల్ల చందనం         ----10 gr
          లొద్దుగ చెక్క పొడి        ---- 10 gr
          నాగ కేసరాల పొడి        ---- 10 gr
                 వట్టి వేర్ల పొడి       ---- 10 gr
                పచ్చ కర్పూరం     ---- 10 gr ( భీమసేని కర్పూరం మంచిది )

       అన్నింటిని కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

       దీనితో స్నానం చెయ్యడం వలన దుర్గంధం తొలగింప బడుతుంది. అధికంగా చెమట పట్టడం తగ్గుతుంది.

       శరీరంలోని వేడి తగ్గుతుంది. స్నానానికి ఒక గంట ముందుగా ఈ పొడి తో లేపనం చేయాలి,
 మర్మ భాగాల  లోని చర్మ వ్యాధులు కూడా నివారింప బడతాయి.

                             అధిక స్వేదం ---నివారణ                             31-7-10.

త్రిఫలాలు      (1 : 1 :  1 )
శొంటి
తుంగ ముస్తలు
అతిమధురం

      అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని  దంచి పోడులుగా చేసి జల్లించి కలిపి నిల్వ చేసుకోవాలి.

పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా నీటితో సేవిస్తే అతి స్వేదం సమస్య  నివారింప బడుతుంది.

      దీనితోబాటు జటామాంసి పొడిని కూడా కలుపుకోవచ్చు.

                              చెమట వాసన నివారణకు చిట్కా                   16-11-10.

    నేరేడు ఆకులను నీటిలో కలిపి ఉడికించి  వడకట్టి ఆ నీటిని స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చెమట వాసన తగ్గుతుంది.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి