మూత్ర పిండాలు

                                   మూత్ర పిండాలలో రాళ్ళు -- నివారణ                         10-1-09.
 
        ఉత్తరేణి గింజలు పచ్చివైతే అలాగే నూరవచ్చు,లేదా ఎండినవైతే వాటిని మిక్సి లో వేసి పొడి చెయ్యాలి. పొడిని కల్వంలో వేసి తగినన్ని నీళ్ళు కలిపి బాగా మెత్తగా నూరాలి. తరువాత బటాణి గింజలంత మాత్రలు కట్టాలి. వాటిని నీడలో ఆరబెట్టాలి . 5,6 రోజులలో గట్టిగా రాళ్ళ లాగ అవుతాయి. వాటిని సీసాలో నిల్వ చేసుకోవాలి
 
ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున ఆహారానికి గంట ముందు మంచి నీటితో వేసుకోవాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది కాని నీరసం రాదు.40 రోజులలో మూత్ర పిండాలలో రాళ్ళు కరిగి పోతాయి.

                              మూత్ర పిండాలలో రాళ్ళు _-- నివారణ                                     7-4-09.

కొండ పిండి చెట్టు (పిండికొమ్మ, పాషాణ భేది ) యొక్క వేర్లు తెచ్చి శుభ్ర పరచి ఎండబెట్టి పొడి చేసినిల్వ చేసుకోవాలి.
 
కొండ పిండి వేర్ల చూర్ణము ----20 gr
                            నీళ్ళు --- ఒక పెద్ద గ్లాసు
 
రెండు కలిపి మరిగించి ఒక కప్పు కషాయం మిగిలే వరకు కాచాలి. గోరువెచ్చగా వున్నపుడు దానిలో మూడు చిటికెల శిలాజతు , ఒక టీ స్పూను చక్కెర కలిపి తాగాలి. విధంగా రెండు పూటలా తాగాలి.
 
2. శతావరి దుంపల రసం ---20 gr
                   ఆవు పాలు ---ఒక కప్పు
 
శతావరి వేర్లను దంచి రసం తీయాలి. దీనిని ఆవు పాలలో కలిపి తాగాలి.

                                                   11-10-10

లక్షణాలు :-- ఇవి చిన్నవిగా వున్నపుడు ఉన్నట్లుగా కూడా తెలియదు.

కారణాలు :-- విరుద్ధమైన ఆహారం తీసుకోవడం వలన, మానసిక, ఆహార కారణాల వలన రాళ్ళు ఏర్పడతాయి.నొప్పి కూడా వుంటుంది. సరిపడినంత నీరు తాగకపోవడం వలన , దాహమేసినపుడు ఆహారం తీసుకోవడం వలన ఆకలిగా వున్నపుడు నీళ్ళు తాగడం వలన కూడా ఏర్పడతాయి. కాలుష్యం వలన కూడా ఏర్పడతాయి.

కొండ పిండి వేళ్ళు( పాషాణ భేది )
పల్లేరు
వరుణ చెక్క బెరడు

 అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని దంచి కలిపి నిల్వ చేసుకోవాలి. 20 గ్రాముల పొడిని రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాసు కషాయం వచ్చే వరకు కాచాలి. ప్రతి రోజు ఉదయం సాయంత్రం కషాయాన్ని ఆహారం తరువాత తాగుతూ వుంటే నెల రోజులలోపల రాళ్ళు కరిగిపోతాయి.

వృక్ష సంబంధమైన, జంతు సంబంధమైన పదార్ధాలను కలిపి తినకూడదు. జావ లాంటి పదార్ధాలను ఎక్కువగా వాడుకోవాలి.
 
                                   మూత్ర పిండాలలో రాళ్ళు                                       24-10-09.

  పండి రాలిన వేపాకులను బాణలిలో వేసి కాల్చి బూడిద చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. పావు టీ స్పూను పొడిని తేనెలో రంగరించి చప్పరించాలి. దీని వలన మూత్ర పిండాలలో రాళ్ళు కరుగుతాయి మరియు తెల్లబట్ట వ్యాధి నివారణకు పొడిని వెన్నలో కలుపుకుని తీసుకోవాలి.

                                   మూత్ర పిండాలలో రాళ్ళు                                         1-1-2011.

ఆహారంలో ఎక్కువగా ఉలవలు వాడాలి. ప్రతి రోజు కనీసం రెండు టీ స్పూన్ల ఉలవల పొడిని తీసుకుంటూ వుండాలి.
 
                                మూత్ర పిండాలలో సమస్య ---నివారణ                             27-1-11.
 
మూత్ర పిండాలు రక్తంలో చేరిన మలినపదార్ధాలను తొలగించి మంచి రక్తాన్ని తిరిగి శరీరానికి
అందిస్తాయి.
 
సమస్య వున్నపుడు కలిగే లక్షణాలు :--
 
    చిన్న పనికే ఆయాసం రావడం, పాదాలలో, అరిచేతులలోవాపు రావడం, రక్త హీనత, చర్మం
మసక బారినట్లు తయారవడం, కీళ్ళ నొప్పులు, వీపు వెనక భాగంలో నొప్పులు, నిద్ర పట్టకపోవడం
ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలు వుంటాయి.
 
పునర్నవ కషాయం
పునర్నవాది గుగ్గులు
బసవరాజ గుళికలు
 
వీనిలో ఏదైనా వాడుకోవచ్చు.
 
పునర్నవ = తెల్ల గలిజేరు మంచి ఔషధగుణాలు కలిగిన మొక్క.
 
పల్లేరు కాయల పొడి                  --- 100 gr
తెల్ల గలిజేరు వేర్ల పొడి               --- 100 gr
కరక్కాయల పెచ్చుల పొడి           --- 50 gr
నాగ కేసరాల పొడి                      --- 50 gr
నేలుసిరిక చూర్ణం                     --- 100 gr
ఉత్తరేణి చూర్ణం                        --- 100 gr ( కాండము లేదా వేరు చూర్ణము)
తిప్ప తీగ పొడి                        --- 100 gr
 
అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
 
25 గ్రాముల పొడిని మూడు గ్లాసుల నీటిలో వేసి మరిగించి ఒకటిన్నర గ్లాసు కషాయం
మిగిలే వరకు కాచాలి. విధంగా ఎప్పటికప్పుడు తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు
తాగాలి.
                                                    అశ్మరి వ్యాధి
 
   ముఖ్యముగా వ్యాధి మలబద్దకము వలన, విరేచానానికి మందులు వేసుకోక పోవడం వలన తైలమర్దన చేయక పోవడం వలన వస్తుంది. నడుముకు తడిబట్టను చుట్టాలి. దానిపై పొడి బట్టను దానిపై లావు దుప్పటిని చుట్టాలి. లోపలి తడి బట్ట ఆరు అడుగులు వుంటే మంచిది. నిలబడి కట్టుకోవాలి. దీని వలన మూత్రావయవాలు శుభ్ర పడతాయి.

కారణాలు:-- వ్యాధికి ముఖ్యమైన కారణం శరీరం లో కఫం చేరడం కఫానికి వేడి చేరితే రాయి లాగా గట్టి పడుతుంది.

1. కొండ పిండి ఆకు లేదా పిండి కూర లేదా పాషాణ భేది ని ఆకు కూర లాగా వండుకొని తినాలి. లేదా ఆకు పొడిని టీ లాగా కాచుకొని తాగాలి.

2. తెల్ల గలిజేరు (ఎర్ర గలిజేరు అయినా పరవా లేదు) కూడా మూత్రావయవాలను శుభ్ర పరుస్తుంది.

3. ముల్లంగి గడ్డలను వాడవచ్చు. 4. ఉలవ గుగ్గిళ్ళు, ఉలవ చారు ఎంతో ఉపయోగకరం 

                         మూత్రావయవాల్లో రాళ్ళు ---నివారణ                                   2-4-09.

వ్యాయామం:-- నూలు గుడ్డను వేడి నీటిలో ముంచి నడుము వైపు వెనకగా కట్టుకోవాలి. ముందు వైపు చల్లని గుడ్డ కట్టుకోవాలి.

లక్షణాలు:--పొట్ట ఉబ్బరించినట్లు వుండడం, పొత్తి కడుపులో, గజ్జల్లో పట్టేసినట్లుగా వుండడం, మూత్రం బొట్లు, బొట్లు గా రావడం మూత్రం దుర్గంధంగా వుండడం మొదలైనవి.

నిర్ధారణ:-- ఉదయం లేవగానే మొదటి మూత్రాన్ని ఒక కప్పులోకి పట్టాలి. దానిని గమనిస్తే శుభ్రంగా వుంటే వ్యాదిలేనట్లు, పైన నురుగు తేలి దుర్వాసన కలిగి రంగు మారి వుంటే వ్యాధి వున్నట్లు నిర్ధారించుకోవాలి. ఒక కప్పు మూత్రంలో టీ పొడి వేసి కాచి అర కప్పుకు రానిచ్చి వడకట్టి మళ్లీ నీళ్ళు కలిపి తాగితే 15 రోజులలో రాళ్ళు కరుగుతాయి.

     Dr. Vora అను డాక్టరు గారు ప్రయోగ ఫలితాన్ని సాధించారు. ఒక కప్పు ముల్లంగి రసం లో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగితే రాళ్ళు కరుగుతాయి. విధంగా నలభై రోజులు చేయాలి.

                                         మూత్రావయవాల్లో రాళ్ళు --నివారణ                      3-4-09.

అశ్మరి వ్యాధి వాయు దోషము వలన ఏర్పడే రాళ్ళను    ----- వాతాశ్మరి
   పైత్య                        "           "       "          "      ------ పిత్తాశ్మరి
   కఫ                          "           "       "          "      ------ కఫాశ్మరి
   శుక్ర                         "           "       "          "       ------ శుక్రాశ్మరి

      పొత్తి పొట్టలో నొప్పిగా బిగదీసినట్లు వుండడం దీని యొక్క ప్రాధమిక లక్షణం

యోగాసనం:--- పాదహస్తాసనం-- రెండు కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉండేటట్లుగా నిటారుగా నిలబడాలి. రెండు చేతులను పూర్తిగా పైకెత్తి తరువాత గాలి పీలుస్తూ కిందికి వంగి బొటన వ్రేళ్ళను తాకి పైకి లేస్తూ గాలి వదలాలి.

2. భుజంగాసనం:-- బోర్లా పడుకొని రెండు చేతులను నడుము పైన పెట్టుకొని కాళ్ళను పైకి లేపాలి.

3. శలభాసనం:-- బోర్లా పడుకొని చేతులను పొట్ట కింద పెట్టుకొని కాళ్ళను పైకి లేపడం

4. భస్త్రిక 5. వేగ భస్త్రిక నిర్ధారణ:-- మూత్రావయవాల్లో రాళ్ళు వున్నపుడు మూత్రం రెండు పాయలుగా రావడం జరుగుతుంది. మూత్ర నాళం లో విపరీతమైన నొప్పి వుంటుంది. మూత్రం లో రక్తం డడం, మూత్రం ఆగి ఆగి రావడం జరుగుతుంది.

1. 10 నుండి 20 గ్రాముల మోదుగ పూలను నలగగొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఒక కప్పు కషాయానికి రానివ్వాలి. దానిని ఉదయం సాయంత్రం తాగాలి.

2. 10 నుండి 20 గ్రాముల పొద్దుతిరుగుడు పూలను గాని వేళ్ళను గాని తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఒక కప్పు కషాయానికి రానిచ్చి పరగడుపున ఉదయం సాయంత్రం తాగితే రాళ్ళు కరిగి పోతాయి. పైన చెప్పబడిన రెండు రకాల పూలను తెచ్చి విడివిడిగా ఎండబెట్టి కూడా వాడుకోవచ్చు.

                                మూత్ర పిండాలలో రాళ్ళు-- నివారణ                                   6-4-09.
 
మునగ చెట్టు వేర్ల బెరడు ---- 10 gr
                           నీళ్ళు --- రెండు కప్పులు
 
   నీళ్ళలో మునగ చెట్టు బెరడు వేసి ఒక కప్పు వచ్చే వరకు మరిగించి వదపోయ్యాలి. గోరువెచ్చగా వున్నపుడు ఒక టీ స్పూను తేనె కలిపి ఉదయం, సాయంత్రం తాగాలి.
 
2. దోస గింజలను నానబెట్టి నూరి ఉదయం, సాయంత్రం భోజనానికి అర గంట ముందు 15 గ్రాములు తీసుకోవాలి. నొప్పి ఎక్కువగా వుంటే మధ్యాహ్నం కూడా వాడవచ్చు.
 
3. ఎడమ వైపు నొప్పి వుంటే ఎడమ వైపు కిడ్నీలో రాళ్ళు వున్నట్లు, కుడి వైపు నొప్పి వుంటే కుడి వైపు రాళ్ళువున్నట్లు గుర్తించాలి.
 
                                              . మూత్రావయవాల శుద్ధికి                         1-7-09.
 
  తెల్ల గలిజేరు తిప్ప తీగ చిన్న పల్లేరు లేదా పెద్దపల్లేరు కొండపింది (పాషాణ భేది లేదా పిండికూర) సుగంధ పాల వేర్ల పై బెరడు అన్నింటిని సమాన భాగాలు తీసుకొని విడివిడిగా దంచి జల్లించి పలుచని నూలు గుడ్డలో వస్త్రఘాలితం చేయాలి. కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

     పెద్ద గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడిని వేసి మరిగించి సగానికి రానివాలి. దించి వడపోసి గోరువెచ్చగా అయిన తరువాత ఒక టీ స్పూను కలకండ కలుపుకొని తాగాలి. ఉదయం,సాయంత్రం ఆహారానికి గంట ముందు సేవించాలి.

   శరీరంలో మూత్రావయవాలు వున్న స్థానాన్ని స్వాదిష్టాన చక్రము లేక గణేశ చక్రము అంటారు. మర్మాంగానికి నాభికి మధ్యలో వుంటుంది. చూపుడువేలుకు కిందుగా నేరుగా మణికట్టు దగ్గర నుండి కిందికి దగ్గర దగ్గర గా నాలుగు చోట్ల ఒత్తిడి కలిగించాలి.

 అలాగే రెండవ వైపు కూడా చేయాలి. చిటికెన వేలుకు, ఉంగరపు వేలుకు మధ్యగా మణికట్టు నుండి కిందికి నాలుగు చోట్ల అరవై సార్లు ఒత్తిడి కలిగించాలి. (మూత్రావయవాలు) మధ్య వేలు కిందుగా అరచేతి మధ్యలో(చాలా కొద్దిగా పైకి) నొక్కాలి. మూత్ర పిండాలలో సమస్య వున్న వాళ్లకు అక్కడ చాలా నొప్పిగా వుంటుంది.

ముద్ర వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకొని మనసును మూత్ర స్థానాలపై కేంద్రీకరించి "వం" అనే అక్షరాన్ని గొంతు, ముక్కు కలిపి పలకాలి.

ఆవు పాలు             --- ఒక కప్పు
ఆవు నెయ్యి           --- ఒక టీ స్పూను
బెల్లం                    --- పది గ్రాములు

      కలిపి తాగితే మూత్రం బొట్లు బొట్లుగా రావడం,చురుకు, పోటు నివారించ బడతాయి.

                       మూత్ర పిండాలలో రాళ్ళను కరిగించడానికి                                 24-10-09.

  బాగా పండిన వేపాకులను తెచ్చి బాణలిలో వేసి స్టవ్ మీద పెట్టి నల్లగా మాడే వరకు వేయించాలి. బూడిద లాగా మారాలి. జల్లించి సీసాలో భద్ర పరచుకోవాలి. మూత్ర పిండాల లో రాళ్ళ సమస్య వున్నవాళ్ళు పావు టీ స్పూను పొడిని తగినంత తేనె కలిపి రంగరించి తినాలి.

విధంగా 21 రోజులు తీసుకుంటే రాళ్ళు పూర్తిగా కరిగి బయటయకు వస్తాయి. ఇదే పొడిని పావు టీ స్పూను పొడిని వెన్నతో కలిపి తింటే తెల్లబట్ట వ్యాధి నివారింప బడుతుంది.

                                మూత్ర పిండాల సమస్య -- నివారణ                                     27-6-10.
 
      తెల్ల గలిజేరు (పునర్నవ) మొక్కను తెచ్చి నీడలో ఆరబెట్టి ఎండిన తరువాత పొడి చేసి నిల్వ చేసుకోవాలి.ఎల్లప్పుడూ దొరికి తే ఆకును కూరగా వండుకొని తినవచ్చు.
 
అర గ్లాసు తెల్ల గలిజేరు రసానికి అరగ్లాసు నీళ్ళు కలిపి తాగితే మూత్ర సమస్యలు నివారించ బడతాయి. దీనిలో తేనె కలుపుకొని కూడా తాగవచ్చు.( షుగర్ లేని వాళ్ళు)
పచ్చి రసం తాగలేని వాళ్ళు 200 గ్రాముల రసాన్ని కాచి 50 గ్రాములకు రానిచ్చి తేనె కలుపుకొని తాగవచ్చు
.
             మూత్ర పిండాలలో రాళ్ళను తొలగించడానికి వృక్క అశ్మరి                          10-9-10

గోక్షూరం = పల్లేరు పల్లేరు కాయల పొడిని నీటిలో వేసి కషాయం కాచి తాగుతూవుంటే మూత్రం లో రాళ్ళు కరిగి బయటకు వస్తాయి. ఆహారంలో ముల్లంగి, తులసి ఎక్కువగా వాడుకోవాలి. పాషాణ భేది, పత్తర్ చూర్ మొ---

                                                      18-9-10

     మొక్కజొన్న కండెల లోని పీచును నమిలి తినడం గాని లేదా నూరి తినడంగాని  లేదా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ వుంటే మూత్రపిందాలలోని రాళ్ళు కరుగుతాయి.

                                     మూత్ర పిండాలలో సమస్యలు-- నివారణ                         27-9-10.

లక్షణాలు :-- చర్మం పాలిపోయినట్లుగా, పోగాచూరినట్లుగా వుండడం, రక్తం లోని మలినాలు విసర్జించక పోవడం మలినాలు రక్తంలోనే నిల్వ వుండడం వలన చర్మం గుంటలు పడడం నొప్పులు, వాపులు, కీళ్లలో నొప్పిగా వుండడం, తిన్నా తిన్నట్లు ఉండక పోవడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలు వుంటాయి. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వలన మూత్ర పిండాలకు ఒత్తిడి ఎక్కువవుతుంది. మందులు ఏవైనా వాడుతుంటే వాటిలో ఏవైనా మలినాలు వుంటే అవి కూడా విసర్జింపబడవు

సమస్యల పరిష్కారం :--
 
ఎర్ర గలిజేరు కును కూరగా వండుకుని తినాలి. వేర్లను తెచ్చి కడిగి ఎండబెట్టి దంచి పొడి చేసి నిల్వ చేసుకోవాలి.

ఎర్రగలిజేరు వేర్ల చూర్ణం              --- 50 gr
తిప్ప తీగ చూర్ణం                      --- 50 gr
పల్లేరు కాయల చూర్ణం               --- 50 gr

  అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. పొడిని రెండు టీ స్పూన్లు తీసుకుని రెండు గ్లాసుల నీటిలో వేసి కాచి ఒక గ్లాసుకు రానిచ్చి వడకట్టి తాగాలి. ఉదయం, సాయంత్రం ఆహారానికి ముందు రెండు మూడు నెలలు వాడాలి.

ఆహారనియమాలు :- ఉప్పు, కారం, పులుపు, వగరు ఎక్కువగా వున్నపదార్ధాలు వాడకూడదు. మాంసాహారం గుడ్లు వీలైనంత వరకు తగ్గించాలి. ఉలవలను ప్రతి రోజు ఏదో ఒక రూపంలో వాడాలి.

                      మూత్ర పిండాలలో రాళ్ళ నివారణకు చిట్కా                                  1-12-10.

    ప్రతి పదిహేను రోజులకు ఒక సారి ముల్లంగి రసం తాగుతూ వుంటే మూత్ర పిండాలలో రాళ్ళు కరిగి పోతాయి.
                        మూత్ర పిండాలలో రాళ్ళు  ( మేహపు రాళ్ళు) --నివారణ              16-4-11.

              పల్లేరు కాయల చూర్ణం           --- ఒక టీ స్పూను   
                         నీళ్ళు                      --- ఒక కప్పు  

      నీళ్ళు స్టవ్ మీద పెట్టి  పొడిని వేసి మరిగించి అరకప్పు కు రానివ్వాలి. దించి ఒక టీ స్పూను
 కలకండ కలుపుకొని తాగాలి.  ఈ విధంగా చేయడం వలన రాళ్ళు  కరిగిపోతాయి.

      మధుమేహం వున్నవాళ్ళు కలకండ లేకుండా తాగవచ్చు

      పల్లేరు గుండెకు, కాలేయానికి బలాన్నిస్తుంది దీనితోపాటు ఒక పూట ముల్లంగి రసం రెండవ
 పూట ఉలవకట్టు + సైంధవ లవణం కలిపి తీసుకోవాలి.  

                                                మూత్ర పిండాలలో రాళ్ళు  --- నివారణ                           25-7-11.

1. కొండపిండి  ఆకును తెచ్చి కూర వండుకొని రెండు పూటలా తింటూ  వుంటే రాళ్ళు కరిగిపోతాయి
2. బచ్చలి ఆకును కూర వండుకొని గాని  లేదా ఆకును రసం తీసుకొని తాగడం గాని  చేస్తూ వుంటే  రాళ్ళు కరిగిపోతాయి .
3. ఉల్లి పాయ ముక్కలను పెరుగులో నానబెట్టి తింటే మూత్రపిండాలను  , పిత్తకోశాన్ని శుద్ధి చేస్తుంది ,  వేడిని తగ్గిస్తుంది .

                                                                  23-8-11

      ఒక గ్లాసు నీళ్ళలో పిడికెడు ఉలవలను , కొన్ని వెంపలి మొక్క వేర్లను వేసి మరిగించాలి . కొద్ది సేపు కాచిన తరువాత
వడకట్టి  ఆ నీటిలో పావు స్పూను సైంధవ లవణం కలుపుకొని తాగాలి . ఈ విధంగా చేస్తూ వుంటే మూత్ర పిండాలలో రాళ్ళు
కరిగిపోతాయి .
                                         మూత్ర పిండాల సమస్య  --- నివారణ                            27-8-11.

      మూత్ర పిండాలలో ఎటువంటి సమస్య ఏర్పడినా , మురిగిపోయినా గరికను రసం రూపం లో గాని లేదా పచ్చడి రూపంలో  గాని   లేదా ఏ విధంగా నైనా సేవిస్తే  సమస్య నివారణ నివారింపబడుతుంది
            
                                          మూత్ర పిండాలలో రాళ్ళు --- నివారణ                          8-9-11.

    ఒక సారి ఈ రాళ్ళు ఏర్పడితే  ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ , మళ్లీ ఏర్పడుతూ వుంటాయి  మూత్రంలోని ఖనిజ
పదార్ధాలు గట్టి పడి రాళ్ళు గా మారతాయి

అరటిబోదె                     --- 100 gr
మజ్జిగ                           ---   50 ml
సైంధవ లవణం                ---      3 gr
నీళ్ళు                           ---    50 ml ( అర కప్పు )

     అరటి బోదె ను నీటిలో నానబెట్టి , చిన్న ముక్కలుగా తరిగి మిక్సి లో వేసి తిప్పి తీసి రసం తీయాలి . తరువాత
దీనిలో మిగిలిన పదార్ధాలను  కలిపి తాగాలి .  ఈ విధంగా రెండు , మూడు నెలలు తాగితే రాళ్ళు కరిగిపోతాయి . మరలా
ఏర్పడవు .

సూచన :--- పాలకూర తినకూడదు .








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి