కృతఙ్ఞతలు

వివిధ టీ వీ చానల్స్ లో వచ్చిన ఆయుర్వేద సంబంధ కార్యక్రమాల సారాంశాన్ని నోట్స్ వ్రాసుకొని వాటిని ఇంటర్నెట్ లో పెట్టాలనే నా ఈ చిన్న ప్రయత్నం. టీ వీ లలో ఆయుర్వేదాన్ని గురించి వివరించిన అందరికీ కృతజ్ఞతలు.

ఇందులో ఏవైనా తప్పులు వుంటే తెలుపగలరు వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తాను.

అభినందనలతో,
సల్మా టీచర్

నాలుక --సమస్యలు --నివారణ

నాలుక --- సమస్యలు -----నివారణ (28-11-08)

చిరునాలుక --లేదా --   కొండనాలుక
           శిరస్సు లో పుట్టిన కఫం చిరునాలుక  వద్ద చేరి పొడి దగ్గు వస్తుందినస ఉంటుంది
యోగాసనాలు:--- 
1. శీత్కారి ప్రాణాయామం :-- 
1.పెద్ద నాలుకను పైకి కొండ నాలుక వైపు మడవాలిపళ్ళు బిగబట్టి గాలి పీల్చి నోరు మూసి ముక్కు ద్వారా వదలాలి .
ఇది కనీసం 12  సార్లు చేస్తే తగ్గి పోతుంది.
2. నాలుకను బాగా పూర్తిగా మూయడం, తెరవడం చెయ్యాలి
3.నోరు పూర్తిగా మూయడం , తెరవడం చెయ్యాలి.
4.  ఒక కప్పు ఆవు పాలలో  పావు చెంచా కలకండ ,పావు చెంచా పసుపు వేసి వీలైనంత వేడిగా తాగాలి
5. పాలుపెరుగుమజ్జిగ  గేదెవి వాడకూడదు. ఆవు పాలతో మాత్రమే వాడాలి. ఆవు మజ్జిగలో మెంతిపొడి 
పసుపుఎర్రగడ్డలు  వేసి మజ్జిగ చారు వాడితే చిరునాలుక తగ్గి పోతుంది
6. వేడిగా ఉన్న మిరియాల చారు (ఎక్కువ ఘాటు లేకుండా) తో వేడి వేడి అన్నం తింటే తగ్గుతుంది.
చిన్న పిల్లలు తినలేకపోతే అరటి పండును తీసుకొని దానిలో రంధ్రం చేసి పిల్లలకైతే 3 చిటికెలు , పెద్దలకైతే
6 చిటికెలు మిరియాల పొడి వేసి తినిపించాలి.
7. బొటన వ్రేలును తడుపుకొని మిరియాల పొడి అడ్డుకోవాలి. నోటిని అంగిలివరకు తెరచి కొండనాలుకకు తగిలేటట్లుగా అద్దాలి. మూడు పూటలా చేస్తే ఒకటి ,రెండు రోజులలో తగ్గిపోతుంది.
8.ఒక కప్పు పాలల్లో రెండు గ్రాముల శొంటి, రెండు గ్రాముల పసుపు కలుపుకొని తాగాలి.

నాలుక మీద పగుళ్ళు---టంకన   భస్మం(18-2-11)
వేలిగారాన్ని (టంకనం) శుద్ధి చేసి నాలుక మీద పూయాలి. అరగంట తరువాత కడగాలి. మింగినా పరవాలేదు. కాని మింగ వలసిన పరిష్టితి  వస్తే  రెండు గ్రాములు కంటే ఎక్కువగా వాడకూడదు.

నాలుకపై వచ్చే పొక్కులు  (18-6-11)
     
అతిగా వేడి చేయ్యడం వలన వస్తుంది.
అతిమధురం చూర్ణం నీళ్ళలో వేసి కాచి  నీటితో పుక్కిలించాలి.  

క్షయ వ్యాధి

                                   క్షయ  వ్యాధి --నివారణ                                                   25-11-10

     వర్ధమాన పిప్పలి యోగాన్ని పాటించాలి.
           
     ఇది               అను అంశము లో చేర్చబడి యున్నది.

మెదడు

                               మెదడు వాపురాకుండా కాపాడుకోవడానికి  -                     19-2-10

       -    ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా చిన్న పిల్లలలో, అరుదుగా పెద్దలలో వస్తుంది.

తులసి ఆకులు              ---- పది
మిరియాలు                   ---- పది
జిలకర పొడి                   ---- రెండు, మూడు చిటికెలు
ధనియాల  పొడి               ----                "
అల్లం                              ---- రెండు గ్రాములు

      అన్నింటిని దంచి రెండు కప్పుల నీటిలో వేసి మరిగించి ఒక కప్పుకు రానివ్వాలి. దీనిని రెండు పూటలా తాగాలి.  ఇది మెదడు వాపు రానివ్వకుండా కాపాడుతుంది. శక్తిని ఇస్తుంది.

                               మెదడు వాపు--నివారణ                             18-11-10.

       మెదడుకు సరిపడినంత రక్తం సరఫరా కాక పోవడం వలన మెదడు అదుపు తప్పుతుంది. మొద్దుబారినట్లు శరీరంలోని అన్ని భాగాలు పని చేయనట్లు, కదిలించలేనట్లుగా తయారవుతాయి.

  ఇది చాలా తీవ్రమైన వ్యాధి.

చందనాది వటి
బిల్వాది వటి
రస సింధూరం
చందనాది తైలం
బిల్వాది తైలం

       పై వానిలో ఏదో ఒక దానిని వాడవచ్చు.

తిప్ప తీగ పొడి             --- 50 gr    వెంటనే  ఈ పొడిని గాని లేదా దీని కషాయాన్ని గాని  ఇస్తే తీవ్రత తగ్గుతుంది.
శతావరి వేర్ల పొడి         --- 50 gr
నేలవేము మొక్క పొడి --- 50 gr
ఎర్ర చందనం పొడి        --- 50 gr
వంశ లోచనం             ---- 50 gr  ( వెదురుప్పు )
సోమిడి చెక్క పొడి      ----  50 gr  ( సోమింత = మాంస రోహిణి )

        అన్నింటిని విడివిడిగా దంచి  చూర్ణాలు చేసి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

        పూటకు ఒక టీ స్పూను పొడి చొప్పున ఉదయం, మధ్యాహ్నం,  రాత్రి తేనెతో కలిపి తీసుకోవాలి.    లేదా బటాణి  గింజంత మాత్ర వాడాలి.

        ఇది జ్వర తీవ్రతను,  నొప్పులను తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.

వెన్ను పూస

                                 వెన్ను నొప్పి ----నివారణ                                        30-11-10.
 
వక్క చెట్టు ఆకులు            --- పావు కిలో
నువ్వుల నూనె                 ---  ఒక కప్పు
 
   ఆకులనుదంచి  నూనెలో వేసి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. ఆ నూనెలోఒక చిన్న గుడ్డను
 ముంచి వెన్ను మీద పరచాలి.  దీని వలన వెన్ను నొప్పి తగ్గుతుంది.
 
                               వెన్ను నొప్పి -- నివారణ                                        25-10-10.

          ఆరోగ్యవంతమైన  మానవుడు  తొమ్మిది టన్నుల బరువును మాత్రమే మోయగలడు.

         ఈ   వ్యాధి   1.  ఎసిడిటి వలన రావచ్చు.  2. వాతము వలన రావచ్చు.

దుంప రాష్ట్రం                ----   100 gr
పుష్కర మూలం          ----   100 gr
              శొంటి            ----     50 gr
       మిరియాలు          ----     50 gr
            వెల్లుల్లి             ----    50 gr
త్రిఫల చూర్ణం               ----   100 gr
సైంధవ లవణం            ----     25 gr
తిప్ప తీగ                    ----     50 gr

     అన్ని పదార్ధాలను విడివిడిగా చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.  శొంటి ని ఆముదంలో వేయించాలి.

తగినంత నీరు కలిపి బాగా నూరి బటాణి గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టాలి.

    పూటకు రెండు మాత్రల చొప్పున ఉదయం సాయంత్రం ఆహారం తరువాత తీసుకోవాలి.

    తరువాత బల్ల పరుపుగా వున్నచోట లేక చాప లేక బల్ల మీద పడుకోవాలి.


దవడలు

                      దవడలు పట్టెయ్యడం --నివారణ                                          16-10-10 .
 
                                       వెల్లుల్లి పాయల ముద్ద                                       
                                       సైంధవ లవణం
                                       నువ్వుల నూనె   
 
                                అన్నింటిని కలిపి నూరి మింగాలి.

  

తొడల లో కొవ్వు కరిగించడానికి

                                  తొడల సమస్య ---నివారణ                         28-1-09.
వ్యాయామం :--
 
1. రెండు పాదాలను ఒకదానితో మరొక దానిని ఆనించి తుంటి,మోకాళ్ళు, పొట్ట, నడుము కదిలేటట్లు మోకాళ్లను  సీతాకోక చిలుక రెక్కల్లాగా ఆడించాలి.దీనితో సన్నగా వున్న తొడలు లావుగా, లావుగా వున్న తొడలు సన్నగా అవుతాయి.     మూలాధార చక్రం శక్తివంత మవుతుంది.
 
2. కాళ్ళను చక్కగా చాపుకొని కూర్చొని గాలి పీల్చి వదలాలి.రెండు కాళ్ళను తొడలు పట్టుకు పోయేటట్లు గట్టిగా  బిగించాలి.బిగిస్తూ,వదుల్తూ కదిలించాలి.
 
3. వెనక్కి పడుకొని ఒక కాలు తో సైకిలు తొక్కినట్లు ఆడించాలి.రెండవ వైపు కూడా అదే విధంగా చెయ్యాలి.
 
  రెండు కాళ్ళతో కూడా సైకిలు తొక్కినట్లు చెయ్యాలి.ముందుకు వెనక్కు తొక్కాలి.

             తోడలలో, పిరుదులలో క్రొవ్వు తగ్గించడానికి ---వ్యాయామం                              2-9-09.

1. పవనముక్తాసనం:--     2. నౌకాసనం

    ఒక్కొక్క ఆసనానికి మధ్య కొంత  విశ్రాంతి అవసరం.

ఆహారం:--   సూప్

   ఒక పాత్ర తీసుకొని దోసకాయలు, బీట్ రూట్, పెద్ద చిక్కుళ్ళు, కారెట్, కాలిఫ్లవర్ , టమేటాలు
మొదలైన వాటినివేసి సరిపడినన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఉడికేటపుడు కొత్తిమీర,
 పుదీనా ,కరివేపాకు  సగం వుడికినతరువాత  మిరియాల పొడి, సైంధవ లవణం నలగగొట్టిన చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా ఉడికించాలి. బాగా వుడికిన తరువాత నీళ్ళు వడకట్టి కొంచం కొంచంగా తాగాలి. కావాలంటే  ఆ ముక్కలను కూడా తినవచ్చు.

    దీని వలన ఆకలి తగ్గుతుంది. శక్తినిస్తుంది.  ముఖ్యంగా తోడలలో కొవ్వు ఖచ్చితంగా కరుగుతుంది. కొవ్వు  కరిగించడంలో సైంధవ లవణం కొవ్వును కరిగించడంలో బాగా ఉపయోగ పడుతుంది.

    వర్షపు నీటిని 6 నెలల వరకు సరి పడా ఉండేట్లుగా కుండల్లో నిల్వ చేసుకోవాలి. అర గ్లాసు వర్షపు నీటిలో  చిటికెడు పసుపు కలుపుకొని ప్రతి రోజు తాగుతూ వుంటే శరీరం సన్నగా, నాజూకుగా, అందంగా తయారవుతుంది.

    ఉలవ గుగ్గిళ్ళ ను  ప్రతి రోజు తింటూ వుంటే నెలకు  4,5 కిలోల బరువు తగ్గుతారు. ఉలవలు తినడం వలన వేడి చేస్తే పలుచని మజ్జిగ తాగాలి.

                                         తొడల లో క్రొవ్వు తగ్గించడానికి                               30-5-11.

      ఈ సమస్యలో తుంటి భాగం కూడా పెరుగుతుంది . 

కారణాలు :-- ముఖ్యంగా కొవ్వు పదార్ధాలు , స్వీట్లు , ఉప్పు ఎక్కువగా వున్నపదార్ధాలను ఎక్కువగా వాడడం వలన కొవ్వు పెరుగుతుంది .
      నీరు ఎక్కువగా తాగాలి . 

1.     పుట్ట మన్ను తెచ్చి నీళ్ళు కలిపి పేస్ట్ లాగా చేసి తొడల మీద పట్టించాలి . ఇది లావును, వాపును   తగ్గిస్తుంది
        ఈత మంచిది .

 2    కానుగ కాయల పప్పు         
         ఆవాలు
        గోమూత్రం
                        అన్నింటిని కలిపి నూరి గోరువెచ్చగా చేసి పోయాలి

3.    వావిలి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తొడల మీద ధారగా పోయాలి .  దీనివలన
       కొవ్వు కరుగుతుంది .

4.   రెండు కాళ్ళ మధ్య దిండును పెట్టి గట్టిగా నొక్కాలి .

5.   తొడ కండరాలను పైకెత్తాలి .  పక్కకు తిరిగి పడుకొని కాలును పైకెత్తాలి  .








పిత్తాశయము (గాల్ బ్లాడర్ )

                   పిత్తాశయము (గాల్ బ్లాడర్ ) లో రాళ్ళు--నివారణ            25-5-10.
 
       అతి ముఖ్యమైన గ్రంధులలో కాలేయము ఒకటి.ఇది పైత్య రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. పైత్యరసాన్ని పిత్తాశయము నిల్వ చేస్తుంది. పిత్తాశాయములో ఒక్కో సారి రసము గట్టి పడి రాళ్ళు లాగా మారుతుంది.

  గాల్ బ్లాడర్  లో Bile juice, bile salts, కొవ్వు కణాలు, నీరు  వుంటాయి. గాల్ బ్లాడర్ లో సరిగా కదలికలు లేకపోవడం గోడలు గట్టి పడడం, పదార్ధములో మార్పుల వలన రాళ్ళు ఏర్పడతాయి.

ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క కదలికల తేడాల వలన సమస్యలు ఏర్పడతాయి.
 
మద్యపానం అలవాటు, మధుమేహ వ్యాధి వున్నవాళ్ళలో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
 
ఒబేసిటీ ని అకస్మాత్తుగా తగ్గించడం వలన కూడా సమస్య ఏర్పడుతుంది.
 
లక్షణాలు;-- సమస్య వున్నవాళ్ళకు అన్నం తిన్న వెంటనే పొట్టలో కుడి పక్క నొప్పిగా వుంటుంది. కడుపు ఉబ్బరింపు, వాంతులు కావడం, మలము నల్లగా రావడం, చలి జ్వరం, పచ్చకార్లు రావడం జరుగుతుంది. వీపు మీద నొప్పి రావడం జరుగుతుంది.
 
                                                        నారికేళ లవణం
 
    లేతగా కాకుండా, ముదురుగా కాకుండా మధ్యరకంగా వున్న కొబ్బరి కాయను తీసుకోవాలి. దాని పై వున్న పీచును తొలగించి ఒక కంటిలో రంధ్రం చెయ్యాలి. కాయలోని నీళ్ళను తీసేయ్యాలి. కొబ్బారి కాయను సైంధవ లవణం పొడితో నింపాలి.
 
      ఒక పలుచని గుడ్డను తీసుకొని మెత్తటి బంకమట్టి పూసి టెంకాయ కనబడకుండా గుడ్డను చుట్టాలి. బాగా ఆరనివ్వాలి. 10 15 ఆవు పిడకలు తెచ్చి కొబ్బరి కాయ చుట్ట్టు పేర్చి పుటం వెయ్యాలి. పుటాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత మట్టిని తొలగించి కాయను పగులగొట్టి కొబ్బరిని తీయాలి. కొబ్బరి మాడి వుంటుంది.
దానిని పొడి చేసి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
      పావు టీ స్పూను పొడిని అరగ్లాసు మజ్జిగలో కలిపి ఆహారానికి ముందుగాని, తరువాతగాని సేవించాలి.
విధంగా నెల రోజులు వాడితే ఆపరేషన్ అవసరం లేకుండా నివారించుకోవచ్చు.
 
దీనిని వాడడం వలన అజీర్ణము, పరిణామ శూల మొదలగునవి నివారింప బడతాయి. గాస్త్రిక్ ఎంజైమ్స్ సరిగా ఉత్పత్తి అయ్యేట్లు చేస్తుంది.
 
పరిణామ శూల అనగా అన్నము తిన్న తరువాత క్రమం తప్పకుండా కడుపులో నొప్పి రావడం.

                                         పిత్తాశయం ఆరోగ్యంగా ఉండాలంటే                              13-6-11.

జాజికాయ
జాపత్రి
పచ్చకర్పూరం

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నూరి నిల్వ చేసుకోవాలి.

       ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కందిగింజంత మాత్ర వేసుకోవాలి. ఈ విధంగా 40 రోజులు
వాడాలి.

వాత, పిత్త, కఫ దోషాల నివారణ

                    వాత, పిత్త, కఫ దోషాలను తొలగించే ఆయుర్వేద కారం పొడి             27-6-09.

                                                 కరివేపాకు పొడి               ---10 gr
                                                 జిలకర పొడి                   --- 10 gr
                                                మిరియాల పొడి             ---- 10 gr
                                                ధనియాల పొడి               --- 10 gr           
                                                సైంధవ లవణం పొడి        --- 10 gr
                                                లవంగాల పొడి                 ---  5 gr

       సైంధవ లవణం తప్ప మిగిలిన పదార్ధాలను దోరగా వేయించి విడివిడిగా పొడులు దంచి సైంధవ లవణం కలిపి  సీసాలో నిల్వ చేసుకోవాలి.

       దీనిని అన్నం లో కలుపుకొని తినాలి.

       ఇది శరీరంలో వాత, పిత్త, కఫదోషాలను  తొలగించి  శరీరాన్ని  సమ స్థితిలో   ఉంచుతుంది.   చెడు వాయువులను తొలగిస్తుంది   గడ్డలుగా వున్నకఫాన్ని  కరిగిస్తుంది.

                    వాతజ , పిత్తజ , కఫజ  కారణాల వలన ఏర్పడే సన్నిపాతజ సమస్య     4-6-11.
                                          మరియు చాతీనోప్పి --- నివారణ

చాతీ నొప్పి  రావడానికి గల కారణాలు :--- ఊపిరితిత్తుల సమస్య,  అన్నవాహికలో సమస్య, గ్యాస్
సమస్య ,  అధిక శ్రమ చేయడం, ఎముకలలో, కండరాలలో బలం లేకపోవడం , శరీర వ్యవస్థలో
లోపాలు , శరీరంలో రోగాలు ఉండడం మొదలైనవి .

వాతజ, పిత్తజ , కఫజ  సమస్యల వలన ఏర్పడే సన్నిపాతజ  సమస్య ;--

వాతజ:-- శరీరంలో  కోసినట్లు వుండడం
పిత్తజ :-- శరీరంలో మంటలుగా వుండడం, చెమట పట్టడం, నోరు ఎండిపోవడం
కఫజ :-- శరీరం భారంగా వుండడం, నోటిలో తియ్యదనం ఊరడం, నోటిలో మ్యూకస్ పేరుకున్నట్లు
వుండడం .
        శరీరంలో  ఈ మూడు లక్షణాలు కలిసి వుంటే దానిని సన్నిపాతజ  సమస్య అంటారు .

        కేవలం శ్రమ వలన  లేదా కండరాల నొప్పుల వలన అనగా నీరసం వలన వచ్చే చాతీ నొప్పిని
మాత్రమె నివారించడానికి :--   

ఎండుద్రాక్ష                    ----100 gr
ఏలకుల పొడి                ----  25 gr
శొంటి పొడి                    ----  25 gr
కరక్కాయ పెచ్చుల పొడి ---  25 gr
పిప్పలి కట్టె పొడి            ---- 25 gr
వస పొడి                      ---- 25 gr

      ఎండుద్రాక్ష పేస్ట్ లో అన్ని చూర్ణాలను కలపాలి . దీనికి తేనె , నెయ్యి కలుపుకోవచ్చు. తేనె , నెయ్యి కలిపెటపుడు  నెయ్యి తక్కువగా, తేనె ఎక్కువగా కలపాలి . దీనితో లేహ్యం తయారవుతుంది
దీనిని సీసాలో నిల్వ చేసుకోవాలి .   ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తయారు చేసుకోవాలి . 

      ప్రతి రోజు వాడితే చాతీ నొప్పి తప్పక నివారింపబడుతుంది.
      ప్రతి రోజు ఉదయం , సాయంత్రం ఆహారానికి ముందు వాడాలి .