గర్భిణి

                                                     సుఖ ప్రసవానికి  
 
               నెలలు నిండిన తరువాత ఎడమ చేతిలో అయస్కాంతాన్ని పెట్టాలి.అన్నం వార్చిన గంజిలో కొద్దిగా
కల్లుప్పు,కొద్దిగా పొంగించిన ఇంగువ పొడి కలిపి తాగిస్తే 10 లేక 15 నిమిషాల్లో సుఖ ప్రసవం జరుగుతుంది.

                                                గర్భ ధారణ సమయాలు
 
1. తెల్లవారుజామున  4 గంటల నుండి  8  గంటల వరకు :---
    సాయంత్రం            "    "           "       "     "          "      :--
 
    సత్వ గుణము, ప్రశాంత గుణము కలిగిన పిల్లలు పుడతారు.
 
2. ఉదయం  8 గంటల నుండి మధ్యాహ్నము  12 గంటల వరకు :-- 
    రాత్రి         "    "          "      అర్ధ రాత్రి            "     "           "     :--
 
    ఇది రజో కాలం ,రజోగుణము అనగా తీవ్రమైన కోపము, అహంకారము కలిగిన పిల్లలు పుడతారు.
 
3. మధ్యాహ్నము   12  గంటల నుండి సాయంకాలము 4 గంటల వరకు :--            
    అర్ధ రాత్రి             "       "          "  తెల్లవారు జామున  "    "          "     :--
 
    ఇది రాక్షస కాలం.తీవ్ర ఆవేశ ,కావేషాలు, మదమాత్సర్యాలు కలిగిన పిల్లలు పుడతారు.
 
సాత్విక గుణ సంతానము కొరకు తీసుకోవలసిన ఆహారము:--

  ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు, తీపి , ఉన్న పదార్ధాలను కొద్ది మోతాదులో తీసుకోవాలి. మాంసాహారం ముట్టకూడదు.పాలు త్రాగాలి.
 
   రాజస సంతానానికి తీసుకోవలసిన ఆహారం :-- పై పదార్ధాలు మరియు శక్తి వంతమైన ఆహారం తీసుకోవాలి.

                          గర్భిణి స్త్రీలలో ఆకలిని పెంచే పానీయం.                                22-2-09  
 
                                        మైత్రేయి మధుర పానీయం
 
                             నిమ్మరసం                                    ---100 gr
                             బత్తాయి రసం                              --- 100 gr
                             పుల్ల దానిమ్మ రసం                      ---  100 gr
                             అల్లం రసం                                  ---  100 gr
                             పుదీనా రసం                               ---  100 gr
                             నీళ్ళతో నూరిన ధనియాల రసం     ---  100 gr 
                             వేయించి నూరి తీసిన జిలకర రసం      --100 gr
                             మంచి తేనె                                  ---- పావు కిలో
                            సైంధవ లవణం                               ----100 gr
                            చక్కర                                         ---- ఒకటిన్నర కిలో .
 
            తేనె తప్ప మిగిలిన పదార్ధాలను అన్నింటిని ఒక పెద్ద గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేవరకు  కాచాలి.దించి చల్లారిన తరువాత తేనె కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
 
           ప్రతి రోజు రెండు స్పూన్ల పాకాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగితే ఆకలి బాగా పుడుతుంది.
 
           ఒకవేళ పాకం ముదిరిపోతే ఒక స్పూను పాకాన్ని తీసి బుగ్గన పెట్టుకొని చప్పరించాలి.
 
           అన్నాన్ని చూస్తే వాంతి వచ్చినట్లు వుండడం, అన్నం తినాలనిపించక పోవడం,ఆకలి లేకపోవడం వంటి  లక్షణాలు కలిగిన వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
 
          దీనిని చిన్నపిల్లలకు కూడా ఆకలి మందిగించినపుడు ఆకలి కావడానికి వాడవచ్చు .
 
                                      పెద్దవాళ్ళకు                 ----- రెండు స్పూన్లు
                                     గర్భిణీ  స్త్రీలకు                -----మూడు పూటలా పూటకొక్క స్పూను
 
        దీనిని అందరు వేసవి కాలపు పానీయం లాగా కూడా వాడుకోవచ్చు.
                            
                               గర్భిణి స్త్రీ తీసుకోవలసిన జాగ్రత్తలు                8-05-09

వ్యాయామం  :
 
కుర్చీలో కూర్చొని కాలుని చాపి వేళ్ళు కదిలించడం, కాలిని గుండ్రంగా తిప్పడం కాలుని మోకాలి ఫై భాగం లో పట్టుకొని గుండ్రంగా తిప్పాలి. రెండు కాళ్ళని కొంచెం ఎడంగా పెట్టి మరల రెండు కాళ్ళను దగ్గరకు తీసుకురావాలి.
 
కాలుని సైకిల్  తిక్కినట్టు కదిలించాలి.
 నిలబడి నెమ్మదిగా గాలి పీల్చాలి.
చేతులు పైకి ఎత్తి రెండు అరచేతులను పైకి పెట్టి నడుమును నెమ్మదిగా ఎడమవైపుకు,కుడివైపుకు వంగడం, రెండు చేతులను గాలి పీలుస్తూ పైకి లేపడం, వదులుతూ కిందకి దించడం, మెల్లగా నడుమును గుండ్రంగా తిప్పడం చేయాలి.

 రెండు కాళ్ళు కొంచెం ఎడంగా పెట్టాలి. కొద్దిగా కూర్చున్నట్లు చేసి పైకి లేవడం  చేయాలి. దీని వలన అన్ని అవయవాలకు పరిమితమైన వ్యాయామం అందుతుంది.
 
ఆహార నియమాలు :
 
చందనం                                                    ---- 10 gm
సుగంధ పాలవేళ్ళు                                       ----10 gm
ద్రాక్ష                                                         ---- 10 gm
లోద్దుగ చెక్క                                               ----10 gm
 
   పై వాటిని అర లీటరు నీటిలో వేసి మరిగించి సగానికి రానిచ్చి వారం రోజులు తాగితే ఎటువంటి జ్వరమైన తగ్గుతుంది.
                                                        లేక
ఒక గ్లాసు మేక పాలలో రెండు స్పూనులు  (5gm)సొంటి పొడి వేసి కాచి తాగితే ఎటువంటి జ్వరమైన తగ్గుతుంది. 
 
                                               గర్భిణి స్త్రీ చేయవలసిన సౌందర్య లేపనం

తేనె
అతిమధురం
వేపాకులు
కొమ్ముపసుపు
కలువపువ్వు రేకులు
 
    పై వన్నీ సమపాళ్ళలో కలువపూలరేకులు ఎండలో ఆరబెట్టి పొడి చేయాలి, వేపాకులు ఆరబెట్టి పొడి చేయాలి, అన్నింటి (4) పొడులను కలిపి సీసాలో భద్రపరచాలి. ఈ పొడిని కొంచెం తీసుకొని దానిలో తేనె కలిపి మైనం లాగ తయారు చేయాలి దీన్ని ముఖానికి, మెడ మీద రుద్దుకోవచ్చు లేదా శరీరము అంతా పూసుకోవచ్చు.
 
     పై పదార్ధాలను అన్నింటిని నీటితో దంచి రసం తీసి నువ్వుల నూనెలో వేసి కాచి ఆ నూనెను భద్రపరచుకొని పూసుకోవచ్చు.

                    గర్భిణి స్త్రీలు చేయ వలసిన వ్యాయామం                                       11-5-09.

     వేళగాని వేళ తినడం వలన అజీర్ణము, అగ్ని మాంద్యము వంటి వ్యాధులు వస్తాయి. దీని వలన పైత్యం  ప్రకోపించి వాంతులు ఎక్కువవుతాయి.

     భోజనం తరువాత 100 అడుగులు మామూలుగా, ఖచ్చితంగా నడవాలి. తరువాత వజ్రాసనంలో పది  నిమిషాలు కూర్చోవాలి.  కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్ధించాలి.

     శీతలి, శీత్కారి, చంద్రభేదన ప్రాణాయామం లను సుఖాసనంలో కూర్చొని గాని లేదా అర్ధ పద్మాసనంలో గాని చెయ్యాలి.

చంద్ర భేదన ప్రాణాయామం:--

 ఎడం ముక్కునుండి గాలిని పీల్చి చాలా నెమ్మదిగా కుడి ముక్కునుండి వదలాలి.
దీని వలన పైత్యం, వాంతులు తగ్గుతాయి.

శీతలి ప్రాణాయామం-- నాలుకను దొన్నె లాగా మడిచి గాలిని నెమ్మదిగా పీల్చి  బంధించి  రెట్టింపు సమయంలో వదలాలి.

శీత్కారి ప్రాణాయామం:-- నాలుకను మడిచి గాలి పీల్చి నోరు మూసుకొని ముక్కుద్వారా  గాలిని వదలాలి.
ఆహార నియమాలు:-- అతివేడి పదార్ధాలు అంటే మాంసం, మసాలాలు మరియు అతి చల్లని పదార్ధాలు భుజించ రాదు.

రక్తం తగ్గకుండా తీసుకోవలసిన ఆహారం:--

  పాలిష్ తక్కువగా వున్న పాత బియ్యాన్ని వాడాలి.  ఆకుకూరలు, ఏరోజుకారోజు తాజా కూరగాయలు తినాలి.

ఆహారాన్ని నులివెచ్చగా భుజించాలి. పెరుగు వాడకూడదు. బాగా పుష్కలంగా మజ్జిగ వాడాలి.
    ఆకలి సహజంగానే మందగిస్తుంది.

                                  వామ్ము               --- 50 gr
                                  జిలకర                --- 50 gr
                                  శొంటి                  --- 50 gr
                                  పిప్పళ్ళు             --- 50 gr

   అన్నింటిని విడివిడిగా దోరగా వేయించి జల్లించి పోడులుగా చేసి కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.
    పావు టీ స్పూను పొడిని ఒక టీ స్పూను తేనె కలిపి రంగరించి ఆహారానికి ఒక గంట ముందు ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఆహారం చాలా సులభంగా జీర్ణమవుతుంది.

వాంతులు రాకుండా ఉండాలంటే ;-- 

      40 గ్రాముల ధనియాలను నలగగొట్టి అర లీటరు నీళ్ళలో వేసి స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద అర గ్లాసు కషాయానికి రానివ్వాలి. దించి వడపోసి కలకండ కలిపి ఉదయం సగం, సాయంత్రం సగం తాగితే వాంతులు   తగ్గి పోతాయి.

                 గర్భం పోతుందనే అనుమానం వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు

వరి పేలాల పిండి( బొరుగుల పొడి)           --- 10 gr
అతిమధురం పొడి                                 --- 10 gr
చక్కెర గాని కలకండ గాని                      ----10 gr
తేనె                                                  ----10 gr
నెయ్యి                                              ----10 gr
పచ్చి ద్రాక్ష రసం                                 ----50 gr

     అన్నింటిని కలిపి పెట్టుకొని ఉదయం, సాయంత్రం వాడితే రక్త స్రావం వంటివి ఆగిపోతాయి.  వేడి చేసే పదార్ధాలు వాడకూడదు.

         ఒక గర్భానికి  మరొక గర్భానికి మధ్యలో విరామం కావాలంటే                             2-10-10.

       ప్రతి రోజు మూడు గ్రాముల దాల్చిన చెక్క పొడిని పాలలో  కలుపుకొని తాగుతూ వుంటే  తరువాత
గర్భం ఆలస్యంగా వస్తుంది.
    
                              గర్భధారణ సమయం లో స్త్రీ సౌందర్యాన్ని పెంచే ఔషధాలు                  18-8-11.

సమస్యలు రావడానికి కారణాలు :--- హార్మోన్లలో హఠాత్తుగా మార్పులు రావడం , శరీరం లో నీరు చేరడం ,  బరువులో
హఠాత్తుగా మార్పులు రావడం ,  ఒత్తిడి , భయం తాలూకు  REFLECTION ముఖంలో కనిపించడం  మొదలైనవి .
తొడలు , పిరుదులు , ముఖం మీద మచ్చలు , చారలు ఏర్పడడం  మొదలైనవి .

కీరదోసకాయ రసం                   --- ఒక టేబుల్ స్పూను
పాల మీగడ                            --- ఒక టీ స్పూను
పసుపు పొడి                           --- ఒక టీ స్పూను
శనగ పిండి                             --- ఒక టేబుల్  స్పూను
ముల్తాని మట్టి                        --- ఒక టేబుల్ స్పూను

    ఒక  గిన్నెలో అన్ని పదార్ధాలన్ ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలపాలి .
    దీనితో మచ్చల మీద , చారల మీద  ఒక గంట వుంచి కడగాలి . దీనిని మంగు మచ్చల మీద కూడా పూయవచ్చును
కొంతసేపు వుంచి , వేడి నీటితో కడగాలి .ఈ విధంగా 2, 3 రోజులకొకసారి చెయ్యాలి .

సూచన :--- NUTRIENTS తీసుకోవాలి . క్యాలరీలు ఎక్కువగా వున్న  పదార్ధాలను తీసుకోవాల్సిన అవసరం లేదు

                  పుట్టబోయే బిడ్డ ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డ మాత్రమె పుట్టడానికి ఔషధాలు      30-8-11.

మర్రి చెట్టు వూడల చిగుళ్ళు         ---- 10 gr
             ఆవు పాలు                   ---- ఒక టేబుల్ స్పూను

         మర్రి వూడలను ఆవు పాలను చిలకరిస్తూ నూరి రసం తీయాలి . ఈ రసాన్ని పుష్యమీ నక్షత్రం రోజున భార్య ముక్కులో వేయాలి. కుడి ముక్కులో వేస్తె మగ పిల్లవాడు ,  ఎడమ ముక్కులో వేస్తె ఆడ పిల్ల పుడతారు

                                    





                             








 

   
                            

                                                              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి