హోమం

                          హోమం ---ధూపం                               11-11-010.

వాయు విడంగాలు
సైంధవ లవణం
ఇంగువ
మహిషాక్షి గుగ్గిలం ( అర  గ్రాము  )
వస

    అన్నింటిని దంచి  చూర్నాలు చేసి అన్నింటి నుండి కొద్ది కొద్దిగా తీసుకుని అన్ని గదులలో దూపంవేయాలి.

దీనితో ఇంటిలోని బాక్టీరియా నివారింప బడుతుంది.

                              దశాంగ ధూపం ---- ఉపయోగాలు                                           27-5-10.

     పిల్లలు అనారోగ్యంగా వున్నపుడు,   ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చినప్పుడు ,  గదిలో తేమ వాతావరణం వున్నపుడు    ఇంటిలో  వ్యాధులను కలిగించే  సూక్ష్మ జీవులు వుండే అవకాశం వుంటుంది.  దానిని నివారించదానికి     ఈ  ధూపం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

అతివిష
వస
శొంటి
మిరియాలు
పిప్పళ్ళు
గజ పిప్పళ్ళు
చిరుబొద్ది
వాయు విదంగాలు
సైంధవ లవణం
ఇంగువ

       అన్నింటిని చూర్ణాలు  చేసి కలిపి  డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

   పిల్లలు పాలు తాగిన తరువాత  ఈ పొడిని తగినంత తీసుకుని నిప్పులపై వేసి ఇల్లంతా   పొగను వ్యాపింప చేయాలి.

    దీని వలన  రకరకాల వ్యాధి కారక బాక్టీరియా నివారింప బడుతుంది.

     ఈ విధంగా రోజుకు ఎన్ని సార్లైనా చేయవచ్చు.  ముఖ్యంగా ఉదయం పూట వేస్తే మంచిది.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి