చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు





                                             శరీర దృఢత్వానికి అతిబల తైలం

      తిత్తిరి బెండ (దువ్వెన కాయల చెట్టు లేక అతిబల ) దీనిని సమూలంగా తెచ్చి ఎండబెట్టి పొడి చెయ్యాలి

తిత్తిరి బెండ పొడి              ------- 100 gr
వస కొమ్ముల పొడి               ------ 20 gr
నువ్వుల నూనె                 ------ 150 gr

   ఒక గిన్నె లో రెండు పొడులను,నువ్వుల నూనెను పోసి బాగా కలిపి మూడు రోజులు ఎండలో పెట్టాలి'    తరువాత ఒక గుడ్డలో వడకట్టాలి .   ఇదే పుష్టి వర్ధక తైలం.


   పిల్లలకు స్నానం చేయించడానికి అరగంట ముందు శరీరాని కి బాగా మర్దన చేస్తే బాగా దృడముగా తయారవుతారు.

                                                బాల రక్షక గుళికలు


బిడ్డ పుట్టిన తరువాత రకరకాల కాలుష్యాల నుండి రక్షింపబడడానికి :--

ఎండిన ఉసిరిక పెచ్చులు ------- 100 gr

       తగినన్ని నీళ్ళుపోసి మెత్తగా నిదానంగా నూరాలి. ముద్దగా అవుతుంది.దానిని ఒక ప్లేటులో వేసుకొని శనగ గిన్జలంత గోలీలు తయారు చెయ్యాలి. వీటిని నీడలో బాగా ఆరబెట్టాలి. తేమ లేకుండా నీడలో మాత్రమే  ఎండబెట్టాలి.

    34 సంవత్సరాలకు పైబడిన పెద్దవాళ్ళకు బటాణి గింజంత ,పసిపిల్లలకు పెసర గింజంత  మాత్రలు ఉదయం ,సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున ఇవ్వాలి. ఒకటి లేక రెండు తేనె చుక్కల్లో ముంచి తినిపించాలి.

దీని వలన దగ్గు, అంటువ్యాధులు, జలుబు,జ్వరాలు,చర్మవ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వెంట్రుకలు,  పళ్ళు కాపాడ బడతాయి. అనగా ఇది సర్వరోగ నివారిణి.

దీనిని పిల్లలకు రెండు సంవత్సరాలు నిండిన తరువాత నుండి వాడాలి.
వీటిని వాడడం వలన వెంట్రుకలు బాగా పెరుగుతాయి, కళ్ళ సమస్యలు, చర్మం ఎండిపోవడం, కాలేయ సమస్యలు,అజీర్ణం, జలుబు వంటి సమస్యలు నివారించ బడతాయి.

                                          పిల్లలలో మధుమేహ నివారణ                               17-2-09.
వ్యాయామం:--
యోగాముద్రాసనం:-- పద్మాసనం వేసుకొని, రెండు చేతులు వెనుకకు పెట్టుకొని, గాలి తీసుకుంటూ ఎడమ వైపుకు వంగి గాలి వదులుతూమధ్యలోకి రావాలి. ఇదే విధంగా కుడి వైపుకూడా చెయ్యాలి. విధంగా 20 సార్లు చేయాలి.

ఇదే ఆసనంలో వుండి గాలి పీలుస్తూ గడ్డాన్ని ఎడమ మోకాలుకు ఆనించి గాలివదులుతూ మామూలు స్థితి కిరావాలి. ఇదే విధంగా కుడి వైపు కూడా చెయ్యాలి.

గోముఖాసనం :--. ఎడమ మోకాలును కుడి మోకాలు మీద వుంచి కుడి చేతిని వెనుకకు వెన్నెముక మీదకు పంపి, ఎడం చేతితో వెనుక వున్న కుడిచేతిని అందుకోవాలి. ఇదే విధంగా కుడి మోకాలు మీద ఎడమ మోకాలను వుంచి చేయాలి.

ఆహారం:--
ఉసిరిక ముక్కలు       ---గుప్పెడు
మంచి నీళ్ళు           --- ఒక గ్లాసు
తులసి ఆకులు        --- నాలుగైదు

         ఒక గ్లాసు నీటిలో ఉసిరిక ముక్కలను,తులసి ఆకులను వేసి రాత్రంతా వుంచి ఉదయం ముక్కలు, ఆకులుతీసి నీళ్ళు తాగాలి. దీనివలన మధుమేహమే కాక చర్మ సమస్యలు, , మూత్రపిండాల సమస్యలు కూడానివారింప బడతాయి.

              ఒక గ్లాసు పాలలో గాని నీళ్ళలో గాని కొన్ని ఎండు ఉసిరిక ముక్కలను నానబెట్టి రుబ్బి శరీరమంతా పట్టించాలి  (తలనుండి పాదాల వరకు) ఒక గంట తరువాత స్నానం చేయించాలి. విధంగా చేస్తూ వుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. వెంట్రుకలు రాలవు.

                                            చిన్న పిల్లలలో ఆస్తమా


   రావి పండ్లను బాగా ఎండబెట్టి ,దంచి,వస్త్రగాయం పట్టి, దానికి సమానంగా కలకండ కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

చిన్న పిల్లలకు      ---చిటికెడు పొడిని తేనెతో నాకించాలి.

పెద్దలకైతే             ---2,3 చిటికెలు.

      దీనివలన ఊపిరి తిత్తులలో పేరుకున్న కఫం తొలగించ బడుతుంది.తెలివితేటలు, ఆయుష్షు పెరుగుతాయి.

                        చిన్న పిల్లలలో ఊపిరితిత్తుల సమస్య --నివారణ              25-2-09.

1. చిన్న పిల్లల నుండి 14 సంవత్సరాల వరకు :--

(a) రెండు చుక్కల అల్లం రసం
     రెండు చుక్కల తేనె

రెండింటిని కలిపి నాకిస్తే సమస్య నివారింప బడుతుంది.

(b) కొబ్బెర నూనెను వేడి చేసి దానిలో కర్పూరం కలిపి రంగరించాలి. రాత్రి పడుకునే ముందు చాతీ మీద,మెడ మీద, ముక్కుకు రెండు వైపులా, వీపు మీద రుద్దాలి.

2. 13,14 సంవత్సరాల పిల్లలకు :--

1. సూర్య నమస్కారం చేయాలి, చేసేటపుడు బొటన వేళ్ళు ముక్కు పై భాగంలో ఆనించాలి.

2. సూర్యునికి ఎదురుగా నిలబడి కాళ్ళ మధ్య ఒక అడుగు స్థలం ఉండేట్లు నిలబడి, చేతులు వెనక్కు పెట్టుకొనిమెడను వెనక్కు వంచి, గాలి పీలుస్తూ వదలాలి.

3. వీపుకు సూర్యరశ్మి తగలడానికి :-- సూర్యునికి ఎదురుగా నిలబడి కుడికాలును ముందుకు వంచి, ఎడమ కాలును వెనక్కు పెట్టి చేతులను పైకేత్తాలి. తలను దించి నేలకు ఆనించాలి.

4. ఉష్ట్రాసనం :-- మోకాళ్ళ మీద కూర్చొని మడమలను  రెండు చేతులతో వెనక వైపునుండి పట్టుకోవాలి.

5. ఒక చేతిని పూర్తిగా చాపి వుంచి దానియొక్క చూపుడు వేలును, మధ్య వేలును కలిపి రెండవ చేతితో రెండు వేళ్ళను నొక్కాలి.

ఆహారం:--

   శ్వాశకోశ వ్యాధులున్న వాళ్ళు పంచదార వాడకూడదు. కలకండ లేక తేనె వాడాలి. గేదె పాలు, పెరుగు, మజ్జిగవాడకూడదు. ఆవు పాలు, పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చు పాలు వాడేటపుడు దానిలో చిటికెడు పసుపు కలిపితాగాలి. మజ్జిగలో పసుపు, ఆవాలు, మెంతిపొడి కలిపి మజ్జిగ చారు తయారు చేసి ఇవ్వాలి.

      రాత్రి పూట అన్నం పెట్టకూడదు  దొడ్డు గోధుమ రవ్వ తో ఉప్మా, కూరలు కూరలు,తేనె తినిపిస్తే శ్వాశకోశవ్యాధులు రావు.

     రావి చెట్టు పండ్లు కడిగి, ఎండబెట్టి, దంచి, జల్లించి వస్త్రగాయం పట్టి చూర్ణం తయారు చేసి నిల్వ చేసుకోవాలి.దీనితో సమానంగా కలకండ కలిపి ఉంచుకోవాలి.

1,2 సంవత్సరాల పిల్లలకు ఒక చిటికెడు పొడిని తేనెతో రంగరించి ఇవ్వాలి.
3,4,5 సంవత్సరాల పిల్లలకు రెండు చిటికెల పొడిని తేనె తో ఇవ్వాలి.
6 సంవత్సరాల పైబడిన పిల్లలకు పావు టీ స్పూను పొడిని తేనెతో ఇవ్వాలి.

                  పిల్లలలో స్థూలకాయం తగ్గడానికి (కొవ్వు తగ్గడానికి)             1-5-09.

ఆహారనియమాలు:-- బయటి ఆహారం తినకూడదు .రాత్రి 7 గంటల లోపల భోజనం ముగించాలి.
పండ్ల రసాలు, కూరగాయల రసాలు ఎక్కువగా వాడాలి.

       మామిడి, సపోటా, అరటి కొవ్వును పెంచుతాయి. జామ, బొప్పాయి మొదలైనవి కొవ్వును తగ్గిస్తాయి.    ఉలవ గుగ్గిళ్ళు, పలుచని గంజి కొవ్వును చాలా బాగా తగ్గిస్తాయి.

    పాత బియ్యం, పాత గోధుమలు, యవలు,బార్లీ, పాత జొన్నలు అన్ని కలిపి నానబెట్టి ఎండబెట్టి
మర పట్టించాలి. దీనిని ఆహారం లాగా వాడుకోవాలి.

ఆహారం తరువాత 2,3 గంటలు మెలకువతో వుండాలి.
బజారు స్వీట్లు పనికి రావు. పాత బెల్లంతో తయారు చేసిన పదార్ధాలు మంచివి.
పాత బెల్లం, నువ్వులు, కొబ్బెర తో చేసిన ఉండలు ఎంతో మంచివి.

నెలకు 1,2 కిలోలు మాత్రమే బరువు తగ్గాలి. లేక పోతే శరీరం వేలబడి పోతుంది.

మర్దన :-- నువ్వుల నూనె గాని, ఆవనూనె వేడి చేసి గోరువెచ్చగా శరీరమంతా మర్దన చెయ్యాలి.


                 పిల్లలలో అంగవైకల్యాన్ని అరికట్టే వ్యాయామం                                  21-5-09.

చేతులలో, కాళ్ళలో శక్తి లేకుండా వాలి పోతుంటే ఓమ తైలం తో మర్దన చెయ్యడం చాలా శ్రేయస్కరం

వెన్ను పూసకు,తుంటి భాగంలో, కాళ్ళకు, చేతులకు మర్దన చెయ్యాలి. చేతుల యొక్క మణికట్టు లపైమర్దన చెయ్యాలి. వంకర పోయిన వేళ్ళ మీద గుండ్రంగా, నిలువుగా మర్దన చెయ్యాలి. ఎప్పుడు మర్దన చేసినాతైలాన్ని వేడి చేసి గోరువెచ్చగా మర్దన చెయ్యాలి. భుజం నుండి చేతి వేళ్ళ వరకు మృదువుగా గుండ్రంగా మర్దనచెయ్యాలి. ఆదేవిధంగా కాళ్ళకు కూడా పాదాలు, అరికాల్లతో సహా మర్దన చెయ్యాలి. కాళ్ళు వంకర పోయి వుంటే ఇసుక సంచులను భరించ గలిగినంత బరువుగా వేలాడదీయాలి.

1. తెల్ల గలిజేరు సమూల రసం ---- ఒక కిలో
                     నువ్వుల నూనె ---- అర కిలో

     రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇంకిపోయి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి.

2. తెల్ల గలిజేరును సమూలంగా తెచ్చి కడిగి 8 లీటర్ల నీటిని పోసి కాచి 4 కషాయానికి రానివ్వాలి.

తెల్ల గలిజేరు రసం యొక్క కషాయం   ---- అర కిలో
                                       కలకండ ---- అర కిలో

  రెండింటిని  కలిపి స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేంత వరకు కాచాలి.

ఉపయోగించే విధానం:--

తైలాన్ని మర్దనకు ఉపయోగించాలి. సాయంత్రం పిల్లలను టబ్ లో కూర్చోబెట్టి కషాయం తో మర్దన చేసిస్నానం చేయించాలి
.
పాకాన్ని ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున నీళ్ళు కలుపుకొని తాగాలి.

ఆవిరి పట్టే విధానం

చిన్న పిల్లలే కాక ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా ప్రక్రియ తో నయమైన వాళ్ళు వున్నారు.
నులక మంచాన్ని తెచ్చి ఒక గదిలో వెయ్యాలి.

తంగేడు మొక్కలను సమూలంగా తెచ్చి ముక్కలుగా చితగ్గొట్టి ఒక కిలో ముక్కలకు ఎనిమిది రెట్లు నీళ్ళుపోసి మరిగించాలి.నులక మంచం మీద నూలు గుడ్డ పారిచి రోగిని మంచం మీద పడుకోబెట్టి పాత్రను నులక మంచం కింద పెట్టి శరీరమంతా ఆవిరి పట్టించాలి. తరువాత బోర్లా పడుకోబెట్టి ఆవిరి పట్టాలి. తరువాతఓమ తైలంతో గాని, గరిక తైలం తోగాని లేక ఏదైనా తైలంతో శరీరమంతా మర్దన చెయ్యాలి. తరువాత ఆవిరిలోగుడ్డను ముంచి భరించ గలిగినంత వేడిగా కాపడం పెట్టాలి.

                    పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి తులసి పానీయం                 2-4-09

తులసి ఆకులను దంచి తీసిన రసం    ---- ఒక కిలో
                                   పటికబెల్లం ---- పావు కిలో
     తులసి రసం లో పటికబెల్లం పొడిని కలిపి స్టవ్ మీద పెట్టి నీరు ఆవిరై పాకం మిగిలే వరకు ఉడికించాలి. దీనిని నిల్వ చేసుకొని రోజు పావు స్పూను పాకాన్ని అర కప్పు గోరు వెచ్చని నీళ్ళలో కలిపి తాగించాలి .

                             పిల్లలలో మధుమేహం --నివారణ                                  25-5-09.

     వజ్రాసనం, భుజంగాసనం మొదలగు ఆసనాలను వేయడం ద్వారా మధుమేహం నివారింప బడుతుంది.
పిల్లలకు కొత్త బియ్యపు అన్నాన్ని పెట్టకూడదు. పూర్తిగా నిషేధం. కొత్త ధాన్యము కూడా వాడకూడదు.
కనీసం ఒక సంవత్సరం నిల్వ వున్న ధాన్యాన్ని వాడాలి.

చక్కర, కలకండ పూర్తిగా అసలు వాడకూడదు .ఒక సంవత్సరం నిల్వ వున్న పాత బెల్లాన్ని తగు మోతాదుగావాడుకోవచ్చు.

పిల్లల పై విద్యా భారం అధికంగా వుండకూడదు. వాళ్ళను భయపెట్టడం పనికి రాదు.

నిశామలకి       నిశా = మేలైన పసుపు .   ఆమలకి = ఉసిరిక

పసుపు పొడి, ఉసిరిక పొడి సమాన భాగాలుగా తీసుకొని కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఆహారానికి అరగంట ముందు వయసును బట్టి అరపావు టీ స్పూను, పావు టీ స్పూను, అర టీ స్పూను,ఒక టీ స్పూను చొప్పున కాచి చల్లార్చిన నీటితో సేవించాలి

మేలిమి బంగారం (.999 రకం) ---- 10 gr
మేలైన గట్టు వెండి      ---- 10 నుండి 20 gr
స్వచ్చమైన రాగి ముక్క            ---- 50 gr
తుప్పు లేని ఇనుపముక్క          ---- 50 gr

అన్నింటిని శుభ్రంగా కడిగి తుడవాలి. ఉదయం 4 గ్లాసుల నీటిలో లోహపు ముక్కలను వేసి స్టవ్ మీదపెట్టి మరిగించి రెండు గ్లాసుల నీటికి రానివ్వాలి. తరువాత లోహపు ముక్కలను తీసి నీటిని ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం కొద్ది కొద్దిగా తాగించాలి.

అన్ని లోహగుణాలు శరీరాన్ని పునరుజ్జీవింప చేస్తాయి. దేహదారుడ్యము  పెరిగి రక్తవృద్ధి జరుగుతుంది.శరీరానికి కాంతి, నిగారింపు వస్తాయి.

                     పిల్లలలో ఆస్తమా , పాల ఉబ్బసం -- నివారణ                      27-5-09.

   పిల్లల శరీరాన్ని గోరువెచ్చని నువ్వుల నూనెతో మర్దన చెయ్యాలి. తరువాత ఒక పాత్రలో వేడి
నీళ్ళు పోసి దానిలో పసుపు, ఉప్పు వేయాలి. దానిలో లావుపాటి గుడ్డను ముంచి దానితో వేడి గమనించుకొని వీపు మీద కాపడం పెట్టాలి. గొంతు మీద, చాతిమీద కూడా కాపడం పెట్టాలి.

మరీ చిన్న పిల్లలైతే కొబ్బరి నూనెను వేడి చేసి దానిలో కర్పూరం బిళ్ళలను వేసి కరిగించి దానితో మర్దనచెయ్యాలి. ముక్కుల్లో రెండు చుక్కల నువ్వులనూనె గాని వేపనూనె గాని వేస్తే శ్వాస బాగా ఆడుతుంది.

అర్దరాత్రి అకస్మాత్తుగా శ్వాస ఆడకపోతే ఒక పాత్రలో భరించగలిగినంత వేడి నీటిని పోసి దానిలో కాళ్ళుపెట్టాలి.తలమీద చల్లటి గుడ్డను వెయ్యాలి.

కూల్ డ్రింక్స్ తాగ కూడదు

తులసిరసం, కలకండ కలిపి కాచిన తులసి పానీయాన్ని వాడుకోవాలి.

తీపి దానిమ్మ, బాగా పండిన బొప్పాయి పెట్టవచ్చు. పదార్ధాలు ఎక్కువగా తింటే కఫం పెరుగుతుందోవాటిని నిషేధించాలి. నీరు ఎక్కువగా వున్న, ఆకుకూరలు, కాయగూరలు వాడకూడదు.

ఉదయం, సాయంత్రం పావు లీటరు నీటిలో అర టీ స్పూను మెంతులు వేసి మరిగించి దించి గోరువెచ్చగాచేసి గొంతులో పోసుకొని గులగరించి ఉమ్మేయ్యాలి. దీనితో గొంతు క్లియర్ అవుతుంది. ఒక్క రోజులోనే చాలామార్పు వస్తుంది.

దోరగా వేయించిన మిరియాల పొడి                      ---- 20 gr
వెల్లుల్లి దంచి తీసిన రసం                                  ---- 20 gr
ఉత్తరేణి ఆకుల రసం                                        ---- 20 gr

అన్నింటిని కల్వంలో వేసి మెత్తగా నూరాలి. శనగ గింజలంత మాత్రలు కట్టి బాగా గాలి తగిలే చోట ఆరబెట్టాలి
ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున భోజనానికి ముందు వేడి నీటితో సేవించాలి.

పిల్లల స్వర

పిల్లలను ఉదయం సూర్యునికి ఎదురుగా కూర్చోబెట్టి ఆసనం వేసుకోమని చెప్పాలి. గాలిని నిండుగా పీల్చుకొనిలయబద్ధంగా "అం " అని ఎక్కువ సేపు అధిక స్వరం నుండి అల్ప స్వరానికి తగ్గిస్తూ పలకాలి.

చేతిని చాపి బొటన వ్రేలును పైకిపెట్టి బొటన వేలు అడుగుభాగం అనగా అరచేతికి తగిలేచోట నొక్కాలి. చేయి     పూర్తిగా చాపి కుర్చీలో పెట్టి కూడా చెయ్యవచ్చు.

  పసుపు, తేనె కలిపి మెత్తగా నూరి గొంతు మీద పట్టు వేస్తే నేమము త్వరగా లాగి వేయబడుతుంది.
కప్పు పాలలో చిటికెడు పసుపు కొంచం చితగ్గొట్టిన అల్లం చిటికెడు మిరియాల పొడి వేసి పొంగించి ఒక టీస్పూను కలకండ కలిపి తాగించాలి

           పిల్లలలో అన్ని రకాల విరేచనాల సమస్య -- నివారణ                   26-7-09

           విరేచనాలు అవుతున్నా, కాకున్నా కరక్కాయ బాగా ఉపయోగ పడుతుంది.

కరక్కాయల బెరడు పొడి      --- 50 gr
మారేడు పండ్ల గుజ్జు పొడి      --- 50 gr

రెండింటిని కల్వంలో వేసి తగినన్ని నీళ్ళు కలిపి మాత్ర కట్టుకు వచ్చేట్లు బంకగా అయ్యేంత వరకు నూరాలిశనగ గింజలంత మాత్రలు కట్టాలి. నీడలో ఆరబెట్టి పూర్తిగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి.

దీనితో రక్త విరేచనాలు, జిగట విరేచనాలు, నీళ్ళ విరేచనాలు నివారింప బడతాయి.

    అర్ధ రాత్రిలో సమస్య ఎదురైనా దీనిని వాడ వచ్చు. ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము ఒక్కొక్కమాత్ర చొప్పున వేసి నీళ్ళు తాగించాలి. సమస్యను బట్టి వాడుకోవాలి.

పెద్దలకు ----- పూటకు రెండు
పిల్లలకు -----     "      ఒకటి

    దీనిని వాడడం వలన అజీర్ణం వలన కలిగే అతిసార తగ్గుతుంది. ఉప్పు,చక్కెర కలిపిన నీటిని తాగించాలి.
పైత్య ఉద్రేకము (వేడి )వలన కలిగే విరేచనాలు నివారింప బడతాయి.
అతి కారము, అతి పులుపు వాడకూడదు.
బార్లీ, పలుచని మజ్జిగ అన్నం, మెత్తటి ఉప్మా పెట్ట వచ్చు.

పిల్లలలో థైరాయిడ్ సమస్య ---నివారణ                                             7-10-09.

గొంతు మీద ఆహార నాళానికి రెండు వైపులా పై నుండి కిందికి తైలం తో జారదీసినట్లు మర్దన చెయ్యాలి

శరీరాన్ని కదిలించకుండా మెడను కుడి, ఎడమలకు పది సార్లు చొప్పున తిప్పాలి. మెడను రెండు వైపులానిదానంగా వంచాలి, గుండ్రంగా తిప్పాలి.

గొంతు కొరకు ప్రత్యేకమైన ప్రాణాయామం:-- ;ఇది చేయడం వలన సమస్యే కాక, కీచు గొంతు, బండ గొంతుసమస్యలు కూడా నివారింప బడతాయి.

1. ఉజ్జాయి ప్రాణాయామం:-- ఒక ముక్కును మూసి రెండవ ముక్కుతో గాలిని దీర్ఘంగా పీల్చి కాసేపు బంధించితరువాత వదలాలి. దీని వలన గొంతులోని కఫం కరుగుతుంది. దానిని బయటకు ఉమ్మేయ్యాలి.

2. తలను పైకెత్తి కొద్దిగా వంచి పళ్ళను బిగబట్టి గాలిని పీల్చి వదలాలి.

3. మోకాళ్ళపై కూర్చొని చేతులను మోకాళ్ళపై చాపి పెట్టి ముందుకు వంగి సింహ గర్జన లాగా నాలుకను ముందుకు చాపి శబ్దం చెయ్యాలి.

పాలు కఫాన్ని పెంచుతాయి. పాలల్లో చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం దంచి వేసి మూడు పొంగులు రానిచ్చితాగితే కఫం చేరదు.
.
ఉప్పు కలిపిన నీటిని గులగరించి ఉమ్మేయ్యాలి.

కఫాన్ని పెంచే పదార్ధాలు వాడకూడదు/

                        పిల్లలలో స్థూల కాయం --- నివారణ                       16-11-09.

వ్యాయామానికి ముందు పొట్టను ఖాళీగా ఉంచాలి.

1. కింద కూర్చొని చేతులను వెనక్కి పెట్టి ఒక కాలును బాగా పైకేత్తాలి, దించాలి అలాగే రెండవ కాలును కూడాపైకెత్తి దించాలి విధంగా వేగంగా చెయ్యాలి.

2. అలాగే కూర్చొని రెండు కాళ్ళతో సైకిలు తొక్కినట్లు కాళ్ళను కదిలించాలి.


3. పద్మాసనంలో కూర్చొని ఉదరచాలనం చెయ్యాలి.

4. పద్మాసనం కూర్చొని చేతులను వీపు పై భాగంలో కలపాలి.

5. పద్మాసనంలో కూర్చొని రెండు చేతులను ఒకే సారి ముందుకు, రెండు ప్రక్కలకు, కిందికి, నెలకు ఆనించాలి.

6. పద్మాసనంలో వుండి  వెనక్కి పడుకోవాలి.

7. భుజంగాసనం వెయ్యాలి
.
.ఆహారం:-- వేళకు ఆహారం భుజించాలి, బయటి ఆహారం పనికి రాదు. ఉపవాసం వుండకూడదు. పండ్ల రసాలు,కాయగూరల రసాలు ఎక్కువగా వాడాలి. జామ, పండిన బొప్పాయి, పైనాపిల్, ఆపిల్, వాడుకోవచ్చు.ఉలవగుగ్గిళ్ళు మంచిది, పలుచని గంజి ఒక గ్లాసు తాగితే మంచిది

పాతబియ్యం, పాత గోధుమలు, యవలు, బార్లీ, పాత జొన్నలు విడివిడిగా నానబెట్టి, ఎండబెట్టి రవ్వ పట్టించిఉప్మా చేసుకొని తింటే అదనపు కొవ్వు పెరగదు.

పాత బెల్లంతో తయారు చేసిన తీపి పదార్ధాలను మాత్రమే వాడాలి. నువ్వుండలు ఎంతో ఆరోగ్య కరం.
" ఒక్కసారిగా శరీరంలో బరువు తగ్గకూడదు."

నువ్వుల నూనెతో గాని ఆవ నూనెతో గాని శరీరమంతా మర్దన చెయ్యాలి. వేగంగా చెయ్యాలి. ఒక గంట ఆగివేడి నీటితో స్నానం చెయ్యాలి.

        పిల్లలకు రాత్రివేళ ఊపిరి ఆడకుండా పక్కలెగరేస్తుంటే ---- నివారణ         1-3-10.

తులసి రసం              ----- పావు టీ స్పూను లేదా మూడు చిటికెల పొడి
అల్లం రసం                ----- పావు టీ స్పూను
తేనె                          ----- కొద్దిగా
కలకండ                    -----   "

అన్నింటిని కలిపి నాకిస్తే వెంటనే శ్వాస బాగా ఆడుతుంది.

                            చంటి బిడ్డల అజీర్ణము --- నివారణ                                3-3-10.

తులసి గింజల పొడి ----- చిటికెడు
చనుబాలు             ----- ఒక టీ స్పూను

రెండింటిని కలిపి నాకిస్తే చంటి బిడ్డల ఉదర సంబంధ వ్యాధులు నివారింప బడతాయి.

2. తులసి గింజల పొడి
కలకండ పొడి

రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని ఉదయం సాయంత్రం అర టీ స్పూను పొడి చేతిలో వేసుకొని నాలుకతోఅడ్డుకొని తినాలి


. దీని వలన కడుపులో పుండ్లు, అగ్ని మాంద్యము మొదలగునవి నివారింప బడతాయి.

  పెరుగు దుంప కూరలు వాడకూడదు. పలుచని మజ్జిగ వాడాలి. పప్పులు, పచ్చళ్ళు రాత్రి పూట వాడకూడదు. రాత్రి పూట చాలా సులభంగా జీర్ణమయ్యే పదార్ధాలను వాడాలి.

                          పిల్లలలో కఫసమస్యలు --- నివారణ                                  18-3-10

మంచి నువ్వుల నూనెతో గొంతుమీద, ముక్కుమీద, నుదుటిమీద, మేడమీద, వెన్నుపూసమీద, కాళ్ళమీద, చేతులమీద, అరికాల్లమీద మర్దన చెయ్యాలి. దీనివలన కఫము, వాతము, పైత్యము నివారింప బడతాయి.

కఫసమస్యలున్న పిల్లలకు మామూలుగా పెట్టె ఆహారం పెట్టకూడదు. పాలు, పెరుగు, మజ్జిగ డైరెక్ట్ గా వాడకూడదు. ఒక కప్పు పాలల్లో వయసునుబట్టి ఒకటి నుండి మూడు చిటికెల పసుపు వేసి, ఒకటి నుండి మూడు తులసి దళాలను వేసి మూడు పొంగులు రానిచ్చి కలకండ వేసి తాగించాలి. సాధ్యమైనంత వరకు ఆవు పాలు వాడితే చాలా మంచిది.

తులసి ఆకుల రసం
అల్లం రసం

రెండింటిని సమానంగా తీసుకొని రెండింటికి సమానంగా తేనె కలిపి పిల్లలతో నాకించాలి. దీని వలన అరువ్హి, నాలుకపై గల కఫము అన్ని నివారింప బడతాయి.

చల్లగా వున్న సమయాలలో  బయట పిల్లలను తిప్ప రాదు. నేరుగా ఫాన్ కింద కాకుండా కొంచం దూరంగా పడుకోబెట్టాలి. వీలైనంత వరకు సహజమైన గాలి తగిలేట్లు చూసుకోవాలి. వేడి నీటిని తాగించాలి. శరీరంలోఇంకి పోయే విధంగా  తైలమర్దన చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. చల్లని అన్నం, తీపి పదార్ధాలు పెట్ట కూడదు.

మూడు పేటల తులసి మాలను పిల్లలతో ధరింప చెయ్యాలి.

                        తులసి మాలను ధరించడం వలన కలిగే ప్రయోజనాలు:--

శరీరం సక్రమంగా పని చేయడానికి, కాలేయము, ప్లీహము, నాభి వద్ద వున్న అగ్ని చక్రాన్ని, దశవిధవాయువులను నియంత్రించి సక్రమముగా పనిచేయడానికి దోహదపడుతుంది.

మధుమేహం నివారించబడుతుంది.

తులసి రసాన్ని ఇనుప గరిటలో పోసి సన్న మంట మీద వేడి చేసి తీసి గోరువెచ్చగా అయినతరువాతతేనె కలిపి నాకిస్తే అప్పటికప్పుడు జ్వరము నివారింప బడుతుంది.

త్రిదోషాలు అనగా చెడు నీరు త్రాగడం వలన, చెడు వాయువును పీల్చడం వలన, చెడిపోయిన ఆహారపదార్ధాలను సేవించడం వలన కలిగే దోషాలు నివారింప బడతాయి

                               చిన్న పిల్లల ఉదరంలో క్రిములు ---నివారణ                 10-3-10

     పొట్టలో క్రిములున్న పిల్లలు రాత్రి పూట పళ్ళు కొరుకుతూ వుంటారు. శరీరంపై తెల్ల మచ్చలు వుంటాయి.

     అపరిశుభ్ర పదార్ధాలు తినడం, మురికి నీళ్ళు తాగడం, అశ్రద్ధ మొదలైన కారణాల వలన క్రిములు చేరతాయి.

    శరీరంలో ఆహారం నిల్వ వుండి మురగడం వలన క్రిములు ఏర్పడతాయి. అందు వలన పొట్టను ఎప్పటికప్పుడుశుభ్రం చేస్తూ ఉండాలి.   పొట్టలో క్రిములున్నపుడు భరించలేని నొప్పి వుంటుంది.
మట్టిపట్టి వెయ్యాలిజల్లించిన బంకమట్టిలో వేపాకు పొడి గాని, రసం గాని పసుపు కలిపి పిసికి పొట్ట మీదపట్టి వెయ్యాలి. లేదా కంగా ఆకు పోదిగాని రసం గాని పసుపుతో మట్టిలో కలిపి కూడా వెయ్యవచ్చు.

గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తాగించి వేళ్ళు పెట్టి కక్కించాలి. దీని వలన కడుపులో పురుగులునోటిద్వారా బయటకు నెట్టబడతాయి.

                                             క్రిముల నివారణ:---

లక్షణాలు:-- విరేచనం అయ్యేట్లుగా వుండడం, కాకపోవడం, విసుగ్గా వుండడం, ప్రశాంతత లేకపోవడం,ఆహారం మీద దృష్టి  పెట్టక ప్వడం వంటి లక్షణాలుంటాయి.

తులసి దళాల పొడి
దోరగా వేయించిన వాయువిడంగాల పొడి
సైంధవ లవణం

  అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కొన్ని చుక్కలు నీళ్ళు వేసి గుజ్జుగా నూరాలి. మాత్రలు కట్టాలి.

చిన్న పిల్లలకు ---- జొన్న గింజలంత
పెద్దలకు          ---- బటాణి గింజలంత

              ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున గోరువెచ్చని నీటితో వేసుకుంటే క్రిములు నశిస్తాయి.సమస్యఎక్కువగా వుంటే మూడు పూటలా వేసుకోవాలి.

ముందు జాగ్రత్త :--

ఉసిరి ముక్కలు ---10
తులసి దళాలు ----10

రెండింటిని రాత్రి పూట కుండలోని నీళ్ళలో వేయాలి. ఉదయం నీళ్ళు తీయగా, ఔషధ శక్తి కలిగి
వుంటాయి. నీళ్ళు తాగడం వలన ఆకలి, రాల్త్జశుద్ధి, వ్యాధినిరోధక శక్తి కలుగుతాయి. మనం తినే ఆహారపదార్ధాలలోని పిండి పదార్ధాలు క్రిములకు మంచి ఆహారంగా తయారవుతాయి. అన్నం ఉడికే టపుడు  కొన్నితులసి ఆకులను వెయ్యాలి.

                                           ఉదరశుద్ధి

కృష్ణ తులసి ఆకులు           --- 10
నల్ల మిరియాలు                --- 10
అల్లం ముక్క                     --- 2 గ్రా

    అన్నింటిని చితగ్గొట్టి రెండు కప్పుల నీటిలో వేసి ఒక కప్పు కషాయం వచ్చే వరకు మరిగించాలి. వడపోసిఒక టీ స్పూను కలకండ కలిపి తాగ గలిగినంత వేడిగా తాగాలి. దీని వలన ఉదరము శుద్ధి చేయదుతుంది.
                        బాల చతుర్భద్ర చూర్ణం

తుంగ ముస్తలు              ---50 gr
         పిప్పళ్ళు             ---50 g
         అతి విష            --- 50 gr
కర్కాటక చూర్ణం           ----50 gr

  అన్నింటి చూర్ణాలను కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. ఒక సంవత్సరం వరకు నిల్వ వుంటుంది

3 నెలల పిల్లలకు                 ---- 2 గురిగింజలంత చూర్ణం + తేనె
పెద్ద పిల్లలకు                      ---- 4 నుండి 8 గింజలంత చూర్ణం + తేనెకలిపి నాకించాలి.

దీనిని వాడడం వలన కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరము, జలుబు వంటివి నివారింప బడతాయి/.

ఎముకల పెరుగుదలకు చూర్ణానికి శృంగి భస్మం కలిపి ఇవ్వాలి.

ఉపయోగాలు:--

1. చంటి పిల్లలకు సరిపడనపుడు పాలు కక్కడం, పళ్ళు వచ్చేటపుడు విరేచనాలు కావడం వంటి సమస్యలను నివారించడానికి రెండు గురిగింజలంత చూర్ణాన్ని తేనెతో నాకించాలి.

2.     6 సంవత్సరాల పిల్లలకు విరేచనాలు, జ్వరం, వాంతులు వస్తే 4-6 గురిగింజలంత చూర్ణాన్ని తేనెతో నాకించాలి.

                                  పిల్లలలో జలుబు --నివారణ                                       6-5-10.

వాతావరణంలో మార్పులు, ఆహారంలో మార్పుల వలన పిల్లలకు జలుబు చేస్తుంది.

ఒక జాజికాయ పొడి
దానికి సమానంగా శొంటి పొడి.

రెండింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి.

చిన్న పిల్లలకు --- కంది బేడ అంత నుండి శనగ గింజంత వరకు
పెద్ద పిల్లలకు  ---- ఇంకా కొంచం ఎక్కువ
పెద్ద వాళ్లకు   ---- పావు టీ స్పూ ను.

      ఈ చూర్ణానికి తగినంత నెయ్యి కలిపి నాకించాలి.
      దీని వలన అజీర్తి నివారింప బడుతుంది.

                                   కఫము వలన శ్వాస ఆడనప్పుడు

   పిల్లలు కొన్ని సార్లు చీమిడి ని కడుపులోకి లాక్కోవడం వలన కొన్ని సమస్యలు వస్తాయి. దీనిని నివారించడానికి :--

   వస కొమ్ముల పొడిలో తగినంత నెయ్యి కలిపి చాతీ, వీపు భాగంలో పూయాలి. దీనితో  కఫం కరిగి గొంతుద్వారా, మలము ద్వారా వెడలి పోతుంది.

                          చిన్న పిల్లలలో మలబద్ధకం -- నివారణ                   24-5-10.

వాము పొడి                --- మూడు టీ స్పూన్లు
వస పొడి                    --- పావు టీ స్పూను
జాజికాయ పొడి          --- పావు టీ స్పూను
సైంధవ లవణం           --- అర టీ స్పూను
ఇంగువ                    --- పావు టీ స్పూను
నువ్వుల నూనె          --- పావు కిలో

     ఒక పాత్రలో నువ్వుల నూనెను పోసి దానిలో మిగిలిన పదార్ధాలను వేసి స్టవ్ మీద పెట్టి కాచి వడపోసి చల్లారిన తరువాత సీసాలో భద్ర పరచుకోవాలి.

1, 2 స్పూన్ల నూనెను చేతిలో వేసుకొని పిల్లల బొడ్డు చుట్టూ ClockWise లో మర్దన చెయ్యాలి.         10     15 నిమిషాలలో లోపల గడ్డ కట్టిన మలము కరిగి బయటకు వస్తుంది.

                  పిల్లలలో అజీర్ణము -- కారణాలు--నివారణ                  10-6-10.

  శరీరంలో 13 రకాల అగ్నులు వున్నాయి. బాగా ఆకలైనంత మాత్రాన అజీర్ణం లేదనుకోకూడదు. జీర్ణమైన ఆహార రసాన్ని శరీరం గ్రహించాలి.

 నాగ కేసరాల పొడిని పూటకు అర టీ స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం మజ్జిగతో కలిపి తాగించాలి.              దీని వలన తిన్న ఆహారం శరీరానికి వంటబడుతుది,


ప్రేవులలో గ్రాహీ గుణము ( గ్రహించే గుణము ) లేకపోతే సరిగా వంటబట్టదు. అటువంటపుడు నాగ కేసరాల చూర్ణం బాగా పని చేస్తుంది. దీనిని ఏడాది లోపు పిల్లలకు తేనెతో నాకించాలి.

చిన్న పిల్లలకు --- పావు గ్రాము
పెద్ద పిల్లలకు    --- అర గ్రాము నుండి ఒక గ్రాము.

      పిల్లలలో ఉదర సంబంధ వ్యాధులు-నివారణ -- బాల సంజీవని గుటికలు       15-7-10.

నల్ల ఉప్పు పొడి                  --- 10 gr
చింత పండు                      ----20 gr
జిలకర పొడి                      ----40 gr
మిరియాల పొడి                ---- 80 gr
నిమ్మ రసం                     ---- తగినంత

   చింత పండును నానబెట్టాలి. జిలకరను, మిరియాలను దోరగా వేయించాలి.

అన్నింటిని కల్వంలో వేసి తగినంత నిమ్మ రసం పోస్తూ మాత్ర కట్టుకు వచ్చేట్లు నూరాలి. ముద్దగా అయిన తరువాత శనగ గింజలంత మాత్రలు కట్టి నీడలో ఆరబెట్టి బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి.

  పూటకు ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తేనెతో రంగరించి నాకాలి. పెద్దలైతే రెండు, మూడు మాత్రలువేసుకోవచ్చు.         దీని వలన ఉదరము శుద్ధి చేయబడుతుంది.

          పిల్లలలో ముక్కు సంబంధ సమస్యలు -- ఎడినాయిడ్స్         30-11-10.

  ముక్కు రంధ్రాలు గొంతులో కలిసే చోట ఎడినాయిడ్స్ వుంటాయి. ఇవి వున్నపుడు పిల్లలు నిద్రలో గాలినినోటి తో పీలుస్తారు. గాలి పీల్చేటపుడు శబ్దం వుంటుంది. నోటి దుర్వాసన వుంటుంది. ఆకుపచ్చని చీమిడి కారుతూ వుంటుంది. దీని వలన చెవిలో ఎక్కువగా మైనం తయారవుతుంది. చెవి సమస్యలు ఏర్పడే అవకాశం కలదు.

బాహ్యంగా వాడవలసినవి :--

1. పటిక              ---- పావు టీ స్పూను
    వేడి నీరు         ---- ఒక కప్పు

    రెండింటిని కలిపి పిల్లల చేత పుక్కిలింప చెయ్యాలి.

2. త్రిఫల చూర్ణం       ---- పావు టీ స్పూను
    నీళ్ళు                ----- ఒక గ్లాసు

      రెండింటిని కలిపి కషాయం కాచి పుక్కిలించాలి. చేతిలో పోసుకొని ముక్కుతో పీల్చి నోటితో ఉమ్మెయ్యాలి

3. నశ్య కర్మ

    వెల్లుల్లి
    తేనె

    వెల్లుల్లిని ముద్దగా నూరి రసం పిండి వేడి చేసి దానికి తేనె కలిపి ద్రవ పదార్ధాన్ని డ్రాపర్ తో ముక్కులోచుక్కలు వెయ్యాలి. కొద్దిగా మంటగా వుంటుంది.

4. పసుపు
    మిరియాల పొడి

          రెండింటిని వేడి పాలల్లో కలిపి తాగించాలి.

                                         పిల్లల్లో విరేచనాలు -- నివారణ                           6-2-10.

లేత దానిమ్మ పిందెలను నూరి పెరుగులో కలపాలి. దీనిని ఒక టీ స్పూను పిల్లలకు తినిపిస్తే వెంటనే
విరేచనాలు తగ్గుతాయి.

                              చిన్న పిల్లలలో జలుబు సమస్య -- నివారణ                   9-7-10.

   చిన్న పిల్లలలో కఫసమస్యలు, మధ్య వయస్కులలో పిత్త సమస్యలు, వయో వృద్ధులలో వాత సమస్యలుఎక్కువగా వుంటాయి.

తల్లి పాలు తాగే  పిల్లలలో జలుబు సమస్య ఎక్కువగా వుంటుంది.
పక్కలెగరేయడం, శ్వాస సరిగా తీసుకోలేక పోవడం, ఊపిరితిత్తులలో శ్లేష్మం చేరి గడ్డ కట్టుకొని వుండడం వంటి లక్షణాలు వుంటాయు.

కోదాటి కాయ (కణప కాయ, లేదా పిజ్జల కాయ) , ను చాది  గంధం తీసి చిన్న పిల్లల చాతీ మీద లేపనంచేయాలి. తరువాత కడిగెయ్యాలి. దీని వలన గడ్డ కట్టిన కఫం కరుగుతుంది. దీని వలన దగ్గు, ఆయాసం తగ్గి శ్వాస సులభంగా తీసుకోగాలుతారు. రోజుకొక సారిగాని లేదా రెండు సార్లు గాని విధంగా చెయ్యవచ్చు.

మూడు రోజుల తరువాత కొంచం గంధాన్ని తేనెతో నాకిస్తే జీర్ణం కాని ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చి ఆరోగ్యం బాగుంటుంది.

                         చిన్న పిల్లలలో నులిపురుగులు --నివారణ                      21-7-10.

లక్షణాలు:-- నీరసం, హుషారుగా లేకపోవడం, అజీర్ణం, ఆహారం సరిగా తినక పోవడం, మలద్వారం 
దగ్గర దురద వంటి లక్షణాలు వుంటాయి.

నారింజ తొక్కల పొడి
వాయు విడంగాల పొడి

     రెండింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి.

భోజనం తరువాత ఒక టీ స్పూను నీటితో గాని, మజ్జిగతో గాని ఇవ్వాలి. 5 రోజులు ఇచ్చిన తరువాత
ఆపేసి ఆరవ రోజు రాత్రి ఒక టీ స్పూను ఆముదాన్ని తాగిస్తే నులిపురుగులు పూర్తిగా బయటకు వస్తాయి.

                చిన్న పిల్లలలో మానసిక ఒత్తిడి --నివారణ              28--7-10.

వస కొమ్మును గంధం చాది తేనెతో కలిపి నాకిస్తే అద్భుతమైన జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయి.

వస పొడిని నెయ్యి తోగాని, తేనెతో గాని కలిపి నాకిస్తే మంచి ఫలితాలు వుంటాయి.

         పిల్లలలో డైపర్ రాష్ ( అమోనియా రాష్ ) -- నివారణ           5-10-10.

            గాలి సరిగా తగలక పోవడం వలన, డైపర్ వలన రాష్ వస్తుంది. దీనిలో బాక్టీరియా చేరుతుంది. అమోనియావిడుదల అవుతుంది. ఇది 1. Bacterial  Inffection 2. Fungal Infection అని రెండు రకాలు.

      ముడ్డిపై చర్మం ఎర్రగా, కందినట్లు, పోక్కినాట్లు అవుతుంది. కొంత మందికి చీము చేరి రసిక కారుతూ వుంటుంది.

త్రిఫలాలు                     ---- 1 ; 1 : 1
పసుపు                        ---- 1
మాని పసుపు                ---- 1
వేప చెక్క                     ---- 1

అన్నింటిని బరకగా చూర్ణాలు చేసి నాలుగు గ్లాసుల నీటిలో చూర్ణాన్ని వేసి మరిగించి ఒక గాసుకు రానిచ్చి చల్లార్చి నీటితో చర్మాన్ని కడుగుతూ వుండాలి. విధంగా రోజుకు ఒకటి రెండు సార్లు చేయాలి.

                                  జిగట విరేచనాల నివారణకు చిట్కా             8-11-10.

   జాజి కాయను నీటితో చాది వచ్చిన గంధాన్ని పిల్లల నాలుకపై రాయాలి. విధంగా రోజుకు నాలుగైదుసార్లు చేయాలి. దీనితో జిగట విరేచనాలు తగ్గిపోతాయి.

                             చిన్న పిల్లలలో ఎదుగుదల లేక పోవడం           2-12-10.

        చిన్న పిల్లలుగా వున్నపుడు పిల్లలకు ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తేనె,
నెయ్యి, అతిమధురం వంటివి ఇస్తూ వుండాలి.

బిస్కెట్లు, మైదా, శనగ పిండి కి సంబంధించిన పదార్ధాలను ఇవ్వకూడదు.

ఎండు ఖర్జూరం పొడి                        ---- 50 gr
పిస్తా పప్పు                                    -----50 gr
బాదం పప్పు                                 ---- 50 gr
జీడి పప్పు                                    ---- 50 gr
పటికబెల్లం లేదా చక్కెర                -----200 gr

ఎండు ఖర్జూరాన్ని నానబెట్టి గింజలు తీసి ఎండబెట్టి దంచి పొడి చెయ్యాలి.
అన్నింటి దంచి పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.

   ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూటకు ఒక టీ స్పూను పొడి చొప్పున పాలల్లో కలిపి పిల్లల చేత
తాగించాలి.
దీని వలన పిల్లలు ఎంతో పుష్టిగా తయారవుతారు. బాగా ఎదుగుతారు.
పిల్లలకు ఆరు సంవత్సరాలు వచ్చిన తరువాత తడాసనం, సూర్యభేదన, చంద్రభేదన ప్రాణాయామాలు    చేస్తుంటే వారి శరీరంలో మంచి ఎదుగుదల వుంటుంది.

                         చిన్న పిల్లలకు వచ్చే కురుపులు, పుండ్లు-- నివారణ       13-12-10.

          రాత్రి పూట సీతాఫలం ఆకులను నూరి వాటిపై పూస్తే గడ్డలు పగులుతాయి కురుపులు మానిపోతాయి.

                                                పిల్లలలో మలబద్ధకం                             20-12-10. .

లక్షణాలు :-- రెండు మూడు రోజుల వరకు వెళ్ళకుండా వుండడం. మలం గట్టిగా వుండడం, అంటుకుని వుండడం, నెత్తుటి జీరలు కనిపించడం వంటివి వుంటాయి. ఆకలి లేకపోవడం కూడా వుంటుంది

కారణాలు :-- బలవంతంగా ఆపుకోవడం, ఆహారంలో పీచు పదార్ధం లేకపోవడం, ద్రవపదార్ధం సరిగా తాగక పోవడం రోజు వారి క్రమంలో మార్పు, ప్రయాణం, వేడి వాతావరణం, మిల్క్ అలర్జీ, వారసత్వం, మొదలైనవి.

1. పసుపు రంగు అరటిపండు (దేశి) గుజ్జును గోరువెచ్చని పాలకు కలిపి తాగిస్తూ వుంటే మలబద్ధకం నివారింపబడుతుంది.

2. 5, 6 ఎందు ద్రాక్ష పండ్లను పిసికి వడకట్టి నీళ్ళను తాగిస్తూ వుండాలి.
3. గింజలు తీసిన ఖర్జూరం పండును అర గ్లాసు నీటిలో నానబెట్టి పిసికి తాగించాలి.
ఆహారంలో పీచు పదార్ధాలు, నీరు ఎక్కువగా వుండాలి. అన్నాన్ని త్వరత్వరగా తినిపించ కూడదు. బాగా నమిలేట్లు ప్రోత్సహించాలి. ఇతర వ్యాపకాలను చూపుతూ ఆహారం పెట్టకూడదు.

                             చిన్న పిల్లలలో జ్వరము -- నివారణ                      21-12-10.

మెదడులోని భాగమైన హైపో తెలామస్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. శారీరక ఉష్ణోగ్రత పెరగడం వలన, ,శరీరంలో బాక్టీరియా, వైరస్ చేరడం వలన, ఇన్ఫెక్షన్ చేరడం వలన జ్వరము వస్తుంది.

లక్షణాలు :_- చిరాకు, పెంకితనము, నిస్త్రాణ మొదలగు లక్షణాలు వుంటాయి.
జ్వరం చూసేటపుడు అరచేతి వైపు కాకుండా వెనుక వైపు నుండి చూడాలి.
పిల్లలు వేగంగా గాలి పీల్చడం ముఖ్య లక్షణం, ఒళ్ళు నొప్పులు, తల నొప్పి, ఆకలి లేదని చెప్పడం వంటి లక్షణాలు వుంటాయి.

జ్వరాన్ని చూడడము :-- ధర్మా మీటర్ ను రెక్టం లో వుంచి చూసినపుడు 104 డిగ్రీలు వుంటే జ్వరం వుంటే జ్వరం వున్నట్లు, 107 డిగ్రీల జ్వరం వుంటే తీవ్రమైన జ్వరం అని భావించాలి.

తిప్పతీగ రసం --- రెండు టీ స్పూన్లు
తేనె               --- తగినంత

        పచ్చి తీగ దొరకని పక్షంలో ఎండు  తీగ పొడిని కషాయం లాగా కాచి తాగాలి.
పటికను పెనం మీద పొంగించాలి. పూటకు చిటికెడు పొడిని సమానంగా చక్కర కలిపి రోజుకు మూడు సార్లు ఇవ్వాలి లేదా తేనెతో ఇవ్వాలి.

తులసి ఆకుల రసం         ---- ఒక టీ స్పూను
సోంపు గింజల చూర్ణం        --- ఒక టీ స్పూను
నిమ్మ గడ్డి                       --- గుప్పెడు

అన్నింటిని నీటిలో వేసి కషాయం కాచాలి.

పూటకు 40 ml చొప్పున మూడు పూటలా సేవిస్తూ వుంటే తగ్గిపోతుంది.

                                పసి పిల్లలకు గోళ్ళు తీయాలంటే                       23-12-10.

    పసి పిల్లలకు గోళ్ళు తీయాలంటే స్నానం చేయించిన తరువాత సులభంగా Baby Cutter తో తీయవచ్చు.నిద్రించేటపుడు తీయొచ్చు.లేదా ఒల్లో కూర్చోబెట్టుకుని కధలు చెప్తూ, టి. వి చూపుతూ తీయొచ్చు.

                      చిన్న పిల్లలకు తీసుకున్న ఆహారం వంటబట్టడానికి          5-1-11.

ఎండుద్రాక్ష కు తగినంత తేనె, కలకండ కలిపి ఆహారానికి ముందు ప్రతి రోజు అర టీ స్పూను ముద్దనుతినిపించాలి.

                                       ఛిన్న పిల్లలలో మధుమేహం                         8-1-11.

తల్లిదండ్రులలో మధుమేహ లక్షణాలుంటే తప్పక పిల్లల మీద ప్రభావం వుంటుంది. పెద్దలలో
లక్షణాలుంటే పిల్లలలో కూడా అవే లక్షణాలుంటాయి. గాయాలు మానక పోవడం, రక్తస్రావం ఆగకపోవడం. మొదలైనవి.

పొడపత్రి ఆకు చూర్ణం                --- 100 gr
ఉసిరిక పొడి                            --- 100 gr
పసుపు పొడి                           --- 100 gr
వేప గింజల పప్పు పొడి              ---- 50 gr
నేల ఉసిరి సమూల చూర్ణం         ---- 50 gr

  పొడపత్రి ఆకు నమిలి నీళ్ళు తాగితే తీపి తెలియదు.
అన్నింటిని కల్వంలో వేసి నీరు కలిపి మాత్ర కట్టుకు వచ్చే వరకు నూరాలి. పెసర గింజంత మాత్రలు చేయాలి.
పూటకు ఒకటి చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాడుతూ వుంటే మధుమేహం శాతం
పెరగ కుండా కాపాడుకోవచ్చు.

  ఈవ్యాధి వున్నవాళ్ళకు ఎక్కువగా రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైన ఆహారాన్ని ఇవ్వాలి.

                                               చిన్న పిల్లలలో అలర్జీ                          18-1-11.

తిన్న ఆహారం గిట్టక వచ్చే అలర్జీ ని తగ్గించడానికి క్యారట్ రసానికి సమానంగాపంచదార కలిపి తాగించాలి.

                                    పిల్లలు పుష్టిగా పెరగాలంటే                              11-3-11.

     వేరు శనగ  గింజలను కొద్దిగా వేయించి  నలిపి పొట్టు ,  నాలుకలను తొలగించాలి. బెల్లం, చక్కెర
 కలిపి పాకం పట్టి దానిలో ఈ పప్పులను వేసి  చెక్కలుగా,  ఉండలుగా చేసి పిల్లలకు ఇవ్వాలి.
    దీని వలన పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.

                        వైద్యుడు లేని చోట                                                    13-3-11.

      చంటి బిడ్డకు సమయానికి పాల బాటిల్ లేకపోతే  డ్రాపర్ తో  తాగించాలి.స్ట్రా తో పాలను పీల్చి
   నెమ్మదిగా,  కొద్దికొద్దిగా  బిడ్డ నోట్లో వేయాలి. నోట్లో వేసేటపుడు  స్ట్రా ను ఒక పక్కకు ఉంచాలి.

                        బలహీనంగా వున్నపిల్లలు బలంగా తయారవడానికి                   9-4-11.

               బాగా మగ్గిన అరటిపండు గుజ్జు
                                    పెరుగు
                                    బెల్లం
        అన్నింటిని కలిపి తినిపిస్తే  పిల్లలు బలంగా తయారవుతారు.

                                               చిన్న పిల్లలలో  రక్తలేమి                                        11-4-11   

    కారణాలు:-- పొట్టలో నులిపురుగుల వలన మాటిమాటికి జ్వరం రావడం,  జలుబు, ఐరన్ లోపం
    సరైన పోషక పదార్ధాల లేమి,  మొదలైన కారణాల వలన పిల్లలలో     రక్తలేమి  సమస్య ఏర్పడుతుంది.

1. టమాటో రసం
2. ఉడికించిన ఆపిల్ జ్యూస్
3. రెండు ఖర్జూరాలను నానబెట్టి , పిసికి , బెల్లం కలిపి తాగించడం
4. పైన చెప్పబడిన వాటిని పెద్ద పిల్లలకైతే పండ్లను నేరుగా తినిపించవచ్చు.

5.             గింజలు తీసిన ఎండు ఖర్జూరం ముక్కలు            ---100 gr
                                               నల్ల నువ్వులు                --- అర టీ స్పూను
                                                       నీళ్ళు                    --- ఒక గ్లాసు

     అన్నింటిని కలిపి గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి కాచి అర గ్లాసుకు రానిచ్చి వడకట్టి తాగాలి.

6.             దోరగా వేయించిన నువ్వుల పొడి             ---50 gr
                                          మంజిష్ఠ  పొడి           --- 50 gr
                               సుగంధపాల వేర్ల పొడి            --- 25 gr
                                          ఎండుఖర్జూరం        ---100 gr
                                                      బెల్లం       --- తగినంత

       అన్నింటిని కలిపి నూరి శనగ గింజలంతమాత్రలు చేసుకొని నేరుగా తినడం లేదా మింగడం చెయ్యాలి.
రెండు,  మూడు నెలలలో మంచి మార్పు కనిపిస్తుంది. చర్మం యొక్క రంగు కూడా మారుతుంది.

                                                పిల్లలలో ఆకలి తగ్గడం                                          13-4-11.
     
        పిల్లలకు తీవ్రమైన జలుబు చేసినపుడు కఫం కడుపులోకి  చేరడం వలన ఆకలి బాగా
  తగ్గుతుంది.

         అల్లం రసం
         నిమ్మ రసం
         తేనె  

    అన్నింటిని సమానంగా తీసుకుని కలిపి పిల్లల చేత నాకించాలి. రోజుకు రెండు,  మూడు సార్లు
 నాకిస్తే బాగా ఆకలవుతుంది.
    సాయంకాలం బాగా ఆడాలి.

                 పసి పిల్లలకు వచ్చే ఆకుపచ్చని విరేచనాలు తగ్గడానికి చిట్కా             26-5-11.

    ఎన్ని నెలల పిల్లలైతే అన్ని ఆవాల గింజలను తీసుకొని వేయించి,  పొడి చేసి దానికి తగినంత
తేనె కలిపి నాకించాలి.

                        పిల్లలలో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి                                      2-6-11
                                        బాల సంజీవని

వాము పొడి                     --- 50 gr
మిరియాల పొడి               --- 50 gr
శొంటి పొడి                       --- 50 gr
తులసి ఆకుల పొడి           --- 50 gr
సైంధవ లవణం                 --- 20 gr
 
      పై పదార్దాలన్నింటిని కల్వంలో వేసి నీటితో గాని తులసి ఆకుల రసంతో గాని లేదా తిప్ప తీగ
ఆకు రసంతో గాని నూరవచ్చు.  శనగ గింజలంత మాత్రలు తయారు చేసుకోవాలి.

     పిల్లలకు ఏ సమస్య లేకున్నా గాని ప్రతి రోజు ఒక మాత్రను నీటిలో కలిపి గాని లేదా తేనెలో
రంగరించి గాని ఇవ్వవచ్చును.

                   పిల్లలో మలబద్ధకం నివారణకు --- ద్రాక్షా క్షీరం                                4-6-11.

ఎండిన నల్ల ద్రాక్ష                         ----10 gr
          నీళ్ళు                            ----150 ml
          పాలు                            ---- 150 ml
          చక్కెర                           ---- తగినంత

      ద్రాక్షను మెత్తగా దంచి గాని,  పిసికి గాని నీటిని   కలిపి మరిగింఛి అరకప్పు ( 75 ml ) కు
రానివ్వాలి. తరువాత పాలు కలిపి మరిగించాలి. దించి తగినంత చక్కెర కలపాలి. అలాగే కాని లేదా 
వడపోసి తాగించాలి .  పిప్పిలో కూడా మంచి గుణాలు వుంటాయి . అలాగే తాగితే మంచిది

     దీనిని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చగా ఇవ్వాలి. ఒక టీ స్పూను నెయ్యి కూడా కలిపి
ఇస్తే మంచిది .

    పిల్లలకు ఎక్కువగా పండ్లు తినిపించాలి, నీళ్ళు తాగించాలి . ఆటలాడిస్తూ వుండాలి . మలవిసర్జన .
సమయంలో తొందర పెట్టకూడదు .

                          పిల్లలలో జ్ఞాపకశక్తి పెరగడానికి ---మేధామృత చూర్ణం               5-6-11.

బ్రాహ్మిమొక్క చూర్ణం               --- 40 gr
అశ్వగంధ          "                  ----20 gr
వసకోమ్ముల     "                   ----10 gr
చందనం చెక్క   "                  ---- 10 gr
అతిమధురం     "                  ---- 10 gr

      అన్నిచూర్ణాలను బాగా కలిపి గాలి చొరబడని సీసాలో భద్రపరచుకోవాలి .

      పూటకు ఒక గ్రాము నుండి నాలుగు గ్రాముల చూర్ణాన్ని నేతితో గాని , పాలతో గాని తీసుకోవాలి
ఆహారం తరువాత తీసుకోవాలి .   నెయ్యి సమానంగా,  పాలైతే అర కప్పు తీసుకోవాలి .

సూచనలు :-- ప్రతిరోజు ఆరు రుచులు కలిగిన సంపూర్ణ ఆహారం తీసుకోవాలి .  పోషకాహారం తీసుకోవాలి  ఒత్తిడిని తగ్గించుకోవాలి . శరీరమంతా నూనెతో మర్దన చేసి స్నానం చేయించాలి
ముక్కులో నువ్వుల నూనె చుక్కలు వేసుకుంటూ వుండాలి .


                                   చిన్న పిల్లలలో  కడుపులో నొప్పి ---నివారణ                         12-6-11.

కారణాలు :--- ఆయిల్ ఫుడ్ తినడం, ఐస్ క్రీం తినడం, మరియు సబ్బు, చాక్ పీస్, మట్టి వంటివి
తినడం వలన కడుపులో నొప్పి వస్తుంది.

                                          ఉదర సంజీవని చూర్ణం

శొంటి పొడి                              ---ఒక గ్రాము
సైంధవ లవణం                                  "
యాలకుల గింజల చూర్ణం                   "
గంటు బారంగి వేరు చూర్ణం                  "
పొంగించిన ఇంగువ చూర్ణం                   "
              నెయ్యి                              "

      ఒక గిన్నెలో అన్ని చూర్ణాలను వేసి నెయ్యి వేసి కలపాలి.

      పూటకు రెండు గ్రాముల చొప్పున వేడి నీటిలో బాగా కలిపి పిల్లలకు ఇవ్వాలి. లేదా చిన్న చిన్న
మాత్రలు గా చేసి  నీటితో గాని,  తేనెతో గాని కలిపి ఇవ్వాలి.  ఈ విధంగా రోజుకు రెండు పూటలు
ఇవ్వాలి.
సూచనలు :--- పిల్లలకు పూర్తి స్థాయి విశ్రాంతి ఇవ్వాలి.   ద్రవాహారాన్ని సిప్స్  గా ఇవ్వాలి. స్పీడ్ గా
తాగించ కూడదు. అల్లం సూప్ ఇవ్వవచ్చు.  సూప్ కి తేనె కలిపి ఇవ్వ వచ్చు. పాలు ఇవ్వకూడదు.

                                                        పిల్లలలో ఎముకల ద్రుడత్వానికి          29-6-11.

తొక్క తీసిన బాదం పప్పులు                  --- ఒకటి  లేక  రెండు  
                               తేనె                    --- తగినంత

      ఒకటిన్నర సంవత్సరం పిల్లలకు ఒక్క బాదం పప్పును మాత్రమె ఇవ్వాలి . ఆ పైన రెండు ఇవ్వ వచ్చు .
      నానబెట్టిన బాదం పప్పులను తేనె కలిపి మెత్తగా నూరాలి . దీనిని పిల్లలు స్నానం చేసి వచ్చిన వెంటనే తినిపించాలి .
      మొదట ఒక  పూట తో  ప్రారంభించాలి .  కొద్ది రోజుల తరువాత రెండు పూటలా ఇవ్వాలి .
 
      దీనివలన  పిల్లల ఎముకలు దృడం గా తయారవుతాయి .



                                                 
     




                                      









    



















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి